Skip to main content

Holidays: డిగ్రీ, పీజీ ప్రెగ్నెంట్‌ విద్యార్థులకు ప్రసూతి సెలవులు.. ఎక్క‌డంటే..?

కేరళలో తొలిసారిగా మహాత్మగాంధీ విశ్వవిద్యాలయం ప్రెగ్నెంట్‌ విద్యార్థులకు 60 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేసింది. అందవుల్ల వారు ఎలాంటి ఆటంకం లేకుండా చదువును కొనసాగించవచ్చునని పేర్కొంది.
Mahatma Gandhi University, Kerala
Mahatma Gandhi University

ఈ మేరకు వైస్‌ ఛాన్సలర్‌ సీటీ అరవింద కుమార్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సిండికేట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రసూతి సెలవులు ప్రసవానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చునని తెలిపింది. అది కూడా మొదటి లేదా రెండవ గర్భధారణకు.. కోర్సు వ్యవధిలో ఒకసారి మాత్రమే మంజూరు చేయబడుతుందని పేర్కొంది. అలాగే సెలవుల వ్యవధిలో ఒక్కొసారి పబ్లిక్‌ సెలవులు, సాధారణ సెలవులను ఉంటాయని, ఐతే ఆ సెలవులతో దానితో కలపమని తెలిపింది. అంతేగాదు అబార్షన్‌, ట్యూబెక్టమీ తదితర సందర్భాల్లో సుమారు 14 రోజుల సెలవు మంజూరు చేయబడుతుందని పేర్కొంది.

పైగా ప్రెగ్నెన్సీ కారణంగా విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడకుండా.. ఒక సెమిస్టర్‌లో ప్రసూతి సెలవులు తీసుకుంటున్నవారు ఆ సెమిస్టర్‌లో పరీక్షల కోసం నమోదు చేసుకోవడానికి అనుమతించడం జరుగుతుంది. అయితే తదుపరి సెమిస్టర్‌లో రెగ్యులర్‌ విద్యార్థుల తోపాటు దానిని సప్లిమెంటరీగా రాయవచ్చు. అందువల్ల వారు సెమిస్టర్‌ కోల్పోరు.

సెలవుల్లో ప్రాక్టికల్‌, ల్యాబ్‌, వైవా పరీక్షలు ఉన్నట్లయితే..
ఎందుకంటే వారి ప్రసూతి సెలవు ముగిసిన తర్వాత తమ బ్యాచ్‌వారి తోపాటు తర్వాత సెమిస్టర్లను కొనసాగించవచ్చు అని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఈ ప్రసూతి సెలవుల్లో ఉన్న విద్యార్థులకు ప్రాక్టికల్‌, ల్యాబ్‌, వైవా పరీక్షలు ఉన్నట్లయితే సంస్థ లేదా విభాగాధిపతి ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిండికేట్‌ కమిటీ నిర్ణయించింది. ఈ సెలవులు పొందేందుకు మూడు రోజుల ముందు దరఖాస్తుతోపాటు మెడికల్‌ సర్టిఫికేట్‌ను సమర్పించాలని పేర్కొంది.

Published date : 24 Dec 2022 04:16PM

Photo Stories