Jobs Opportunities: కంపెనీ సెక్రటరీ కోర్సుతో ఉపాధి అవకాశాలు
శ్రీకాకుళం న్యూకాలనీ: కంపెనీ సెక్రటరీ కోర్సు పూర్తి చేయడం వల్ల అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐసీఎస్‌ఐ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ ఆఫీ సర్ పీఆర్‌వీ శివరామకృష్ణ పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్) కళాశాలలో కళాశాల వాణిజ్యశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో సోమవారం కంపెనీ సెక్రటరీ కోర్సుకు సంబంధించిన అవగాహన సదస్సును బీకాం విద్యార్థులకు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కంపెనీ సెక్రటరీ కోర్సు, సీఏ, ఐసీడబ్ల్యూల ప్రాధా న్యతలను వివరించారు. ఇంజినీర్లు, డాక్టర్లకు మించిన ప్యాకేజీలు లభించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో కామర్స్ హెచ్‌ఓడీ ఎల్.కృష్ణారావు, వైస్ ప్రిన్సిపాల్ పి.శంకరనారాయణ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎస్.పద్మావతి, చింతాడ కృష్ణారావు, కె.లలితాభాయి సిబ్బంది పాల్గొన్నారు.
చదవండి: Law Course Admissions: లా కోర్సుల్లో ప్రవేశాలు.. ఆన్‌లైన్ కౌన్సెలింగ్
Tags
- jobs opportunities
- Company Secretary Course
- Career
- employment opportunities
- Jobs
- Govt Jobs
- Executive Officer Jobs
- Education News
- andhra pradesh news
- PRVSivaramakrishna
- ExecutiveOffice
- Visakhapatnam
- ICSI
- CompanySecretary
- EmploymentOpportunities
- Certification
- CareerProspects
- ProfessionalDevelopment
- ICSIExecutive
- sakshi education job notifications
- latest jobs in 2023