Skip to main content

Jawahar Navodaya Vidyalaya: విద్యార్థుల భవిష్యత్తుకు 'నవోదయం'.. సీటు సాధిస్తే ఏడు సంవత్సరాల పాటు ఉచిత విద్యాబోధన.. ప‌రీక్ష ఎప్పుడంటే..?

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ.. ఉత్తమ విద్యా బోధన అందిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలోని బనవాసి జవహర్‌ నవోదయ విద్యాలయం పేరుగాంచింది.
Innovative teaching methods at Banavasi Jawahar Navodaya Vidyalaya   Jawahar Navodaya Vidyalaya Exam Date 2024 Class 6 Out  Banavasi Jawahar Navodaya Vidyalaya
బనవాసి నవోదయ విద్యాలయం ముఖద్వారం

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యనందించేందుకు 1986లో దీనిని స్థాపించారు. 2023–2024 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశానికి 6,120 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి జ‌న‌వ‌రి 20వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఇందు కోసం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 22 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసుకన్న విద్యార్థులు హల్‌టికెట్స్‌ను https:// cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మొత్తం 80 సీట్లు..
నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో సీటు సాధిస్తే ఏడు సంవత్సరాల పాటు ఉచిత విద్య అందుతుంది. బనవాసి జవహర్‌ నవోదయ విద్యాల యంలో 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బాలికలకు 30 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయిస్తున్నారు. మొత్తం 80 సీట్లలో 75 శాతం అంటే 60 సీట్లను గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, 20 సీట్లు పట్టణ ప్రాంతాల విద్యార్థులకు కేటాయిస్తారు.


అత్యుత్తమ విద్యా ప్రమాణాలు
నవోదయ విద్యాలయంలో సీబీఎస్‌ఈ కూడిన అత్యుత్తమ విద్యా బోధన అందిస్తారు. నిపుణులైన అధ్యాపకలు బోధిస్తారు. సువిశాల ప్రాంగణం, ఆహ్లాదకర వాతావరణం, అధునాత కంప్యూటర్‌ ల్యాబ్‌, పోషక విలువలతో కూడిన ఆహారం, మానసికోల్లాసానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా, ఎన్‌సీసీ తదితర అంశాలు నవోదయ విద్యాలయ ప్రత్యేకతలు. సీబీఎస్‌ఈ పరీక్ష ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తూ నవోదయాలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.

పరీక్ష విధానం ఇదీ..
నవోదయ ప్రవేశ పరీక్ష 100 మార్కులకు 80 ప్రశ్నలు ఉంటాయి. సమయం రెండు గంటలు. దివ్యాంగులకు అదనంగా 40 నిమిషాలు సమయం ఇస్తారు. మేధాశక్తిని పరీక్షిచేందుకు 50 మార్కులకు 40 ప్రశ్నలు, గణితంలో ప్రతిభను తెలుసుకునేందుకు 25 మార్కులకు 20 ప్రశ్నలు, భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు 25 మార్కులకు 20 ప్రశ్నలు ఇస్తారు.


అత్యుత్తమ ప్రమాణాలు
విద్యాలయంలో అత్యుత్త మ విద్యాప్రమాణాలు ఉన్నాయి. విద్యార్థుల సర్వోతోముఖాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. విద్యాలయంలో కేరీర్‌ గైడెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేశాం. న్యూట్రీషియన్‌ ఆధ్వర్యంలో పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నాం. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. – పద్మావతి, ప్రిన్సిపాల్‌, బనవాసి నవోదయ

 

Postal Jobs: పదో తరగతి పాస్ అయితే చాలు.. నెలకు రూ.63000 జీతంతో ప్రభుత్వ ఉద్యోగం..!

Published date : 17 Jan 2024 12:19PM

Photo Stories