IGNOU Entrance Exams: ఇగ్నో ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education

వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నిర్వహించే వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె.సుమలత తెలిపారు. ఇగ్నో నిర్వహించే బీఎడ్, బీఎస్సీ (నర్సింగ్), పీహెచ్‌డీ కోర్సులకు సంబంధించి 2024 వ సంవత్సరానికి జనవరి ఏడో తేదీన దేశ వ్యాపితంగా ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా ఆయా కోర్సులకు ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఇగ్నో వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. మరింత సమాచారం కోసం విజయవాడ కొత్తపేట హిందూ హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని లేదా ఫోన్ –0866 2565253కు సంప్రదించాలని కోరారు.
Published date : 18 Dec 2023 10:20AM