Skip to main content

Free Training: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

Invitation of applications for free training  SBI Rural Self Employed Training Institute Offers Free In-House Wiring Training from December 26

తిమ్మాపూర్‌: ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 26 నుంచి హౌస్‌ వైరింగ్‌(పురుషులకు)లో 30 రోజుల ఉచిత శిక్షణ ప్రారంభమవుతుందని సంస్థ డైరెక్టర్‌ డి.సంపత్‌ తెలిపారు. ఆసక్తిగలవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. అభ్యర్థులు ఉమ్మడి కరీంనగర్‌ (పెద్దపల్లి, సిరిసిల్ల జగిత్యాల, కరీంనగర్‌) జిల్లాలకు చెందినవారై ఉండాలని, శిక్షణ కాలంలో ఉచిత భోజనం, హాస్టల్‌ వసతి ఉంటుందని తెలిపారు. శిక్షణ అనంతరం టూల్స్‌, యూనిఫామ్‌ ధ్రువీకరణ పత్రం అందిస్తామన్నారు. దరఖాస్తుదారుల వయసు 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు ఉండాలని సూచించారు. దరఖాస్తు ఫామ్‌తోపాటు ఎస్సెస్సీ మెమో, తెల్ల రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జిరాక్స్‌లతోపాటు నాలుగు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు జతపర్చాలని సూచించారు. వివరాలకు 9949448157 నంబర్‌ సంప్రదించాలని తెలిపారు.

చ‌ద‌వండి: Job Mela: 12న జాబ్‌ మేళా

Published date : 09 Dec 2023 02:50PM

Photo Stories