Skip to main content

Self Employment Training: 27న స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు

రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్‌ నైరేడ్‌లో ఈ నెల 27న స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్‌ కె.శశిధర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Self-employment training interviews on 27th, says Director K. Sasidhar. Interview for self employment training, Important update: Director K. Sasidhar schedules self-employment training interviews for the 27th at GMR Nairade,

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుగల నిరుద్యోగ సీ్త్ర, పురుషులు ఈ శిక్షణకు అర్హులన్నారు. పురుషులకు సీసీటీవీ రిపేరింగ్‌ అండ్‌ ఇన్‌స్టాలేషన్‌ (13 రోజులు), ఎలక్ట్రికల్‌ హౌస్‌వైరింగ్‌ అండ్‌ ఫ్యాన్‌ రివైండింగ్‌ (30 రోజులు), కార్‌ డ్రైవింగ్‌ (ఎల్‌ఎల్‌ఆర్‌ కలిగి ఉండాలి)లో 30 రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. సీ్త్రలకు లేడీస్‌ టైలరింగ్‌, మగ్గం వర్క్‌, కంప్యూటర్‌ బేసిక్స్‌ అండ్‌ టాలీలో 30 రోజుల శిక్షణ ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు పదో తరగతి మార్కుల లిస్టు, రేషన్‌ కార్డు, ఆధార్‌కార్డులతో రావాలని సూచించారు. శిక్షణ డిసెంబర్‌ 1 నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సదుపాయం కల్పించనున్నామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 9014716255, 9491741129, 9866913371, 9989953145 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

చ‌ద‌వండి: Mega Job Mela: 30న మెగా జాబ్‌ మేళా.. ఎంపికైన అభ్యర్థులకు కనీస వేతనం రూ.25,000 వ‌ర‌కు వేతనం..

Published date : 25 Nov 2023 05:45PM

Photo Stories