Skip to main content

Embedded Systems in Daily Life: ఎంబెడెడ్‌ సిస్టమ్స్ రోజూ జీవితంలో ఎంతో కీల‌కం..

మిట్స్ ఇంజినీరింగ్ క‌ళాశాల‌ను సంద‌ర్శించిన స్విట్జ‌ర్లాండ్ ప్రొఫెస‌ర్ మ‌న రోజూ జీవితంలో కీల‌కంగా మారిన ఎంబెడెడ్‌ సిస్టమ్స్ గురించి చ‌ర్చించారు. శుక్ర‌వారం జ‌రిగిన అధ్యాప‌కుల స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ఇలా మాట్లాడారు..
Switzer land Professor Cedric speaking about embedded system
Switzer land Professor Cedric speaking about embedded system

సాక్షి ఎడ్యుకేష‌న్: మనిషి దైనందిన జీవితంలో ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ పాత్ర కీలకంగా మారిందని స్విట్జర్లాండ్‌ హెచ్‌ఈఐజీవీడీ ఇన్‌స్టిట్యూట్‌ ఎంబెడెడ్‌ డిజిటల్‌ సిస్టమ్స్‌ ప్రొఫెసర్‌ సెడ్రిక్‌ బోర్నాండ్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మదనపల్లె దగ్గరున్న మిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను సందర్శించారు. అధ్యాపకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక జీవితంలో ప్రతి రంగంలో ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ పాత్ర గణనీయంగా పెరుగుతోందన్నారు.

➤   Complaint on Principal: ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల ప్రిన్సిపాల్ పై ఫిరియాదు.. కార‌ణం?

గృహోపకరణాలు, స్మార్ట్‌ఫోన్లు, ఏటీఎం, జీపీఎస్‌, ఫిట్‌నెనెస్‌ ట్రాక్టర్లు, టీవీ, థర్మోస్టాట్లు, వైద్య పరికరాలు, కెమెరాలు తదితర మైనవి ఎంబడెడ్‌ టెక్నాలజీ ద్వారానే నడుస్తున్నాయన్నారు. ఆశాజనక ప్యాకేజీతో ఉద్యోగావకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయన్నారు. దీనిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ కాంబినేషన్‌లో ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ను డిజైన్‌ చేయడమే ఎంబెడెడ్‌ సిస్టమన్నారు.

➤   Asian Shooting Championship 2023: ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల జోరు

ప్రపంచం మరింత డిజిటల్‌గా కనెక్ట్‌ చేయబడి ఆటోమేటెడ్‌గా మారుతోందన్నారు. ఎంబెడెడ్‌ టెక్నాలజీ ద్వారానే ఇది సాధ్యపడుతుందన్నారు. భవిష్యత్తులో ఈ రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఉంటుందన్నారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.

Published date : 28 Oct 2023 01:19PM

Photo Stories