RGUKT: ట్రిపుల్‌ఐటీ విద్యార్థులకు 3 వేల ల్యాప్‌టాప్‌లు
నూజివీడు: ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలవాలని ఆర్జీయూకేటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య జి.విజయ్‌కుమార్ అన్నారు. స్థానిక ట్రిపుల్‌ఐటీలో పీయూసీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు, ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు కలిపి మూడు వేల ల్యాప్‌టాప్‌లను గురువారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తోందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని సూచించారు. ల్యాప్‌టాప్‌లపై బోధన రాష్ట్రంలో ఏ ఇంజినీరింగ్ కళాశాలలో లేదన్నారు. ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ ఆచార్య జీవీఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్రిపుల్‌ఐటీల్లో సదుపాయాలను విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. మంచి లక్షణాలు ఉన్న ల్యాప్‌టాప్‌లను మంజూరు అందిస్తోందన్నారు. ఏవో ప్రదీప్, ఒంగోలు, శ్రీకాకుళం డైరెక్టర్లు జయరామిరెడ్డి, జగదీశ్వరరావు, అడ్మిషన్ల కన్వీనర్ ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు, డీఎస్‌డబ్ల్యూఓలు ఎస్‌వీ వెంకట్రావు, వి.స్రవంతి పాల్గొన్నారు.