MBBS Students: ఎంబీబీఎస్ విద్యార్థులకు శుభవార్త
Sakshi Education
శివాజీనగర: ఎంబీబీఎస్ చదివే అల్పసంఖ్యాక సముదాయపు మెరిట్ విద్యార్థులకు రుణాల స్థాయిని రూ.5 లక్షలకు పెంచేందుకు యోచిస్తున్నట్లు రాష్ట్ర గృహవసతి, అల్పసంఖ్యాకుల సంక్షేమ మంత్రి జమీర్ అహమ్మద్ తెలిపారు. కర్ణాటక అల్పసంఖ్యాకుల అభివృద్ధి మండలి ద్వారా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పథకాలను ప్రారంభించిన ఆయన, ప్రస్తుతం కేఎండీసీ ద్వారా ప్రభుత్వ కోటా కింద సీటు పొందే మెరిట్ విద్యార్థులకు రూ.3 లక్షలు రుణాలు ఇస్తారు, దీన్ని రూ. 5 లక్షల వరకు పెంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. అల్పసంఖ్యాకుల సంక్షేమ కార్యదర్శి మనోజ్ జైన్, డైరెక్టర్ జిలాని మోకాశి, కేఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు.
చదవండి: JNTU Anantapur Results 2023: బీటెక్, బీ–ఫార్మసీ ఫలితాల విడుదల
Published date : 23 Aug 2023 02:56PM