Free Training: బైక్ రిపేరీలో ఉచితంగా శిక్షణ పొందేందుకు దరఖస్తులు..
Sakshi Education
యువతకు బైక్ రిపేరీలో ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు ఈ సంస్థ డైరెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి ఉండాల్సిన అర్హతలు గురించి తెలిపారు. అలాగే, ఆసక్తి గల వారు ప్రకటించిన తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు..
సాక్షి ఎడ్యుకేషన్: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో క ర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత యువకులకు బైక్ రిపేరీలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ బి.శివప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
Good News for Unemployed Youth: ప్రభుత్వ కొలువుల భర్తీకి గరిష్ట వయోపరిమితి పొడిగింపు
మార్చి 5 నుంచి 30 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు. చదవడం, రాయడం వచ్చి ఉండాలని తెలిపారు. శిక్షణ కాలంలో భోజనంతోపాటు హాస్టల్ వసతి కల్పిస్తామని, ఆసక్తి కలిగిన యువకులు మరి న్ని వివరాలకు 63044 91236 నంబ రుకు ఫోన్ చేయవచ్చని సూచించారు.
Published date : 13 Feb 2024 12:31PM