Free training: స్కిల్ హబ్‌లో ఉచిత శిక్షణ.. చివరి తేదీ ఇదే..
Sakshi Education
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో చేబ్రోలులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్‌లో ఉచిత శిక్షణకు నిరుద్యోగ యువత ఈనెల 28లోపు పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.ప్రణయ్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్కిల్ హబ్‌లో డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ కల్పించి, గుంటూరు జిల్లాలోని వివిధ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఇంటర్, ఆపైన విద్యార్హత కలిగిన యువతీ, యువకులు ఈనెల 28లోపు స్కిల్ హబ్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, ఇతర వివరాలకు 96665 45975 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
చదవండి: Group 2 Preparation Plan: గ్రూప్–2పై గురిపెట్టండిలా!
Published date : 26 Dec 2023 03:29PM
Tags
- Free training at Skill Hub
- Skill Hub
- Free training in Skill Hub
- Free training
- Andhra Pradesh State Skill Development Corporation
- apssdc
- Unemployed youth for free training
- Unemployed Youth
- Data Entry Operator Course
- employment opportunities
- Education News
- andhra pradesh news
- Skill Development
- youth employment
- training program
- Skill Hub Initiative
- apssdc
- Career Development
- Vocational training
- employment opportunities
- sakshi education