Results: 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు ఇలా..
ఐసీఎస్‌సీ 10వ తరగతి, ఐఎస్‌ఈ 12వ తరగతి సెమిస్టర్ 1 పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ సెమిస్టర్ పరీక్షలను గతేడాది నవంబర్ 29 నుంచి డిసెంబర్ 16 వరకు నిర్వహించిన విషయం తెల్సిందే. ఇక ఐఎస్‌సీ పరీక్షలను నవంబర్ 22 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించారు.పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఎస్‌ఎమ్‌ఎస్ సేవల ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. కాగా పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపల్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలతో కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.
రివాల్యువేషన్ కోసం..
విద్యార్థులు ప్రశ్నాపత్రాల రివాల్యువేషన్ కోసం పేపర్‌కు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇందుకోసం ఫిబ్రవరి 7 నుంచి 10 వరకు ఈ వెసులుబాటు కల్పించారు. కరోనా కారణంగా గతేడాది ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని పరీక్షలను రద్దు చేసినట్లే ఈ పరీక్షలను కూడా రద్దు చేశారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. అయితే ఈసారి కరోనా పరిస్థితులు మెరుగుపడడంతో పరీక్షలు నిర్వహించి ఫలితాలను నిర్వహించారు.