Skip to main content

DEO Exams: 25వ తేదీన డీఈఓ ప‌రీక్ష‌లు..

డీఈఓ ఇన్‌ ఏపీ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ ఉద్యోగాలకు ఈనెల 25న జ‌ర‌గ‌నున్న‌ట్లు డీఆర్‌ఓ కొండయ్య తెలిపారు..
Examination for the posts of DEO in AP Educational Services conducted under APPSC

పుట్టపర్తి అర్బన్‌: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీఈఓ ఇన్‌ ఏపీ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ ఉద్యోగాలకు ఈనెల 25న పుట్టపర్తిలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఆర్‌ఓ కొండయ్య పేర్కొన్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకూ పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం 7.30 గంటలకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. ఉదయం 8.30 గంటల తరువాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రాన్ని బీడుపల్లి సమీపంలోని సంస్కృతి స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Online Evaluation: ఈసారి ప‌రీక్ష‌ల‌ మూల్యాంక‌నం ఆన్‌లైన్ విధానంలో..

Published date : 24 May 2024 03:32PM

Photo Stories