Skip to main content

AP Model School Teachers: ‘మోడల్‌’ టీచర్లకు ఈహెచ్‌ఎస్‌(ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం) అభయం

EHS Implementation to AP Model School Teachers

జూపాడుబంగ్లా: ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఈహెచ్‌ఎస్‌(ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం) వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 271జీవోను విడుదల చేసింది. దీంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 36 మోడల్‌ స్కూళ్లు ఉండగా 720 మంది ఉపాధ్యాయులు 2013 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఈహెచ్‌ఎస్‌ సౌకర్యం లేకపోవడంతో చిన్న పాటి వైద్యానికి, శస్త్రచికిత్స కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. టీడీపీ హయాంలో అప్పటి పాలకులు వీరి సమస్యను పట్టించుకోలేదు. పెద్ద మనసుతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి మోడల్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు సైతం ఈహెచ్‌ఎస్‌ వర్తింపజేస్తూ జీవో 271ని విడుదల చేశారు. దీంతో వైద్యం కోసం వెచ్చించిన మొత్తం మెడికల్‌ రీయింబర్స్‌మెంటుకింద వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఉపాధ్యాయులు, వారి కుటుంబసభ్యులు ఎవరైనా దీర్ఘకాలిక జబ్బులబారిన పడినా, రోడు్‌డ్‌ ప్రమాదాలకు గురైనా ఈహెచ్‌ఎస్‌ కింద ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవచ్చు. అలాగే శస్త్రచికిత్సలు సైతం చేయించుకోవచ్చు. నంద్యాల జిల్లా పరిధిలో 20 పాఠశాలలుండగా అందులోని 400మంది ఉపాధ్యాయులకు, కర్నూలు జిల్లాలో 16 పాఠశాలలుండగా 320మంది ఉపాధ్యాయులకు ఈహెచ్‌ఎస్‌ వరంగా మారనుంది.

చదవండి: National Education Day 2023: అక్షరాస్యతలో దేశం ఎక్కడుంది?

Published date : 11 Nov 2023 05:05PM

Photo Stories