Skip to main content

IVM Service: ఐవీఎం సేవ‌ల‌కు ప్ర‌శంస‌లు

పేద విద్యార్థుల చ‌దువు కోసం, బాల‌బాలిక‌ల కోసం ఐవీఎం అందిస్తున్న సేవ‌ల‌కు అవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యే అభినంద‌న‌లు తెలిపారు. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల‌కు విద్యా సహాయం, మహిళల ఆర్థిక స్వావలంబనకు శిక్షణ సాయం చేశారు.
IVM's contributions to empowering students and women applauded by local MLA.,MLA Ramesh Babu with students,Avanigadda MLA lauds IVM for their support to students and women in need.
MLA Ramesh Babu with students

సాక్షి ఎడ్యుకేష‌న్: పేద విద్యార్థులకు ఐవీఎం (ఇండియా విలేజ్‌ మినిస్ట్రీస్‌) సురేష్‌ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌ బాబు తెలిపారు. పురిటిగడ్డలో ఐవీఎం స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ వేములపల్లి సురేష్‌ ఆధ్వర్యంలో ఆదివారం 220 మంది విద్యార్థులకు రూ.28 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. ప్రతిభ కలిగి ప్రైవేట్‌ స్కూళ్లలో చదువుకుంటున్న పేద విద్యార్థులు 190 మందికి రూ.20 లక్షలు సాయం చేశారు.

Web Counselling: స్విమ్స్ లో వెబ్ కౌన్సెలింగ్

పలు కళాశాలలు, యూనివర్సీటీల్లో ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ చదువుతున్న 30 మంది పేద విద్యార్థులకు రూ.8 లక్షలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రమేష్‌ బాబు ఐవీఎం సహాయాన్ని విద్యార్థులకు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా పేదలు, విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్న ఐవీఎం సురేష్‌ అభినందనీయులని చెప్పారు. పేద విద్యార్థులు విద్యావంతులై మరికొందరికి సహాయం చేయాలని సూచించారు.

NCC Discipline: ఎన్‌సీసీ వంటి క్ర‌మ‌శిక్ష‌ణే విజ‌యానికి పునాది

సురేష్‌ మాట్లాడుతూ కరోనాకు ముందు అనాథ బాల, బాలికలకు విద్యా సహాయం, మహిళల ఆర్థిక స్వావలంబనకు శిక్షణ కార్యక్రమాలు, ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ చేశామన్నారు. కోవిడ్‌లో ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు సహాయం, నియోజకవర్గంలో 20 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం అందించినట్లు తెలిపారు. గత కొన్నేళ్లుగా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐవీఎం డైరెక్టర్‌ వేములపల్లి రోజా, విజయ, ఐవీఎం ట్రస్ట్‌ సభ్యులు పి.రాజేష్‌ బాబు, మాజీ సర్పంచ్‌ పరుచూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Published date : 17 Oct 2023 12:55PM

Photo Stories