Skip to main content

Telangana : రేప‌టి నుంచే దసరా హాలీడేస్.. మొత్తం ఎన్ని రోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు.. ఈ ఏడాది దసరా పండుగ సెలవులను 15 రోజులపాటు ఇస్తున్న‌ట్టు అధికారికంగా ప్రకటించింది.

దసరా పండుగ నేపథ్యంలో.. సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకు (15 రోజులు) సెలవులు ఇస్తున్నట్టు ఒక‌ ప్రకటనలో పేర్కొంది. అలాగే అక్టోబర్‌ 10వ తేదీన విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి.

After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

అక్టోబర్‌ 5వ తేదీన దసరా పండుగగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సారి దుర్గాదేవి న‌వ‌రాత్రి ఉత్సవాల‌కు(దసరా) ఈ సారి స్కూల్స్‌, కాలేజీ  భారీగా సెల‌వుల‌ను ఇచ్చారు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే హాలీడేస్ ను ప్ర‌క‌టించారు. అలాగే ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు స్కూల్స్‌కు, కాలేజీల‌కు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు సెల‌వులు ప్ర‌క‌టించాయి.

దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని.. సెలవుల కుదింపుపై వస్తున్న వార్తలను తెలంగాణ విద్యాశాఖ ఖండించింది. కుదింపుపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. సెప్టెంబ‌ర్ 26వ తేదీ నుంచి అక్టోబర్‌ 9 వరకు దసరా సెలవులు కొనసాగుతాయని విద్యాశాఖ ప్రకటించింది.

చ‌ద‌వండి: What After Tenth: ఎన్నో అవకాశాలు... కోర్సు ఎంపికలో ఆసక్తి ప్రధానం

ఒక వైపు భారీగా సెల‌వులు.. మ‌రోవైపు సిల‌బ‌స్ స‌మ‌స్య‌తో..

Syllabus

విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా దసరా సెలవులను తగ్గించాలని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యు కేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌–ఎస్‌సీఈఆర్‌టీ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధారెడ్డి పాఠశాల విద్య డైరెక్టర్‌కు ఓ లేఖ కూడా రాశారు. జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ నెల 11 నుంచి 16 రోజులపాటు సెలవులు, ఈ నెల 17న జాతీయ సమైక్యతాదినోత్సవాన్ని పురస్కరించుకుని మరో సెలవు.. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవుల వల్ల స్కూళ్లు మూతపడ్డాయని పేర్కొన్నారు.

ఏపీ ప‌దోత‌ర‌గ‌తి స్ట‌డీమెటీరియ‌ల్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్ పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

సెల‌వులను త‌గ్గించాల‌నే ఆలోచ‌న రావ‌డానికి ప్రధాన కారణం ఆయా తరగతుల విద్యార్థులకు సిలబస్ పూర్తి కావడంలో ఆలస్యం అవుతుండటమే. వ‌రుస‌గా సెల‌వులు రావ‌డం  వ‌ల్ల‌.. ఇది సిలబస్‌పై ప్ర‌భావం పడినట్లు విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అనుకున్న ప్రకారం దసరా సెలవులు ఇస్తే సమయానికి సిలబస్ పూర్తి కాదని.. ఆ తర్వాత పరీక్షల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని పాఠశాల విద్యాశాఖ వాద‌న‌.

10th Class Model Papers: టెన్త్ పేపర్ ఎలా ఉంటుంది?.. మోడల్ పేపర్లు ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండిలా..

దసరా పండుగ ఊరికి వెళ్లే విద్యార్థుల‌కు బంఫ‌ర్ ఆఫ‌ర్‌..

ts rtc

వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్న టీఎస్‌ ఆర్టీసీ ప్రయాణికులకు చేరువయ్యేందుకు పరుగులు పెడుతోంది. బస్సుల వద్దకే ప్రయాణికులు రావడం కాదు.. ప్రయాణికుల వద్దకే బస్సును పంపే కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇంటర్మీడియెట్ మోడల్ పేపర్స్

పాఠశాలలకు ఈ నెల 25 నుంచి బతుకమ్మ, దసరా పండుగ సెలవులు ఇస్తున్న క్రమంలో వారి వారి స్వగ్రామాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం హాస్టల్‌ వద్దకు ఆర్టీసీ బస్సులు పంపే ఏర్పాట్లు చేశారు. 30మందికి పైగా విద్యార్థులు ఒకే రూట్‌లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం కల్పించడం ద్వారా విద్యార్థులు లగేజీ బరువుతో బస్టాండ్‌కు చేరుకునే ఇబ్బందులు తప్పుతాయి. ఆటో, ఇతర రవాణా ఖర్చులు తగ్గుతాయి. విద్యార్థులు, హాస్టల్‌ నిర్వాహకులు సమీపంలోని బస్‌ డిపోకు సమాచారం అందించాల్సి ఉంటుంది.

ఇంటర్మీడియెట్ ప్రివియస్‌ పేపర్స్

సమాచారం ఇస్తే బస్సు పంపుతాం..
దసరా సెలవుల్లో స్వస్థలాలకు వెళ్ళే విద్యార్థుల సౌకర్యార్థం వారి వద్దకే బస్సులు పంపే ఏర్పాట్లు చేశాం. 30 మందికి పైగా విద్యార్థులుంటే సరిపోతుంది. బస్సు వారి ఆవాసం ఉంటున్న వసతి గృహం వద్దకు చేరుకుని విద్యార్థులను ఎక్కించుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతుంది. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, హాస్టల్‌ నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

​​​​​​​ఇంటర్మీడియెట్ స్టడీ మెటీరియల్

Published date : 24 Sep 2022 01:21PM

Photo Stories