Helwan University: హెల్వన్ యూనివర్సిటీతో డాక్టర్ అంబేడ్కర్ చైర్ ఏంఓయూ
ఏఎన్‌యూ: ఈజిప్ట్ రాజధాని కై రోలోని హేల్వాన్ యూనివర్సిటీతో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ సెంటర్ ఫర్ డాక్టర్ అంబేద్కర్ చైర్ ఎంఓయూ కుదుర్చుకుంది. ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్ ఎంఓయూ పత్రాలను హేల్వాన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సయీద్ కండిల్‌కు పంపారు. కండిల్ ఏంఓయూ పత్రాలపై సంతకాలు చేసి ఏఎన్‌యూ పంపారు. ఎంఓయూ పత్రాలను వీసీ మంగళవారం అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్ వై.అశోక్‌కుమార్‌కు అందజేశారు. వీసీ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక ఈజిప్ట్ దేశంలోనే హల్వాన్ యూనివర్సిటీతో జరిగిన ఎంఓయూ వర్సిటీకి మరింత ఖ్యాతిని పెంచుతోందన్నారు. బోధన, పరిశోధన, సామాజిక, సాంస్కృతిక రంగాలలో రెండు యూనివర్సిటీల మధ్య అకడమిక్, సైంటిఫిక్, కల్చరల్ అంశాల్లో పరస్పర సహకారం ఉంటుందన్నారు. సదస్సులు, ఎగ్జిబిషన్, వర్క్‌షాప్, సంభంధిత అంశాల్లో స్వల్ప వ్యవధి గల కోర్సులు, సంయుక్త ప్రాజెక్టులు నిర్వహణ, అధ్యాపకులు, పరిశోధకులు, స్టూడెంట్స్ మద్య మార్పులు, పీజీ, పీహెచ్‌డీల్లో సంయుక్తంగా పర్యవేక్షణ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కోన్నారు. కార్యక్రమంలో రిజిస్టర్ ఆచార్య బి.కరుణ, అంబేడ్కర్ చైర్ విభాగాధిపతి ఆచార్య వై.అశోక్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.అబ్రహం లింకన్, అడ్మిషన్‌ల డైరెక్టర్ డాక్టర్ అనిత, అధ్యాపకులు పాల్గొన్నారు.