Skip to main content

FLN Training Classes: ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణ తరగతులు ప్రారంభం..

District level FLN training classes started

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాస్థాయి ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభించారు. తొలిమెట్టు ఎఫ్‌ఎల్‌ఎన్‌ జిల్లాస్థాయి మూడు రోజుల శిక్షణ కార్యక్రమం గణపురం మండలంలోని చెల్పూరు ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కోర్సు డైరెక్టర్‌ కాగిత లక్ష్మణ్‌ హాజరై మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలలో అమలు జరుగుతున్న తొలి మెట్టు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు పరచడానికి ఈ విద్యా సంవత్సరం ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతీ విద్యార్థిలో కనీస అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. శిక్షణ అనంతరం మండల స్థాయిలో విషయ అంశాల వారీగా శిక్షణ కార్యక్రమం జిల్లాలోని ప్రాథమిక ఉపాధ్యాయులందరికీ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జుమ్మునాయక్‌, సీఎంఓ కిషన్‌రావు, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ దుప్పటి రాజగోపాల్‌, గణపురం ఎంఈఓ సురేందర్‌, గణపురం మండల నోడల్‌ ఆఫీసర్‌ ఉప్పలయ్య, జిల్లా ఏఎస్‌ఓ కరుణాకర్‌, స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్‌ టి.స్వామి, జిల్లా రిసోర్స్‌ పర్సన్‌లు రామయ్య, రవీందర్‌, రఘునందన్‌, శ్రీకాంత్‌, గణేష్‌ పాల్గొన్నారు.
 

Biology teacher: ఆయనో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు.. విద్యార్థులకు సులభ పద్ధతిలో పాఠాలు

Published date : 25 Jul 2023 03:43PM

Photo Stories