Govt Schools: డిజిటల్ పాఠాలు
మంచిర్యాల అర్బన్: సర్కారు బడుల్లో పాఠ్యాంశాల బోధనకు ప్రభుత్వం నూతన హంగులు జోడిస్తోంది. విద్యాప్రమాణాల పెంపునకు మరింత కృషి చే స్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు డిజిటల్ బోధన మరింత చేరువయ్యేలా విద్యాశాఖ నడుం బిగించింది. దశలవారీగా జిల్లాలో 528 పాఠశాలల కు 533 ట్యాబ్‌లు, 77 డిజిటల్ తెరలు అందించింది. కంప్యూటర్లు కూడా అందించేందుకు ఆదేశాలు జారీ చేసింది. కేజీబీవీలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అందించారు. ఇంతవరకు కంప్యూటర్లు లేని 47 ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా కంప్యూటర్లు ఇవ్వనున్నారు. పూర్వ మండలాలకు సంబంధించి 14 ఎమ్మార్సీల కార్యాలయాలకు ఆరు కంప్యూటర్లు, ఒక ప్రింటర్, యూపీఎస్, కంప్యూటర్ ఫర్నిచర్ అందించనున్నారు. 47 పాఠశాలలకు 320 కంప్యూటర్లు, 14 ఎమ్మార్సీలకు ఆరు చొప్పున మొత్తం 84 కంప్యూటర్ల పంపిణీకి చర్యలు వేగవంతం చేశారు.
పీఐజీ–డీ కొలమానంగా..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు తిరోగమనం దిశగా సాగుతున్నాయని పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఫర్ డిస్ట్రిక్ట్ (పీజీఐ–డీ) స్పష్టం చేస్తోంది. పాఠశాల విద్యావ్యవస్థలో జిల్లాల వారీగా పనితీరు అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీజీఐ–డీ విడుదల చేస్తోంది. 2021–222 విద్యాసంవత్సరానికి సంబంధించిన నివేదికతో జిల్లా వెనుకబడినట్లు తెలుస్తోంది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, గదుల్లో ప్రభావవంతమైన కార్యకలాపాలు, మౌలిక వసతులు, పాఠశాల భద్రత, విద్యార్థుల రక్షణ, డిజిటల్ విద్యాభ్యాసం, పరిపాలన తదితర అంశాల్లో పీఐజీ–డీని కొలమానంగా తీసుకుంటారు. ప్రతిభ చాటిన పాఠశాలలకు దక్ష, అత్యుత్తమ, ఉత్తమంగా గ్రేడింగ్ ఇస్తారు. డిజిటలైజేషన్ బలోపేతం దిశగా కంప్యూటర్ పరికరాలు అందించాలని విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
చదవండి: VC: కోర్సుల్లో కొత్త సిలబస్.. ఉద్యోగ అవకాశాలు లభించేలా..
డిజిటల్ తెరలపై పాఠాలు..
జిల్లాలో దృశ్య రూపంలో పాఠాలు చెబితే పిల్లలకు విషయాలు ఎంతో అర్థమవుతాయనే ఉద్దేశంతో డిజిటల్ బోధన చేస్తోంది. బ్లాక్‌బోర్డుల స్థానంలో గ్రీన్ చాక్‌బోర్డులతో 77 పాఠశాలల్లో డిజిటల్ తెర పద్ధతిలో బోధన చేసేందుకు అవసరమైన పరికరాలు సమకూర్చారు. 75 ఇంచులు కలిగిన మానిటర్లు, మెటల్ ఫ్రేమ్‌తో కూడిన గ్రీన్ చాక్‌బోర్డు మానిటర్ (మూసివేస్తే గ్రీన్ చాక్‌బోర్డుగా.. తెరిస్తే దృశ్య బోధన మానిటర్‌గా) ఉపయోగించుకోవచ్చు. టచ్ స్క్రీన్ సదుపాయం కూడా ఉంది. ఈనేపథ్యంలో ఇదివరకు అందించని 47 పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా 320 కంప్యూటర్లు అందించనున్నారు.
47 పాఠశాలలు ఇవే..
జిల్లాలో 47 పాఠశాలలకు కంప్యూటర్లు అందించనున్నారు. జెడ్పీహెచ్‌ఎస్ (చాకెపల్లి), కేజీబీవీ (బెల్లంపల్లి), జెడ్పీహెచ్‌ఎస్ (వీజ్‌గాన్), కేజీబీవీ (భీమిని), కేజీబీవీ (భీమారం), జెడ్పీహెచ్‌ఎస్ (ఎన్‌పీ వాడ, చెన్నూర్), జెడ్పీహెచ్‌ఎస్ (సుద్దాల), జెడ్పీహెచ్‌ఎస్ (పొక్కూర్), జెడ్పీహెచ్‌ఎస్ (దుగ్నేపల్లి), జెడ్పీహెచ్‌ఎస్ (కొమ్మెర), కేజీబీవీ (చెన్నూర్), జెడ్పీహెచ్‌ఎస్ (మామిడిపల్లి), జెడ్పీహెచ్‌ఎస్ (గుడిరేవు), జెడ్పీహెచ్‌ఎస్ (గూడెం), జెడ్పీహెచ్‌ఎస్ (కోర్విచెల్ల), జెడ్పీహెచ్‌ఎస్ (వెల్గనూర్), టీఎస్‌ఎంఎస్ (లింగాపూర్, దండేపల్లి), కేజీబీవీ (దండేపల్లి), జెడ్పీహెచ్‌ఎస్ (రాపల్లి), జెడ్పీహెచ్‌ఎస్ (షెట్‌పల్లి), జెడ్పీహెచ్‌ఎస్ (కవ్వాల్), జెడ్పీహెచ్‌ఎస్ (మురిమడుగు), జెడ్పీహెచ్‌ఎస్ (కామన్‌పల్లి), జెడ్పీహెచ్‌ఎస్ (ఇంధన్‌పల్లి), కేజీబీవీ (జన్నారం), జెడ్పీహెచ్‌ఎస్ (జన్కాపూర్), జెడ్పీహెచ్‌ఎస్ (బోగూడ గూడెం), జెడ్పీహెచ్‌ఎస్ (ముత్యంపల్లి), జెడ్పీహెచ్‌ఎస్ (సిర్సా), జెడ్పీహెచ్‌ఎస్ (పారిపల్లి), జెడ్పీహెచ్‌ఎస్ (అన్నారం), టీఎస్‌ఎంఎస్ (కోటపల్లి), జెడ్పీహెచ్‌ఎస్ (వెంకట్రావ్‌పేట్), జెడ్పీహెచ్‌ఎస్ (ఇటక్యాల), జెడ్పీహెచ్‌ఎస్ (లక్ష్మీపూర్), కేజీబీవీ (లక్సెట్టిపేట), ప్రభుత్వ ఉన్నత పాఠశాల (సినిమావాడ, మంచిర్యాల), కేజీబీవీ (మంచిర్యాల), జెడ్పీహెచ్‌ఎస్ బాయ్స్ మందమర్రి (ఒర్రెగడ్డ), కేజీబీవీ (మందమర్రి), జెడ్పీహెచ్‌ఎస్ (నస్పూర్), జెడ్పీహెచ్‌ఎస్ (మైలారం), కేజీబీవీ (తాండూర్), కేజీబీవీ (నెన్నెల), జెడ్పీహెచ్‌ఎస్ (వేమనపల్లి), కేజీబీవీ (వేమనపల్లి).
విద్యార్థులు వినియోగించుకోవాలి
ప్రభుత్వ పాఠశాలల ను డిజిటలైజేషన్‌లో బలోపేతం చేయడంలో భాగంగా ప్రాథమి క, ప్రాథకోన్నత పాఠశాలలకు ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేసింది. ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఇచ్చింది. కంప్యూటర్లు అసలే లేని 47 పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా కంప్యూటర్లు ఇవ్వనుంది. కంప్యూటర్లు, రెండు గంటల బ్యాకప్ కలిగిన యూపీఎస్, 14 పా త మండలాలకు ఎనిమిది కంప్యూటర్ల చొ ప్పున త్వరలోనే అందించనుంది. మండలా లు, పాఠశాలలు డిజిటలైజేషన్ చేస్తూ పర్ఫామెన్స్ గైడ్ ఇండికేటర్‌లో జిల్లా స్కోర్ పెంచనున్నారు. డీఈవో యాదయ్య సూచన మేర కు ఈ వసతులను ఉపాధ్యాయులు, విద్యార్థులు వినియోగించుకుని బోధన అభ్యసన ఉన్నతంగా సాగేందుకు చర్యలు చేపట్టాలి.
– శ్రీనివాస్, సెక్టోరల్ అధికారి, మంచిర్యాల