Distance Education: దూరవిద్యకు ప్రవేశాలు.. చివరి తేదీ?
Sakshi Education
దూరవిద్యావిధానంలో టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ప్రవేశాలను పొందేందుకు ఇచ్చిన గడువును పోడుగించినట్లు ప్రకటనలో తెలిపారు. ప్రకటించిన గడువులోగా విద్యార్థులు సీట్లను భర్తీ చేసుకోవాలని, వాటి వివరాలను తెలిపారు..
సాక్షి ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలకు అపరాధ రుసుముతో ఈనెల 13 వరకు గడువు పొడిగించినట్లు హనుమకొండ డీఈఓ ఎండీ అబ్దుల్‌హై, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ మురాల శంకర్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
NITI Aayog: శతాబ్ధి నాటికి అగ్రస్థానంలో భారతదేశం
దూరవిద్యా విధానంలో టెన్త్, ఇంటర్‌లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు తమ సమీపంలోని అధ్యయన కేంద్రాలైన ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలను, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని సూచించారు. ఫీజులు మీసేవ, ఆన్‌లైన్ చెల్లించాలని, మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలంగాణఓపెన్‌స్కూల్.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో చూడొచ్చని తెలిపారు.
Published date : 07 Oct 2023 04:50PM