Skip to main content

Collector Inspection: 400 మందికి 30 మంది టీచర్లా!..ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

Collector Inspection  Local school headmaster being questioned by Collector Nagalakshmi about student and teacher numbers

ప్రత్తిపాడు: ‘400 మంది విద్యార్థులకు 30 మంది ఉపాధ్యాయులా? వెయ్యి మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లోనూ 30 మంది టీచర్లే ఉంటున్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఏం ప్రయత్నాలు చేశారు? ఒక్కరోజే 50 మంది విద్యార్థులు పాఠశాలకు ఎందుకు గైర్హాజరయ్యారు? మీరేం చర్యలు తీసుకున్నారు?’ అంటూ కలెక్టర్‌ నాగలక్ష్మి స్థానిక భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంను ప్రశ్నించారు.

NCERT Recruitment 2024: ఎన్‌సీఈఆర్‌టీలో డైరెక్ట్‌ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

ప్రత్తిపాడులో బుధవారం కలెక్టర్‌ నాగలక్ష్మి పర్యటించారు. ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆమె స్కూల్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారని హెచ్‌ఎం శ్రీనివాసరావును ప్రశ్నించారు. 401 మంది ఉన్నారని, అందులో 50 మంది ఈ రోజు హాజరు కాలేదని చెప్పారు. 50 మంది ఒకే రోజు బడికి రాకపోవడానికి కారణాలు ఏమిటని అడగడంతో, వర్షాల వల్ల రాలేదంటూ హెచ్‌ఎం సమాధానమిచ్చారు.

TG B.Arch. 2024 Admissions: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ కోర్సుల్లో ప్రవేశాలు.. షెడ్యూల్‌ విడుదల

దీంతో అసహనానికి గురైన కలెక్టర్‌ ఏదో వర్షాలు ఎడతెరపిలేకుండా పడుతున్నట్లు చెబుతున్నారు? కొద్దిపాటి వర్షాలకే విద్యార్థులు పాఠశాలకు రాలేదా? వారి గైర్హాజరుకు గల కారణాలను వారి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి కనుక్కున్నారా అని ప్రశ్నించడంతో హెచ్‌ఎం బదులివ్వలేకపోయారు. విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచించారు.

అనంతరం మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం గురించి ఆరా తీశారు. పాఠశాల ఆవరణలో అరెకరం విస్తీర్ణంలో కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
 

Published date : 02 Aug 2024 09:42AM

Photo Stories