NIT Warangal : నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్, డ్యూయల్ మేజర్ ప్రోగ్రామ్ బీఎస్సీ–బీఈడీ కోర్సులు..
Sakshi Education
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో 2023–24 విద్యా సంవత్సరానికిగాను నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్, డ్యూయల్ మేజర్ ప్రోగ్రామ్ బీఎస్సీ–బీఈడీ కోర్సును ప్రారంభిస్తున్నట్లు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్‌ఈపీ)–2020కి అనుగుణంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సీటీఈ) సౌజన్యంతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్ విభాగాలతో డ్యూయల్ మేజర్ ప్రోగ్రామ్ బీఎస్సీ–బీఈడీని అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. బీఎస్సీ–బీఈడీ కోర్సులో చేరేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు ఈఅవకాశాన్ని వినియోగించుకోవాలని పూర్తి వివరాలకు www.nta.ac.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.
Published date : 14 Jul 2023 06:24PM