Skip to main content

Bharat bandh Effect : విద్యా సంస్థలకు సెలవులు.. పరీక్షలు కూడా రద్దు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
schools holidays
schools holidays

అందులో భాగంగానే జూన్ 20వ తేదీన‌(సోమవారం) దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సంస్థలు, రైల్వే స్టేషన్ల వద్ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

పాఠశాలలు మూసివేస్తున్నట్టు
ఇదిలా ఉండగా.. అగ్నిపథ్ పథకానికి నిరసనగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) జార్ఖండ్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ క‍్రమంలో జార్ఖండ్‌ ప్రభుత్వం కీలక నిర‍్ణయం తీసుకుంది. సోమవారం జార్ఖండ్‌లోని అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న 9, 11 తరగతుల పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్బంగా పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం కార్యదర్శి రాజేష్ కుమార్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని సంస్థలు పిలుపునిచ్చిన బంద్ దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు సోమవారం మూసివేయాలని నిర్ణయించాము. పాఠశాల విద్యార్థులకు, ముఖ్యంగా బస్సులో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు తల్తెతకుండా ఉండేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

Published date : 20 Jun 2022 09:13AM

Photo Stories