Ayurvedic Medical College: ఆయుర్వేద వైద్యకళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా అశోక్‌కుమార్
Sakshi Education
కాశిబుగ్గ : వరంగల్‌లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ కె.అశోక్‌కుమార్ అక్టోబర్ 11న బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న విజయ్‌గణేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా బదిలీ అయ్యారు. అదేకళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న అశోక్‌కుమార్‌ను వరంగల్ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్ హరిచందన అక్టోబర్ 10న మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, బాధ్యతలు చేపట్టిన అశోక్‌కుమార్‌కు కళాశాల, వైద్యశాల ప్రొఫెసర్లు, వైద్యులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
చదవండి: IIT Recruitment 2023: ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Published date : 12 Oct 2023 05:17PM