Employment Skills Courses: ఉద్యోగ, ఉపాధి నైపుణ్యకోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
Sakshi Education
కాశీబుగ్గ: పలాసలో డాక్టర్ కణితి ప్రభుత్వ ఐటీఐలో ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వల్ప కాలిక కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ పైల జవహర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పీబీ సాయి శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఉద్యోగ, ఉపాధి నైపుణ్య కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. అసిస్టెంట్ సర్వేయర్ కోర్స్‌ను ప్రారంభిస్తున్నామని టెన్త్ ఉత్తీర్ణత, ఆపైన పాసైన విద్యార్హత కలిగి 18–28 ఏళ్ల లోపు వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్‌పోర్టు ఫొటో, ఆధార్ జిరాక్స్ సెట్లతో హాజరు కావాలని, వివరాల కోసం6301046329కు సంప్రదించాలని సూచించారు.
Published date : 23 Dec 2023 09:08AM