Skip to main content

AP PG CET Counselling 2023: September 11 నుంచి పీజీ సెట్‌–2023 కౌన్సెలింగ్‌ ప్రారంభం

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఈ నెల 11 నుంచి రాష్ట్ర పీజీ సెట్‌–2023 కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుందని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం రిజస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. వర్సిటీ పరిపాలన కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు.
AP PGECET 2023 counselling in September 11th
AP PGECET 2023 counselling in September 11th

ఈ కౌన్సెలింగ్‌ ద్వారా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారని అన్నారు. వర్సిటీలో 16 కోర్సులు ఉన్నాయని చెప్పారు. ఆప్షన్ల ఎంపిక షెడ్యూల్‌ త్వరలో విడుదల కానుందని చెప్పారు. విద్యార్థులు ఈ విషయాలను గమనించాలని ఆయన కోరారు.

AP Skill Hubs: నిరుద్యోగ యువతకు వరం.. #APskillhub #sakshieducation

 

Published date : 06 Sep 2023 04:30PM

Photo Stories