Skip to main content

Andhra University: అంతర్జాతీయ వర్సిటీలకు దీటుగా ఏయూ

ఏయూక్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సోమవారం ఏయూ పూర్వ విద్యార్థి, అమెరికాకు చెందిన నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎన్‌వోఏఏ) చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ విజయ్‌ తల్లా ప్రగడ సందర్శించారు.
NOAA Representative Visits Andhra University    Andhra University Alumni Students    Dr. Vijay Talla Pragada, Chief Scientist of NOAA, visiting AU Campus

ముందుగా తాను చదువుకున్న ఏయూ వాతావరణ శాస్త్ర విభాగాన్ని సందర్శించి, అక్కడ ఆచార్యులతో కొద్దిసేపు సంభాషించారు. ఏయూ వాతావరణ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశోధనలు, వసతులు పరిశీలించారు. అనంతరం వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా విజయ్‌ తల్లాప్రగడ మాట్లాడుతూ అమెరికాలోని అత్యున్నత విశ్వవిద్యాలయాలైన ఎంఐటీ, హార్వర్డ్‌ వర్సిటీల తరహాలో ఏయూ అభివృద్ధి సాధిస్తోందన్నారు. తన విజయానికి బలమైన పునాదులు ఇక్కడే పడ్డాయని, వర్సిటీకి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. అనంతరం వర్సిటీ తరఫున అతన్ని వీసీ ప్రసాదరెడ్డి సత్కరించారు. పాలకమండలి సభ్యులు, ఏయూ వాతావరణశాస్త్ర విభాగాధిపతి ఆచార్య పి.సునీత, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.జేమ్స్‌ స్టీఫెన్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Andhra Pradesh Jobs 2024: ఆస్పత్రుల్లో 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. దరఖాస్తుకు ఇదే చివరి తేదీ..!

Published date : 13 Feb 2024 03:22PM

Photo Stories