Skip to main content

Unemployed youth: నవోదయంలో 260 దరఖాస్తులు స్వీకరణ

DRO K. Vinayakam receives applications from 260 SC and ST beneficiaries  Unemployed youth  260 SC and ST beneficiaries apply at Dr. BR Ambedkar Spanda Hall

నరసరావుపేట: కలెక్టరేట్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్పందన హాల్‌లో గురువారం నిర్వహించిన నవోదయంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.వినాయకం ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల నుంచి 260 దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున విద్య, ఉపాధి, వ్యాపారం, బ్యాంకు రుణాల కోసం నిరుద్యోగ యువకులు, మహిళలు తరలివచ్చారు. దరఖాస్తులను సంబంధిత బ్యాంకులు, ఉద్యోగాలు అవసరమైన లబ్ధిదారులకు ఆయా కంపెనీల ప్రతినిధులు వద్దకు పంపించగా, వారికి ఇంటర్యూలు నిర్వహించి ఎంపికై న 60 మంది అబ్యర్థులకు జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ వారిచే ఉచిత భోజనాలను ఏర్పాటు చేశారు. సాంఘిక సంక్షేమశాఖ పీడీ, నవోదయం అధికారి ఓబుల్‌ నాయుడు, నోడల్‌ ఆఫీసర్‌ సంజీవ్‌రావు, పలువురు ఎంపీడీఓలు, సచివాలయ సిబ్బంది, కలెక్టరేట్‌ స్టాఫ్‌, ఆయా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.

sakshi education whatsapp channel image link

Published date : 15 Dec 2023 04:12PM

Photo Stories