Sakshi education logo

ఏపీలో ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో తెలుగు మాధ్యమం కోరుకునే వారికోసం మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Education News తెలుగు మాధ్యమం పాఠశాలను ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 15 విడుదల చేసింది.

ప్రభుత్వ మార్గదర్శకాలు ఇవీ ...
  • మండల కేంద్రంలో తెలుగు మాధ్యమం పాఠశాలను నిర్వహించేందుకు సంబంధిత మండల విద్యాశాఖాధికారి స్కూల్‌ను గుర్తించాలి
  • తెలుగు మీడియం పాఠశాల గురించి ఆ మండలంలో ప్రచారం చేయాలి.
  • తెలుగు మాధ్యమ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయ హేండ్‌బుక్స్ రూపకల్పనకు ఎస్సీఈఆర్టీ చర్యలు తీసుకుంటుంది.
  • ఆంగ్ల మాధ్యమ పాఠశాలలతో పాటు అన్ని మైనర్ మీడియం పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలి.
  • ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా మీడియం పాఠశాలలు (ప్రైవేట్ యాజమాన్యం మినహా) వాటి వాటి మాధ్యమాల్లో కొనసాగవచ్చు.
Published on 3/24/2020 2:56:00 PM

సంబంధిత అంశాలు