Skip to main content

Nutritionist Jobs: ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ కోర్సు పూర్తి చేస్తే వచ్చే ఉద్యోగాలు ఇవే..!

ఈ కోర్సులను డిగ్రీ పీజీ స్థాయిలో పూర్తి చేస్తే వారికి ఉద్యోగాలు ఇలా ఉంటాయి..
Job offer and profile of  after Food and Nutrition course

సాక్షి ఎడ్యుకేషన్‌: ఫుడ్, న్యూట్రిషన్‌ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్, పీజీ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి విభిన్న జాబ్‌ ప్రొఫైల్స్‌ లభిస్తున్నాయి. ముఖ్యంగా వీరు న్యూట్రిషనిస్ట్, డైటిషియన్, ఫుడ్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ వంటి కొలువులు సొంతం చేసుకోవచ్చు. వీరికి ప్రారంభంలో రూ.రెండు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వరకు వార్షిక అందుతోంది.

న్యూట్రిషనిస్ట్‌
హెల్త్‌కేర్‌ రంగంలో, ముఖ్యంగా హాస్పిటల్స్‌లో న్యూట్రిషనిస్ట్‌ ఉద్యోగాలు లభిస్తాయి. రోగుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి.. వారు పాటించాల్సి­న ఆహార నియమాలపై సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా డయాబెటిస్, ఒబెసిటీ, ఇత­ర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆహార నియామాలను సూచించాల్సి ఉంటుంది.

Academic Year Admissions: ఐఎంయూలో ఈ విద్యా సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తులు..

డైటిషియన్‌
వ్యక్తులు ఆరోగ్యవంతంగా జీవించడానికి అవసరమైన ఆహారపు అలవాట్లను డైటిషియన్‌లు సూచిస్తారు. పోషకాహారం అంటే ఏమిటి.. ఆయా వ్యక్తుల అవసరాలకు తగ్గట్టు తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన నిబంధనలు తదితరాలను వీరు వివరిస్తారు.

ఫుడ్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌

ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడం, అదే విధంగా వీటికి సంబంధించి పరిశోధనలు చేయడం వంటి విధులు ఉంటాయి. ఆహార పదార్థాలను కెమికల్‌గా, బయలాజికల్‌గా పరీక్షించి.. నాణ్యమైన ఉత్పత్తిని రూపొందించేలా సూచనలు చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలు ఆహార పదార్థాల తయారీ సంస్థల్లో లభిస్తాయి.

Food and Nutrition Courses: డిగ్రీ, పీజీ స్థాయిలో న్యూట్రిషన్‌ కోర్సులు..

ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌/ఎగ్జిక్యూటివ్‌
ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి, వాటిలో లోటుపాట్లను గుర్తించడం.. నాణ్యమైన ఆహారం తయారీకి తీసుకోవాల్సిన చర్యలను చేపట్టడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రెండు రంగాల్లోనూ ఈ కొలువులు లభిస్తున్నాయి.
హెల్త్‌ ఎడ్యుకేటర్‌
ప్రభుత్వ విభాగంలో లభించే ఉద్యోగాల్లో ముఖ్యమైనది.. హెల్త్‌ ఎడ్యుకేటర్‌. ఆయా ప్రాంతంలోని ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించ­డం,అందుకోసం పాటించాల్సిన ఆహార నియమాలను సూచించడం వంటి విధులు వీరు నిర్వర్తించా­ల్సి ఉంటుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్‌ విభాగంలో ఈ కొలువులు లభిస్తాయి.

Admissions for Ph D Courses: ఐఐఎస్‌టీ పీహెచ్‌డీ కోర్సులకు ప్రవేశాలు.. దరఖాస్తులకు తేదీ..!

Published date : 26 Apr 2024 10:10AM

Photo Stories