Skip to main content

Joint Defence Cooperation Committee: భారత్‌-ఇండొనేషియా మ‌ధ్య రక్షణ సహకార కమిటీ సమావేశం

భారతదేశం, ఇండొనేషియా మధ్య రక్షణ సహకారాన్ని పటిష్టం చేసే దిశగా న్యూఢిల్లీలో చర్చలు జ‌రిగాయి.
7th India-Indonesia Joint Defence Cooperation Committee meeting held in New Delhi

భారత రక్షణ కార్యదర్శి గిరిధర్ అరామనే, ఇండొనేషియా రక్షణ శాఖ ప్రధాన కార్యదర్శి ఎయిర్ మార్షల్ మార్షల్ డానీ ఎర్మావాన్ టౌఫాంటో నేతృత్వంలో న్యూఢిల్లీలో 7వ భారత్‌-ఇండొనేషియా సంయుక్త రక్షణ సహకార కమిటీ (JDCC) సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య రక్షణ రంగ సహకారాన్ని మరింత విస్తరించేందుకు చర్చలు జరిగాయి.
రక్షణ సహకారం, రక్షణ పరిశ్రమల సహకారంపై జరిగిన కార్యాలయ సమూహాల సమావేశాలలో చర్చించిన వివిధ ద్వైపాక్షిక రక్షణ సహకార కార్యక్రమాల పురోగతిని కూడా సమీక్షించారు.

రక్షణ పరిశ్రమ రంగ సహకారం, బహుపాక్షిక సహకారం వంటి రంగాలలో ఇప్పటికే ఉన్న సహకారాన్ని మరింత పటిష్టం చేసే మార్గాలను గుర్తించారు.

Joint Trade Committee: భారత్‌-నైజీరియా మధ్య సంయుక్త వాణిజ్య కమిటీ సమావేశం

ఇండోనేషియా సైనిక ప్రధాన కార్యదర్శి భారతదేశ పర్యటన
➤ భారత పర్యటనలో ఉన్న ఇండోనేషియా సైనిక ప్రధాన కార్యదర్శి ఢిల్లీలోని డీఆర్‌డీఓ(DRDO) ప్రధాన కార్యాలయం, పూణేలోని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్&టి డిఫెన్స్ సదుపాయాలను సందర్శించారు.
➤ భారత ఫోర్జ్, మహీంద్రా డిఫెన్స్ & మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ వంటి ఇతర భారత రక్షణ రంగ భాగస్వాములతో కూడా సమావేశమయ్యారు. పరిశోధన, సంయుక్త ఉత్పత్తిలో సహకారం ద్వారా రక్షణ పారిశ్రామిక సామర్థ్యాలను పెంచే మార్గాలను చర్చించారు.
➤ పర్యటన సమయంలో ఆయన భారత రక్షణాధిపతి జనరల్ అనిల్ చౌహాన్‌ను కూడా కలసికొన్నారు.

Joint Trade Committee: భారత్‌, న్యూజిలాండ్‌ల మ‌ధ్య జ‌రిగిన‌ 11వ జాయింట్ ట్రేడ్ కమిటీ సమావేశం

Published date : 04 May 2024 06:06PM

Photo Stories