Skip to main content

బ్యాంకింగ్‌ రంగంలో కెరీర్‌ అవకాశాలు

Question
ప్రస్తుతం డిగ్రీ ఫైనల్‌ చదువుతున్నాను. బ్యాంకింగ్‌ రంగంలో కెరీర్‌ అవకాశాల గురించి చెప్పండి?
  • నిరుద్యోగులకు చక్కటి అవకాశాలు కల్పిస్తున్న రంగాల్లో బ్యాంకింగ్‌ ఒకటి. బ్యాంక్‌ కొలువులు అంటే క్లరికల్, ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాలు మాత్రమే కాదు. మరెన్నో కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.  ప్రధానంగా టెక్నాలజీ ఆధారిత సేవలు పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా బ్యాంకుల్లో ఐటీ విభాగంలో కొలువులు లభిస్తున్నాయి. 
  • అకడమిక్స్‌ పరంగా ఎకనామిక్స్, బ్యాంకింగ్, కామర్స్, అకౌంటెన్సీ, ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్, ఆడిటింగ్‌ నేపథ్యం ఉంటే సంప్రదాయ బ్యాంకు కొలువులకు సరితూగుతారు. ఇప్పుడు బ్యాంకులు అన్ని నేపథ్యాలు అభ్యర్థులను నియమించుకొని.. తమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తున్నాయి. గత కొన్నేళ్లుగా బ్యాంకులు నిర్వహిస్తున్న కార్యకలాపాలు, సేవల్లో సాంకేతికతను అమలు చేస్తున్నాయి. దీంతో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు సైతం అవకాశాలు పెరుగుతున్నాయి. జనరల్‌ పోస్టులతోపాటు ప్రత్యేకంగా ఐటీ విభాగాల్లో టెక్నాలజీ స్పెషలిస్ట్‌ నియామకాలు చేపడుతున్నాయి.

ఈ నైపుణ్యాలు ఉంటే

  • ఐబీపీఎస్, ఎస్‌బీఐల క్లర్క్, ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టుల ఎంపిక ప్రక్రియలో ప్రిలిమ్స్, మెయిన్స్‌ వంటి దశలు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్షలు ఉంటాయి. అప్టిట్యూడ్, ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్, క్వాంటిటేటివ్‌ స్కిల్స్, లాజికల్‌ రీజనింగ్‌లలో అభ్యర్థుల సామర్థ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే ఆయా ఎంపిక పరీక్షల్లో విజయం సాధించొచ్చు.

టెక్‌ కొలువులు

  • డేటా సెంటర్స్, నెట్‌వర్క్స్, డేటా బేసెస్‌ తదితర విభాగాల్లో.. ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీపై బ్యాంకులు ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆడిటర్స్, ఎథికల్‌ హ్యాకర్స్‌ వంటి నిపుణుల అవసరం ఏర్పడుతోంది. డేటా వేర్‌ హౌసింగ్, డేటా మైనింగ్, అనలిటిక్స్‌ నైపుణ్యాల్లో ప్రావీణ్యం పొందడం ద్వారా సంబంధింత విభాగంలో బ్యాంకింగ్‌ కొలువులను సొంతం చేసుకోవచ్చు.

Photo Stories