Skip to main content

వెనుకబడిన తరగతుల సంక్షేమం

వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ, విద్య, ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. వీరి కోసం ప్రత్యేకంగా బీసీ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలను నిర్వహిస్తోంది. బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ) విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ అనంతర ఫీ, ట్యూషన్ ఫీ రీయింబర్స్ తదితర కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది.
రాష్ట్రంలో 112 వెనుకబడిన వర్గాలు ఉన్నాయి. వీటిని ఎ, బి, సి, డి, ఇ అనే 5 కేటగిరీలుగా విభజించారు.
హాస్టళ్లు
  • రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల కోసం ప్రభుత్వం 490 హాస్టళ్లను నడుపుతోంది. వీటిలో 374 బాలుర కోసం, 116 బాలికల కోసం నిర్వహిస్తున్నారు.
  • 2014-15లో బీసీ హాస్టళ్లలో మొత్తం 49,370 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 37,740 మంది బాలురు, 11,630 మంది బాలికలు.
  • బీసీ సంక్షేమ హాస్టళ్లకు చెందిన విద్యార్థులు 2013-14లో పదోతరగతిలో 88.09% ఉత్తీర్ణత సాధించారు.
  • బీసీ హాస్టళ్లలో సామాజిక సమ్మిళితత్వం కోసం 76% బీసీలకు, 10% ఎస్సీలకు, 5% ఎస్టీలకు, 3% మైనార్టీలకు, 6% ఇతర వర్గాల కోసం సీట్లను కేటాయించారు.
  • మొత్తం 490 హాస్టళ్లకుగాను 362 హాస్టళ్లను ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్నారు. మిగిలిన హాస్టళ్లలో 31 భవనాలు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చే మ్యాచింగ్ (సమాన) గ్రాంట్స్ సహకారంతో నిర్మాణంలో ఉన్నాయి.
కాలేజీ విద్యార్థినీ, విద్యార్థులకు హాస్టళ్లు:
  • వెనుకబడిన తరగతులకు చెందిన బాలబాలికల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బాలబాలికలకు వేర్వేరుగా ఒక్కో హాస్టల్‌ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
  • 2014-15లో 247 కళాశాల హాస్టళ్లు పనిచేస్తున్నాయి. వీటిలో 123 బాలుర కోసం, 124 బాలికల కోసం ఏర్పాటు చేశారు.
  • కళాశాల వసతి గృహాల్లో సీట్లను 69% బీసీలకు, 15% ఎస్సీలకు, 6% ఎస్టీలకు, 10% మైనార్టీల కోసం కేటాయించారు.
రెసిడెన్షియల్ స్కూళ్లు:
  • 2014-15లో రాష్ట్రంలో 19 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో బాలుర కోసం 12, బాలికల కోసం 7 పాఠశాలలను కేటాయించారు.
  • బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 74% బీసీలకు 15% ఎస్సీలకు, 6% ఎస్టీలకు, 2% ఈబీసీలకు, 3% అనాథలకు కేటాయించారు.
  • మెదక్ జిల్లాలోని కౌడిపల్లి పాఠశాలను ప్రత్యేకంగా మత్స్యకారుల పిల్లల కోసం ఏర్పాటు చేశారు.
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఫీ రీయింబర్స్ మెంట్
కుటుంబ వార్షిక ఆదాయం లక్ష రూపాయల్లోపు ఉండి, అర్హత ఉన్న బీసీ విద్యార్థులందరికీ సంతృప్త స్థాయి ప్రాతిపదికన పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్, ట్యూషన్ ఫీ రీయింబర్స్ మెంట్స్ మంజూరు చేస్తున్నారు. 2013-14లో 6.96 లక్షల మంది బీసీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్, ట్యూషన్ ఫీ రీయింబర్స్ మెంట్ మంజూరైంది. బీసీ విద్యార్థులతో సమాన అర్హతలున్న ఈబీసీ విద్యార్థులకు కూడా ట్యూషన్ ఫీ రీయింబర్స్ మెంట్స్ వర్తింపజేస్తున్నారు.
  • వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ (Backward Classes Co-operative Finance Corporation Ltd) ద్వారా మార్జిన్ మనీ, రాజీవ్ అభ్యుదయ యోజన పథకాలను అమలు చేస్తున్నారు.
మైనార్టీల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్
మైనార్టీ వర్గాలకు చెందిన యువత ఉద్యోగాలకు పోటీపడేలా, ఆర్థికాభివృద్ధి సాధించడం కోసం శిక్షణ ద్వారా నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందు కోసం 2014-15లో రూ.20 కోట్లు కేటాయించారు.

మాదిరి ప్రశ్నలు

1. సమగ్ర కుటుంబ సర్వే (ఎస్‌కేఎస్) ప్రకారం అత్యధిక కుటుంబాలున్న జిల్లా రంగారెడ్డి కాగా, అత్యల్ప కుటుంబాలున్న జిల్లా ఏది?
1) ఆదిలాబాద్
2) నిజామాబాద్
3) హైదరాబాద్
4) ఖమ్మం

Published date : 10 Sep 2015 03:45PM

Photo Stories