Skip to main content

మరాఠాలు

  • మహారాష్ర్ట జాతిపిత - శివాజీ
  • మహారాష్ర్టుల రాజధానులుగా వర్ధిల్లిన ప్రాంతాలు - రాయ్‌గఢ్, జింజి, సవార, కొల్హాపూర్
  • శివాజీ ఆధ్యాత్మిక గురువు - సమర్థ రామదాస్
  • శివాజీ సంరక్షకుడు - దాదాజీ కొండదేవ్
  • శివాజీ తల్లిదండ్రులు - షాజీ భోంస్లే, జిజియాబాయి
  • శివాజీ తొలిసారి (క్రీ.శ.1646లో) ఆక్రమించిన ప్రాంతం - తోరణ దుర్గం
  • శివాజీని బంధించటం కోసం ఔరంగజేబు పంపినవారు - షయిస్థాఖాన్, రాజా జైసింగ్
  • శివాజీ, ఔరంగజేబుల మధ్య (క్రీ.శ.1665లో) జరిగిన సంధి - పురంధర్ సంధి
  • శివాజీ పట్టాభిషేక సంవత్సరం -1674
  • శివాజీ బిరుదు - ఛత్రపతి
  • శివాజీ విధించిన పన్నులు - చౌత్, సర్దేశ్‌ముఖి
  • శివాజీ రాజ్యం పేరు - స్వరాజ్
  • శివాజీ మంత్రిమండలి - అష్ట ప్రధానులు
  • శివాజీ వారసుడు - శంభాజీ
  • శంభాజీని సంహరించి, అతని కుమారుడిని బంధించిన వ్యక్తి - ఔరంగజేబు
  • మొఘలులను ఎదిరించిన మహారాష్ర్ట వీర వనిత - తారాబాయి
  • మహారాష్ర్టులు మధ్యయుగ భారత చరిత్రలో హిందూ ధర్మ పరిరక్షకులుగా తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
  • షాజీ భోంస్లే మహారాష్ర్టుల్లో తొలి ప్రముఖ నాయకుడు. ఇతను మాలోజీ భోంస్లే కుమారుడు.
  • షాజీ భోంస్లే అహ్మద్ నగర్ పాలకులైన నిజాంషాహీ వంశస్థుల కొలువులో పనిచేసి అందుకు ప్రతిఫలంగా పూనా జాగీరును పొందాడు.
  • మొఘలులు అహ్మద్‌నగర్‌ను ఆక్రమించేందుకు ప్రయత్నించినపుడు 3వ మార్తజాను రాజుగా ప్రకటించి వారిని ఎదిరించాడు. అయితే క్రీ.శ. 1636లో షాజహాన్ అహ్మద్‌నగర్‌ను మొగలు సామ్రాజ్యంలో విలీనం చేశాడు.
  • క్రీ.శ. 1664లో షాజీ భోంస్ల్లే బసవ పట్టణం వద్ద మరణించాడు.
శివాజీ
  • హిందూ మత సంరక్షకుడు, మహారాష్ర్ట జాతిపితగా పేరుగాంచిన శివాజీ.. షాజీ భోంస్లే, జిజియాబాయిల కుమారుడు.
  • శివాజీ ‘శివనేరు’ దుర్గంలో క్రీ.శ.1627లో జన్మించాడు.
  • శివాజీ తల్లి జిజియాబాయి దేవగిరి పాలకులైన యాదవ వంశానికి చెందిన లకోజీ మాధవరావు కుమార్తె.
  • శివాజీకి తల్లి అతని చిన్నతనం నుంచే వీరగాథలు చెబుతూ అతనిపై అధిక ప్రభావం కలిగించింది.
  • శివాజీ బాల్యం నుంచి దాదాజీ కొండదేవ్ సంరక్షకుడిగా ఉంటూ శివాజీకి యుద్ధ విద్యల్లో శిక్షణ ఇప్పించాడు.
  • ఏక్‌నాథ్, తుకారాం, రామదాసు వంటి ఆధ్యాత్మిక గురువులు శివాజీకి ముందే సంస్కృతి, మత పరంగా మహారాష్ర్ట ప్రాంత ప్రజలను ఏకం చేశారు.
  • ఆధ్యాత్మిక వేత్త సమర్థ రామదాస్ శివాజీపై అత్యంత ప్రభావం కలిగించాడు. ఆయన్ను శివాజీ ఆధ్యాత్మిక గురువుగా పేర్కొంటారు. సమర్థ రామదాస్ రచన ‘దాసబోధ’ ప్రభావం శివాజీపై అధికంగా ఉంది.
  • మహారాష్ర్టులను రాజకీయంగా ఏకం చేయటంలో భౌగోళిక పరిస్థితులు, ఎటువంటి కష్టపరిస్థితులనైనా ఎదుర్కొనే వారి శారీరక శ్రమ శివాజీకి చక్కగా ఉపయోగపడ్డాయి.
  • బీజాపూర్ సుల్తాన్ అనారోగ్య పరిస్థితిని అవకాశంగా తీసుకొని క్రీ.శ.1646లో శివాజీ తోరణ దుర్గాన్ని జయించాడు. విజయానంతరం తోరణకు సమీపంలో రాయగఢ్ దుర్గాన్ని నిర్మించాడు.
  • అనంతరం శివాజీ సింహగఢ్, కోండన్, పురంధర్ తదితర దుర్గాలను జయించాడు. సింహగఢ్ పేరును విజయగఢ్‌గా మార్చాడు.
  • శివాజీ దాడులతో ఆగ్రహించిన బీజాపూర్ సుల్తాన్ శివాజీ తండ్రిని బంధించాడు. దాడులు చెయ్యబోననే అంగీకారంతో శివాజీ తన తండ్రిని విడిపించాడు. తర్వాత 5 ఏళ్లపాటు (క్రీ.శ.1650-55) ఎలాంటి దాడులూ చేయలేదు.
  • శివాజీ క్రీ.శ.1653 నుంచి విజయ శకం అనే నూతన శకాన్ని ప్రారంభించాడు.
  • శివాజీ తిరిగి క్రీ.శ.1656లో కళ్యాణ్, భివండి, మహాలి ప్రాంతాలను జయించాడు. దీంతో ఆగ్రహించిన సుల్తాన్ ..‘అఫ్జల్ ఖాన్’ అనే సేనానిని శివాజీపైకి పంపాడు. శివాజీ అతన్ని పులి పంజా ధరించి హత్య చేశాడు.
  • బీజాపూర్ సుల్తాన్ శివాజీని బంధించేందుకు అనేక మందిని పంపి విఫలమయ్యాడు. చివరకు క్రీ.శ.1662లో శివాజీతో సంధి చేసుకున్నాడు.
  • తర్వాత శివాజీ మొఘలుల ఆధీనంలో ఉన్న దక్కన్ ప్రాంతంపై దృష్టి సారించాడు. ఇది వారికి కోపం తెప్పించింది.
  • ఔరంగజేబు మొఘల్ దక్కన్ గవర్నర్ షయిస్థాఖాన్‌ను శివాజీని అణిచేందుకు పంపగా, శివాజీ అతణ్ని 1663 ఏప్రిల్ 15న ఓడించాడు.
  • శివాజీ క్రీ.శ.1664లో సూరత్‌పై దాడి చేశాడు. దాంతో మొఘల్ గవర్నర్ ఇనాయతుల్లా ఖాన్ ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయాడు. శివాజీ సూరత్‌ను ఆక్రమించటంతోపాటు అపార ధన సంపదలను కొల్లగొట్టాడు.
  • దాంతో ఔరంగజేబు మళ్లీ రాజా జైసింగ్‌ను శివాజీపైకి పంపాడు. జైసింగ్ ఒక్కొక్కటిగా దుర్గాలను ఆక్రమించి శివాజీని సంధికి ఒప్పించాడు.
  • క్రీ.శ.1665లో శివాజీ, జైసింగ్‌ల మధ్య జరిగిన పురంధర్ సంధి ప్రకారం, శివాజీ 23 కోటలను మొఘలులకు అప్పగించాడు. అంతేకాక మొఘల్ దర్బార్‌ను సందర్శించేందుకు అంగీకరించాడు.
  • శివాజీ తన కుమారుడు శంభాజీతో కలిసి క్రీ.శ. 1666 మే 12న మొఘల్ దర్బార్‌ను దర్శించాడు. అక్కడ అవమానానికి గురై తిరిగి వెనక్కు పయనమవుతుండగా బందీ అయ్యాడు.
  • మారు వేషంలో తప్పించుకున్న శివాజీ అనారోగ్య కారణంగా క్రీ.శ.1670 వరకూ ఎలాంటి దాడులు చేయలేదు.
  • శివాజీ తిరిగి క్రీ.శ.1670 సెప్టెంబర్ 13న సూరత్‌ను ఆక్రమించాడు. తర్వాత కోండన, పురంధర్, మహాలి, నాందేడ్ తదితర దర్గాలను ఆక్రమించాడు.
  • క్రీ.శ. 1674లో మొఘల్ సేనాని దైలర్‌ఖాన్‌ను ఓడించి దక్కన్‌లో మొఘలులను బలహీనపరిచాడు.
  • క్రీ.శ.1674లో శివాజీ రాయ్‌గఢ్‌లో ఛత్రపతి బిరుదుతో పట్టాభిషేకం జరిపించుకున్నాడు. ఈ పట్టాభిషేకాన్ని గాగభట్ట అనే పండితుడు నిర్వహించాడు.
  • శివాజీ క్రీ.శ.1677-78లో కర్ణాటక ప్రాంతాన్ని జయించేందుకు వెళ్తూ మార్గం మధ్యలోని వెల్లూరు, తంజావూరు తదితర ప్రాంతాలను కొల్లగొట్టాడు.
  • శివాజీ 53 ఏళ్ల వయసులో క్రీ.శ. 1680 ఏప్రిల్ 13న మరణించాడు.
శివాజీ పాలన
  • శివాజీ ప్రత్యక్ష అజమాయిషీలో ఉన్న ప్రాంతాన్ని స్వరాజ్ అని పిలిచారు. అతని ప్రభావమున్న ప్రాంతాల నుంచి చౌత్, సర్దేశ్‌ముఖి పన్నులు వసూలు చేశారు.
  • చౌత్ పన్ను శివాజీ ఇతర గ్రామాలపై దాడి చేయకుండా విధించేవాడు. ఇది 1/4వ వంతు ఉండేది. దీన్ని ఖండేశ్వర్ అనే అధికారి వసూలు చేసేవాడు. సర్దేశ్‌ముఖి పన్నును ఇతరులు గ్రామాలపై దాడి చేయకుండా రక్షణ కల్పించినందుకు విధించేవాడు. ఇది 1/10వ వంతు ఉండేది. దీన్ని గుమస్తా వసూలు చేస్తాడు.
  • పర్షియా స్థానంలో మరాఠీని అధికార భాషగా ప్రవేశపెట్టాడు.
  • శివాజీ ఆదేశంతో పండిట్ హనుమంత్ మరాఠీ భాషలో రాజ్య వ్యవహార కోశం అనే పాలనా గ్రంథాన్ని తయారుచేశాడు.
  • పరిపాలనలో సహాయం చేసేందుకు ‘అష్ట ప్రధానులు’ అనే మంత్రిమండలిని నియమించుకున్నాడు. వారు..
    1. పీష్వా ప్రధానమంత్రి
    2. అమాత్య ఆర్థికమంత్రి(మజుందార్)
    3. మంత్రి (వాఖియనావిస్) హోంమంత్రి, స్వదేశీ వ్యవహారాలు
    4. సచివ (సుర్నవిష్) ఉత్తర ప్రత్యుత్తరాలు
    5. సుమంత్ (దాబీర్) విదేశీ వ్యవహారాలు
    6. సేనాపతి సైనిక మంత్రి (సార్-ఇ-నేబత్)
    7. పండిత్ రావ్ (సదర్) మతాధిపతి
    8. న్యాయాధీశ్ న్యాయశాఖ
  • పీష్వా, మంత్రి, సచివలు ప్రాంతీయ పాలనా వ్యవహారాలను కూడా చూసేవారు. పండిత్‌రావు, న్యాయాధీశ్ మినహా మిగిలిన వారంతా యుద్ధాల్లో పాల్గొనాల్సివచ్చేది.
  • మంత్రులకు సహాయం చేసేందుకు దివాన్, మజుందార్, ఫడ్నవీస్, దఫ్తర్, దర్, కర్‌కానిస్, చిట్నీ, జామ్‌దార్, పాట్నీస్ వంటి అధికారులు ఉండేవారు.
  • గ్రామాల్లో పాలనా వ్యవహారాలను పటేల్ నిర్వహించేవాడు.
  • జాగీర్దారీ విధానం, వంశపారంపర్య హక్కులను శివాజీ రద్దు చేసి ఉద్యోగులకు జీతాలిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు.
  • శివాజీ ముఖ్య నౌకాదళ కేంద్రం ‘కొలాబా’. నౌకాదళ ప్రాముఖ్యాన్ని గుర్తించిన మొదటి మధ్యయుగ పాలకుడు శివాజీ అని చెప్పవచ్చు.
  • శివాజీ కాలంలో కళ్యాణ్, భివాండి తదితర ప్రాంతాలు ప్రముఖ నౌకానిర్మాణ కేంద్రాలుగా వెలుగొందాయి.
Published date : 03 Aug 2016 02:27PM

Photo Stories