తెలంగాణ చరిత్ర - 1
1. అద్దంకి గంగాధర కవి ఎవరి కొలువులో ఉండేవాడు?
1) సింగ భూపాలుడు
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) అబుల్ హాసన్ తానీషా
4) కాకతి ప్రతాపరుద్రుడు
- View Answer
- సమాధానం: 2
2. తెలుగుభాషకు తొలి వ్యాకరణం?
1) ఆంధ్రశబ్ద చింతామణి
2) ఆంధ్రభాషా భూషణం
3) కావ్యాలంకార సంగ్రహం
4) కవిజనాశ్రయం
- View Answer
- సమాధానం: 4
3. ‘శ్రీ పర్వత స్వామి’ ఏ రాజు వంశీయుల కులదైవం?
1) శాలంకాయనులు
2) ఆనందగోత్రీకులు
3) ఇక్ష్వాకులు
4) విష్ణుకుండినులు
- View Answer
- సమాధానం: 3
4. బుద్ధుణ్ని దేవుడిగా ఆరాధించడం ప్రారంభించిన ప్రాథమిక శాఖ ఏది?
1) దిగంబరులు
2) హీనాయానం
3) మహాయానం
4) శ్వేతాంబరులు
- View Answer
- సమాధానం: 3
5. తెలంగాణలో సామాజిక సాంస్కృతిక చైతన్యం తీసుకొచ్చింది ఎవరు?
1) అఘోరనాథ ఛటోపాధ్యాయ
2) దస్తూల్ హోషాంగ్
3) ముల్లా అబ్దులఖియా
4) పైవారంతా
- View Answer
- సమాధానం: 4
6.తల్లి పేరుతో శాసనాలు వేయించిన ఇక్ష్వాక రాజు?
1) రెండో ఏహబల శాంతమూలుడు
2) రెండో వీరుపురుషదత్తుడు
3) మొదటి వీరపురుషదత్తుడు
4) మొదటి శాంతమూలుడు
- View Answer
- సమాధానం: 4
7. పేష్కస్ అంటే?
1) ప్రభుత్వానికి రైతు చెల్లించాల్సిన శిస్తు
2) జమీందారుకు రైతు చెల్లించాల్సిన శిస్తు
3) ప్రభుత్వానికి జమీందారు చెల్లించాల్సిన శిస్తు
4) గ్రామాధికారికి రైతు చెల్లించాల్సిన శిస్తు
- View Answer
- సమాధానం: 3
8. నిజాం ఉల్‌ముల్క్ మహారాష్ర్టులతో కుదుర్చుకున్న సంధి?
1) మునిషిప్ గాంప్
2) వార్నా సంధి
3) దురారీ సరాయి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
9. ఏ నిజాం పరిపాలనా కాలంలో వహాబీ ఉద్యమం ప్రారంభమైంది?
1) అఫ్జల్ ఉద్దౌలా
2) మహబూబ్ అలీఖాన్
3) నాసిరుద్దౌలా
4) సలాబత్ సింగ్
- View Answer
- సమాధానం: 1
10. మీరట్‌లో తిరుగుబాటు ఏ రోజున ప్రారంభమైంది?
1) 1857 మే 10
2) 1858 నవంబర్ 1
3) 1856 డిసెంబర్ 10
4) 1858 జనవరి 1
- View Answer
- సమాధానం: 1
11. ‘నిజాం రాజ్యం కల్తీలేని మధ్యయుగపు రాచరికం’ అని వ్యాఖ్యానించింది ఎవరు?
1) రావి నారాయణ రెడ్డి
2) బద్దం ఎల్లారెడ్డి
3) పుచ్చలపల్లి సుందరయ్య
4) చండ్ర రాజేశ్వరరావు
- View Answer
- సమాధానం: 1
12. ఇక్ష్వాకు అంటే అర్థం?
1) చెరకు
2) పక్షి
3) పర్వతం
4) నది
- View Answer
- సమాధానం: 1
13. గౌతమీ బాలశ్రీ వేయించిన శాసనం?
1) నాసిక్ శాసనం
2) చినగంజాం శాసనం
3) మ్యాకదోని శాసనం
4) నానాఘాట్ శాసనం
- View Answer
- సమాధానం: 1
14. శర్మవర్మ, గుణాఢ్యుడు ఎవరి ఆస్థాన కవులు?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి
2) పులోమావి
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4) హాలుడు
- View Answer
- సమాధానం: 4
15. మొగల్ రాజపురం గుహలను ఎవరు నిర్మించారు?
1) ఇక్ష్వాకులు
2) ఆనంద గోత్రీకులు
3) శాలంకాయనులు
4) విష్ణుకుండినులు
- View Answer
- సమాధానం: 4
16. 1915లో సంఘ సంస్కార నాటక మండలి స్థాపించి, హరిజనులతో నాటకాలు వేయించింది ఎవరు?
1) నరాలశెట్టి దేవేంద్రుడు
2) శేషాద్రి
3) కృష్ణస్వామి
4) భాగ్యరెడ్డి వర్మ
- View Answer
- సమాధానం: 4
17. కాకతీయుల కాలంలో మంత్రులు, సేనాధిపతులు, రాజోద్యోగులందరూ ఏ వర్గానికి చెందినవారు?
1) బ్రాహ్మణ
2) క్షత్రియ
3) వైశ్యులు
4) శూద్రులు
- View Answer
- సమాధానం: 2
18. శాతవాహన కాలంనాటి వర్తకులు?
1) సార్దవాహులు
2) తిలపిష్టకులు
3) సుగధికులు
4) సేధి
- View Answer
- సమాధానం: 1
19. ఇక్ష్వాకుల కాలంలో తలవర అంటే?
1) ఒక వృత్తి
2) రాజు సమకూర్చుకున్న సైన్యం
3) సేనాధిపతి, సామంతరాజు
4) నాణెం
- View Answer
- సమాధానం: 3
20. ‘విజ్ఞాన చంద్రికా మండలి’ స్థాపన?
1) 1906
2) 1907
3) 1908
4) 1908
- View Answer
- సమాధానం: 1
21.జస్టిస్ పార్టీ మౌలికంగా..............
1) హరిజనుల పార్టీ
2) బ్రాహ్మణ పక్షపాత పార్టీ
3) బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ
4) ఉన్నత వర్గాల పార్టీ
- View Answer
- సమాధానం: 3
22. హిందూ ధర్మ పరిషత్తు పేరిట 1925 ఏప్రిల్ 1న మత విషయక కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సదస్సుకు అధ్యక్షత వహించింది ఎవరు?
1) కర్తుకోటి శంకరాచార్యులు
2) రాజా ప్రతాపగిర్జీ
3) పండిట్ శేషాద్రి
4) భాగ్యరెడ్డి వర్మ
- View Answer
- సమాధానం: 2
23. ‘సూత్తనిపాతం’ ఏ మతగ్రంథం?
1) జైన
2) హిందూ
3) బౌద్ధ
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
24. భట్టిప్రోలులో నివసించే ఏ జాతి బౌద్ధమతాన్ని స్వీకరించింది?
1) నాగులు
2) పుళిందులు
3) యక్షులు
4) ద్రావిడులు
- View Answer
- సమాధానం: 1
25. భట్టిప్రోలు ప్రాచీన నామం ఏది?
1) ప్రతిపాలపురం
2) బేతవోలు
3) ఘంటశాల
4) శ్రీ పర్వతం
- View Answer
- సమాధానం:1
26. హేతువాది ప్రాధాన్యత ఇచ్చే వాదం?
1) ప్రతీత్య సముత్పవాదం
2) గతి తార్కిక భౌతికవాదం
3) కార్యకరణ వాదం
4) కర్మసిద్ధాంతం
- View Answer
- సమాధానం: 3
27. శుద్ధి ఉద్యమాన్ని చేపట్టింది?
1) బ్రహ్మసమాజం
2) ఆర్యసమాజం
3) దివ్యజ్ఞాన సమాజం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
28. 1975లో విధించిన ఎమర్జెన్సీ వల్ల ఏ పార్టీ ఆవిర్భవించింది?
1) భారతీయ లోక్‌దళ్
2) జనతాపార్టీ
3) భారతీయ జనతాపార్టీ
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
29. శాతవాహన కాలం నాటి నిగమాలంటే ?
1) గ్రామాలు
2) నగరాలు
3) పట్టణాలు
4) రెవెన్యూ మండలాలు
- View Answer
- సమాధానం: 3
30. బైబిల్‌ను తెలుగులోకి అనువదించిన తొలి విదేశీయుడు?
1) బ్రేక్
2) జెవెక్ బాక్
3) కెప్టెన్ ఓర్
4) ఎడిసన్
- View Answer
- సమాధానం: 2
31. చౌరీ- చౌరా సంఘటనతో ఆగిపోయిన ఉద్యమం?
1) సహాయనిరాకరణ
2) శాసనోల్లంఘన
3) వందేమాతర ఉద్యమం
4) క్విట్ ఇండియా ఉద్యమం
- View Answer
- సమాధానం: 1
32. ఈ కింద పేర్కొన్న ఏ గ్రంథాల్లో వరంగల్ నగరాన్ని వర్ణించారు?
1) రాజశేఖర చరిత్ర
2) కళాపూర్ణోదయం
3) క్రీడాభిరామం
4) నీలాంబరి
- View Answer
- సమాధానం: 3
33. శాతవాహనానంతర యుగంలో భూములను పగ్గాలతో కొలిచి ఆయకట్టును నిర్ణయించే వారిని ఏమనేవారు?
1) హస్తికోశ
2) సెట్టి
3) అక్షపటలాధికృతుడు
4) రజ్జుకుడు
- View Answer
- సమాధానం: 4
34. ‘గుడిసెలు కాలిపోతున్నాయి’ రచన ద్వారా జాతీయ పురస్కారం పొందినవారు?
1) బోయి భీమన్న
2) సి. నారాయణ రెడ్డి
3) కంభంపాటి రామశాస్త్రి
4) గుడిపాటి వెంకటాచలం
- View Answer
- సమాధానం: 1
35. హరిజన్ సేవక్ సంఘ్ ద్వారా రాజకీయ చైతన్యం తీసుకొచ్చినవారు?
1) భాగ్యరెడ్డి వర్మ
2) కోదాటి నారాయణరావు
3) జమలాపురం కేశవరావు
4) మందముల నరసింగరావు
- View Answer
- సమాధానం: 2
36. శాతవాహనుల కాలంనాటి పన్నెండు బృంద నాట్య శిల్పాలు ఎక్కడ లభించాయి?
1) అమరావతి
2) జగ్గయ్యపేట
3) గుడిమల్లం
4) కార్లే గుహలు
- View Answer
- సమాధానం: 4
37. నిజాం ఉల్‌ముల్క్ అసలు పేరు?
1) ముబారిజ్ ఖాన్
2) చిన్‌ఖిలిచ్ ఖాన్
3) మీర్ ఖమీరుద్దీన్ ఖాన్
4) బహదూర్ షా
- View Answer
- సమాధానం: 3
38. పర్ణిక శ్రేణి, పూసిన శ్రేణులు ఎవరి కాలం నాటివి?
1) శాతవాహనులు
2) విష్ణుకుండినులు
3) ఇక్ష్వాకులు
4) తూర్పు చాళుక్యులు
- View Answer
- సమాధానం: 3
39. బౌద్ధ శిల్పకళలో అంగాలెన్ని?
1) 2
2) 3
3) 4
4) 5
- View Answer
- సమాధానం: 3
40.కుతుబ్‌షాహీలు ఏ సాంఘిక దురాచారం రూపుమాపటానికి ప్రయత్నించారు?
1) వేశ్యాలోలత
2) సతీసహగమనం
3) బాల్యవివాహాలు
4) అంటరానితనం
- View Answer
- సమాధానం: 2
41.బౌద్ధుల ప్రార్థన మందిరం?
1) స్తూపం
2) ఛత్రం
3) చైత్యం
4) విహారం
- View Answer
- సమాధానం: 3
42.రాజనీతిని గురించి వివరించిన గ్రంథం?
1) రాయవాచకం
2) ఆముక్తమాల్యద
3) సుమతీ శతకం
4) రామాభ్యుదయం
- View Answer
- సమాధానం: 2
43.ఎవరికాలంలో నాగార్జున కొండ సుప్రసిద్ధ విద్యాకేంద్రంగా వర్ధిల్లింది?
1) శాలంకాయనులు
2) ఆనంద గోత్రీకులు
3) ఇక్ష్వాకులు
4) విష్ణుకుండినులు
- View Answer
- సమాధానం: 3
44. శాతవాహనుల కాలంలో ఇత్తడి పనిచేసే వారి శ్రేణి?
1) కమర
2) వధికి
3) సెలవధికి
4) కాసకార
- View Answer
- సమాధానం: 4
45.చాందా రైల్వే ఆందోళన ఎవరి పరిపాలనా కాలంలో జరిగింది?
1) ఉస్మాన్ అలీఖాన్
2) మహబూబ్ అలీఖాన్
3) నాసిరుద్దౌలా
4) సికిందర్ జా
- View Answer
- సమాధానం: 2
46. భారతదేశాన్ని తన రెండో మాతృభూమిగా పేర్కొన్న మహిళ?
1) మేడం బ్లావట్ స్కీ
2) అనిబిసెంట్
3) మదర్ థెరిస్సా
4) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 2
47. గోల్కొండ ఏ పరిశ్రమకు ప్రసిద్ధిగాంచింది?
1) కలంకారి
2) నూలు వస్త్రాలు
3) వజ్రాలు
4) ముత్యాలు
- View Answer
- సమాధానం: 3
48. మహాపరినిర్యాణం అంటే ?
1) బుద్ధుడి ధర్మప్రచారం
2) బుద్ధుడి జననం
3) బుద్ధుడి తపస్సు
4) బుద్ధుడి మరణం
- View Answer
- సమాధానం: 4
49. మొదటి కర్ణాటక యుద్ధం నాటి ఆర్కాటు నవాబు?
1) ముజఫర్ జంగ్
2) సలాబత్ జంగ్
3) అన్వరుద్దీన్
4) మహ్మద్ అలీ
- View Answer
- సమాధానం: 3
50. బయ్యారం శాసనం ఎవరి చరిత్రను గురించి తెలుపుతుంది?
1) కొండవీటి రెడ్లు
2) బాదామి చాళుక్యులు
3) శాతవాహనులు
4) కాకతీయులు
- View Answer
- సమాధానం: 4
51. కట్టె మనది.. కలప మనది.. అడవి మనది... భూమి మనది! అనే నినాదంతో గోండులు, కోయలు, చెంచులను సంఘటితం చేసి పోరుబాటలో నడిపించింది ఎవరు?
1) గాంగంటం దొర
2) అల్లూరి సీతారామరాజు
3) కొమరం భీమ్
4) అగ్గిరాజు
- View Answer
- సమాధానం: 3
-
52. వితంతు పునర్వివాహ సంఘాన్ని మద్రాసులో ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1871
2) 1872
3) 1873
4) 1874
- View Answer
- సమాధానం: 4
-
53. మహారాష్ర్టులు, నిజాం మధ్య 1738లో జరిగిన యుద్ధం ఏది?
1) బొబ్బిలి యుద్ధం
2) ఔరంగాబాద్ యుద్ధం
3) భోపాల్ యుద్ధం
4) రెండో కర్ణాటక యుద్ధం
- View Answer
- సమాధానం: 3
-
54. 1948 ఏప్రిల్‌లో ఏర్పాటైన లాయర్ల నిరసన సమితి అధ్యక్షుడు?
1) వినాయకరావు విద్యాలంకార్
2) జమలాపురం కేశవరావు
3) వి.పి.మీనన్
4) బొమ్మకంటి సత్యనారాయణ
- View Answer
- సమాధానం: 4
-
55. స్వామి రామానందతీర్థ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 1941
2) 1940
3) 1939
4) 1938
- View Answer
- సమాధానం: 2
-
56. వందేమాతర ఉద్యమ కాలంలో జి.సుబ్రమణ్య అయ్యర్ సంపాదకత్వంలో వెలువడిన పత్రిక?
1) దేశమాత
2) స్వదేశీ మిత్రన్
3) ఆంధ్రపత్రిక
4) స్వరాజ్య
- View Answer
- సమాధానం: 2
-
57. గోల్కొండ రాజ్యాన్ని మొగలు సామ్రాజ్యంలో ఔరంగజేబు ఎప్పుడు విలీనం చేశాడు?
1) 1687
2) 1677
3) 1697
4) 1667
- View Answer
- సమాధానం: 1
-
58. ‘యథాపూర్వస్థితి ఒడంబడిక’ మీద నిజాం సంతకం చేసిన తర్వాత ఏ ప్రాంతం నుంచి భారత సైన్యాలు ఉపసంహరించుకున్నాయి?
1) సికింద్రాబాద్
2) బొల్లారం
3) తిరుమలగిరి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
-
59. పోలీసు చర్య తర్వాత 1948లో నిజాం పాలన ముగిసింది. ‘అఖిలాంధ్ర మహాసభ’ను 1949లో ఎవరు నెలకొల్పారు?
1) అయ్యదేవర కాళేశ్వరరావు
2) కట్టమంచి రామలింగారెడ్డి
3) దేవులపల్లి రామానుజరావు
4) బూర్గుల రామకృష్ణారావు
- View Answer
- సమాధానం: 1
-
60. ‘ముల్కీ’ ఉద్యమం అంటే?
1) ఆంగ్లేయులకు వ్యతిరేకత
2) ఉర్దూ అభివృద్ధి
3) ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యత
4) రెవెన్యూ సంస్కరణలు
- View Answer
- సమాధానం: 3
-
61. ‘ఇండియన్ ముసల్మాన్స్’ గ్రంథాన్ని రచించిన ఆంగ్లేయుడెవరు?
1) హంటర్
2) కర్జన్
3) లిట్టన్
4) రిప్పన్
- View Answer
- సమాధానం: 1
-
62. 1911లో ఏర్పాటు చేసిన ‘మన సంఘం’ లక్ష్యం?
1) దళితుల పిల్లల్లో విద్యావ్యాప్తి
2) బాల్య వివాహాలను వ్యతిరేకించడం
3) జోగిని, మురళి, బసివి వ్యవస్థల నిర్మూలన
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
-
63. అధికార భాషా సంఘం ఏర్పాటైన సంవత్సరం?
1) 1965 జనవరి 27
2) 1966 ఫిబ్రవరి 13
3) 1966 మార్చి 27
4) 1967 ఏప్రిల్ 25
- View Answer
- సమాధానం: 3
-
64. 1958లో జాతీయ అభివృద్ధి మండలి ఎవరి నివేదికను ఆమోదించింది?
1) అశోక్ మెహతా కమిటీ
2) రాకేష్ మోహన్ కమిటీ
3) బల్వంత్రాయ్ మోహతా కమిటీ
4) స్వరణ్‌సింగ్ కమిటీ
- View Answer
- సమాధానం: 3
-
65. శాతవాహనుల కాలంలో బుద్ధుడి జన్మకు సంకేతం?
1) పద్మం
2) ధర్మచక్రం
3) స్తూపం
4) బోధివృక్షం
- View Answer
- సమాధానం: 1
-
66. ఏ ప్రాంతీయ సంఘాల ఆవిర్భావంతో 1885లో జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైంది?
1) మద్రాసు మహాజనసభ
2) ఇండియన్ అసోసియేషన్
3) బాంబే అసోసియేషన్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
-
67. విద్వాన్ విశ్వం, తరిమెళ్ల నాగిరెడ్డి రాసిన ఏ గ్రంథం సామ్యవాద ప్రచారానికి తోడ్పడింది?
1) నవ్య సాహిత్యమాల
2) సాహిత్య దర్శనం
3) ఆంధ్ర సాహిత్య విమర్శ
4) సాహిత్యంలో దృక్పథాలు
- View Answer
- సమాధానం: 1
-
68. ‘కుమార సంభవం’ రచయిత?
1) కొక్కిలి
2) పావులూరి మల్లన్న
3) అయ్యన మహాదేవి
4) నన్నెచోడుడు
- View Answer
- సమాధానం: 4
-
69. కాకతీయుల కాలంలో తీర్థులంటే?
1) సేనానులు
2) మంత్రులు
3) సైనికులు
4) దూతలు
- View Answer
- సమాధానం: 2
-
70. భారతదేశంలో మొదటిగా భూమిని దానం చేసిన రాజవంశం ఏది?
1) కళింగులు
2) పల్లవులు
3) శాతవాహనులు
4) శకులు
- View Answer
- సమాధానం: 3
-
71. 1950 ఫిబ్రవరిలో విశాలాంధ్ర మహాసభ ప్రథమ సమావేశం ఎక్కడ జరిగింది?
1) కడప
2) వరంగల్
3) హైదరాబాద్
4) గుంటూరు
- View Answer
- సమాధానం: 2
-
72. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్థానంలోని హిందూ దివాన్ పేరు?
1) సర్ కిషన్ ప్రసాద్
2) పింగళి వెంకట్రామిరెడ్డి
3) సర్ భగవంత్ ప్రసాద్
4) పండిత్ రామదాస్
- View Answer
- సమాధానం: 1
-
73. 1938లో ఉస్మానియా యూనివర్సిటీలో హిందూ విద్యార్థులు ప్రారంభించిన రాజకీయ ఉద్యమం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది?
1) జాయిన్ ఇండియా మూవ్మెంట్
2) స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహం
3) వందేమాతర ఉద్యమం
4) ముల్కీ ఉద్యమం
- View Answer
- సమాధానం: 3
-
74. తెలంగాణ పరిరక్షణ దినాన్ని ఎప్పుడు పాటించారు?
1) 1968 జూలై 10
2) 1969 జూన్ 10
3) 1966 ఆగస్టు 20
4) 1969 సెప్టెంబర్ 13
- View Answer
- సమాధానం: 1
-
1) ఉన్నవ లక్ష్మీనారాయణ
2) దాశరథి
3) ఆదిరాజు వీరభద్రరావు
4) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: 1
-
76. గ్రంథాలయ ఉద్యమ నాయకుడు?
1) కొమర్రాజు లక్ష్మణరావు
2) అయ్యంకి వెంకట రమణయ్య
3) నారాయణరావు
4) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: 1
-
77. కింది వాటిలో సరైంది?
1) బాదామి చాళుక్యులు మహారాష్ర్ట ప్రాంతాన్ని పాలించారు
2) వేములవాడ చాళుక్యులు కరీంనగర్ ప్రాంతాన్ని పాలించారు
3) ముదిగొండ చాళుక్యులు మధిర, మానుకోట, వరంగల్ ప్రాంతాల్ని పాలించారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
-
78. మీర్ ఖమ్రుద్దీన్ ఖాన్‌కు ‘అసఫ్ జా’ బిరుదును ప్రదానం చేసిన మొగల్ చక్రవర్తి?
1) బహదూర్ షా
2) ఔరంగజేబు
3) మహమ్మద్ షా
4) షాజహాన్
- View Answer
- సమాధానం: 2
-
79. ఆనందభైరవి రాగాన్ని తొలుత ఉపయోగించిన వాగ్గేయకారుడెవరు?
1) త్యాగరాజు
2) క్షేత్రయ్య
3) సారంగపాణి
4) రామదాసు
- View Answer
- సమాధానం: 3
-
80. తూర్పు దేశాల్లో వర్తకం చేసేందుకు ఆంగ్లేయ వర్తకులకు అనుమతి ఇచ్చిన ఇంగ్లండ్ రాణి?
1) ఎలిజబెత్-2
2) ఎలిజబెత్-1
3) విక్టోరియా-1
4) విక్టోరియా-2
- View Answer
- సమాధానం: 3
-
81. హరిజనుల సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను ప్రజల, ప్రభుత్వ దృష్టికి తేవడానికి భాగ్యరెడ్డి వర్మ నడిపిన వారపత్రిక?
1) మిర్రర్
2) హైదరాబాద్
3) విశాఖ
4) కృష్ణ పత్రిక
- View Answer
- సమాధానం: 3
-
82. నాగార్జునుడు ఎవరి సమకాలీనుడు?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి
2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) రెండో శాతకర్ణి
4) హాలుడు
- View Answer
- సమాధానం: 2
-
83. శాతవాహనుల కాలంలో ‘కోలిక’లనే వారు?
1) వ్యవసాయదారులు
2) నూనె తీసేవారు
3) నేతపనివారు
4) ధాన్య వర్తకులు
- View Answer
- సమాధానం: 2
-
84. ‘ఘటిక’ అనేది?
1) దేవాలయం
2) బౌద్ధారామం
3) విద్యాకేంద్రం
4) నాట్య కళాశాల
- View Answer
- సమాధానం: 4
-
85. దంధోళి అంటే?
1) ఒక రకమైన కత్తి
2) ఒక రకమైన బాణం
3) శత్రువులపై రాళ్లు రువ్వే ఫిరంగి
4) అశ్విక దళం
- View Answer
- సమాధానం: 3
-
86. లుంబినీ వనంలో శిలాశాసనాన్ని ప్రతిష్టించినవారు?
1) ఆచార్య నాగార్జునుడు
2) అశోకుడు
3) ఆమ్రపాలి
4) ఆర్యదేవుడు
- View Answer
- సమాధానం: 2
-
87. ‘లెంకలు’ అంటే?
1) శత్రురాజులు
2) అంగరక్షకులు
3) నేతపనివారు
4) విదేశీయులు
- View Answer
- సమాధానం: 2
-
88. 1857 తిరుగుబాటులో బ్రిటీష్ వారికి సహాయం చేసి ‘స్టార్ ఆఫ్ ఇండియా’ బిరుదు పొందిన నిజాం నవాబు?
1) నిజాం ఉల్‌ముల్క్
2) నసీరుద్దౌలా
3) మహబూబ్ అలీఖాన్
4) అఫ్జలుద్దౌలా
- View Answer
- సమాధానం: 4
-
89. బోలు శబ్దం వచ్చే ద్వారబంధం ఎక్కడ ఉంది?
1) వేయి స్తంభాల గుడి
2) రామప్ప దేవాలయం
3) లేపాక్షి దేవాలయం
4) భీమేశ్వరాలయం
- View Answer
- సమాధానం: 2
-
90. ‘అనల్ మాలిక్’ అంటే?
1) నేనే దేవుణ్ని
2) నేనే రాజును
3) అల్లాయే ప్రభువు
4) ప్రభువే అల్లా
- View Answer
- సమాధానం: 1
-
91. నన్నయ భట్టుకు ఆంధ్ర మహాభారత రచనల్లో తోడ్పడ్డ కవి?
1) పాల్కుర్కి సోమనాథుడు
2) నారాయణ భట్టు
3) పండితారాధ్యుల మల్లికార్జునుడు
4) రావిపాటి త్రిపురాంతక కవి
- View Answer
- సమాధానం: 2
-
92. అశోకుని శాసన భాగం బయల్పడిన ప్రాంతం?
1) శాలిహుండం
2) ధరణికోట
3) కొట్టాం
4) రాజుల మందగిరి
- View Answer
- సమాధానం: 4
-
93. తెలంగాణలో ముల్కీ నిబంధనలు ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 1888
2) 1890
3) 1895
4) 1885
- View Answer
- సమాధానం: 1
-
94. జాగిర్దారీ విధానంలో భూములు ఎవరి స్వాధీనంలో ఉండేవి?
1) ముక్తేదారులు
2) ఇనాందారులు
3) ఇజారీదారులు
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 4
-
95. మిలిటరీ సామాగ్రిని నిజాం ప్రభుత్వం ఏ సంస్థ నుంచి కొనుగోలు చేసింది?
1) టాటా కంపెనీ
2) అట్లాస్ ట్రేడింగ్ సంస్థ
3) మహీంద్ర అండ్ మొహమ్మద్
4) 2, 3
- View Answer
- సమాధానం: 4
-
96. 1958లో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రాంతీయ కమిటీని రాష్ర్టపతి ఉత్తర్వు మేరకు ఎప్పుడు రద్దు చేశారు?
1) 1974 జనవరి 1
2) 1975 ఫిబ్రవరి 2
3) 1974 డిసెంబర్ 4
4) 1973 నవంబర్ 1
- View Answer
- సమాధానం: 1
-
97. శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవనాన్ని తెలియజేసే గ్రంథం?
1) గాథాసప్తశతి
2) కథా సరిత్సాగరం
3) సుహృల్లేఖ
4) శూన్య సప్తశతి
- View Answer
- సమాధానం: 1
-