మొగలులు
1. గోల్కొండ రాజ్యం మొగల్ సామ్రాజ్యంలో విలీనమైన తర్వాత హైదరాబాద్ సుభా మొదటి పాలకుడు ఎవరు?
1) షాజహాన్
2) కామ్భక్ష్
3) బహదూర్ షా
4) ఔరంగజేబు
- View Answer
- సమాధానం: 2
2. దక్కన్ రాజ్యాన్ని మొగలులు ఎన్ని సుభాలుగా విభజించారు?
1) 6
2) 5
3) 4
4) 8
- View Answer
- సమాధానం: 1
3.ఔరంగజేబ్ కాలంలో దక్కన్లో నిర్మించిన రాజబాట ఏది?
1) హైదరాబాద్ - రాజమహేంద్రవరం
2) వరంగల్ - మచిలీపట్నం
3) బోధన్ - రాజమహేంద్రవరం
4) హైదరాబాద్ - మచిలీపట్నం
- View Answer
- సమాధానం: 4
4. మొగలులు తెలంగాణ ప్రాంతాన్ని సుమారు ఎన్నేళ్లు పాలించారు?
1) 32
2) 40
3) 37
4) 45
- View Answer
- సమాధానం: 3
5. తెలంగాణ తొలి విప్లవ వీరుడిగా చరిత్రకారులు ఎవరిని పేర్కొంటారు?
1) కొమురం భీం
2) సర్వాయి పాపన్న
3) గోవిందరాజు
4) షోయబుల్లాఖాన్
- View Answer
- సమాధానం: 2
6. మహమ్మదీయ సైన్యం ఎవరి నాయకత్వంలో సర్వాయి పాపన్నపై తొలిసారిగా దాడి చేసింది?
1) కామ్భక్ష్
2) ఔరంగజేబ్
3) బహదూర్ షా
4) ఖాసిం ఖాన్
- View Answer
- సమాధానం: 4
7. సర్వాయి పాపన్న జన్మించిన గ్రామం?
1) లింగంపల్లి
2) సర్వాయిపేట
3) షాహపురం
4) వరంగల్
- View Answer
- సమాధానం: 1
8. ఏ మొగల్ పాలకుడి కాలంలో సర్వాయిపాపన్న భువనగిరి కోటను స్వాధీనం చేసుకున్నాడు?
1) షాజహాన్
2) మహమ్మద్ షా
3) బహదూర్ షా
4) ఔరంగజేబు
- View Answer
- సమాధానం: 3
9. సర్వాయి పాపన్న ఏ సంవత్సరంలో గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించాడు?
1) 1710
2) 1707
3) 1708
4) 1709
- View Answer
- సమాధానం: 4
10. బహదూర్షా ఎవరి నాయకత్వంలో సర్వాయి పాపన్నపై దండయాత్ర చేయించాడు?
1) రుస్తున్ ఖాన్
2) యూసుఫ్ ఖాన్
3) దిల్‌ఖాన్
4) ఖాసిం ఖాన్
- View Answer
- సమాధానం: 2
11. కింది వాటిలో దేనిలో గోండుల ప్రస్తావన కనిపిస్తుంది?
1) తొలివేదం
2) వాయు పురాణం
3) ఉపనిషత్తులు
4) ఐతరేయ బ్రాహ్మణం
- View Answer
- సమాధానం: 4
12. చాందా ప్రాంతం గురించి దేని ద్వారా తెలుస్తోంది?
1) ఐతరేయ బ్రాహ్మణం
2) ఉపనిషత్తులు
3) అంకమరాజు కథ
4) వాయు పురాణం
- View Answer
- సమాధానం: 3
13. సర్వాయి పాపన్న మొట్టమొదట ఏ ప్రాంతంలో మట్టికోటను నిర్మించాడు?
1) షాహపురం
2) సర్వాయిపేట
3) తాటికొండ
4) లింగంపల్లి
- View Answer
- సమాధానం: 1
14. గోండ్వానా రాజ్యం ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉంది?
1) క్రీ.శ. 870-1750
2) క్రీ.శ. 800-1700
3) క్రీ.శ. 900-1000
4) క్రీ.శ. 700-1600
- View Answer
- సమాధానం: 1
-
15. భారతదేశంలో మొగల్ సామ్రాజ్య స్థాపనకు కారణమైన మొదటి పానిపట్టు యుద్ధం (బాబర్ ఎ ఇబ్రహీంలోడీ) ఎప్పుడు జరిగింది?
ఎ) 1526 ఏప్రిల్ 21
బి) 1527 మార్చి 3
సి) 1528 జూన్ 6
డి) 1529 సెప్టెంబర్ 10
- View Answer
- సమాధానం: ఎ
16.1527 మార్చి 17న బాబర్‌కు మేవార్ పాలకుడైన ఎవరితో కాణ్వా యుద్ధం జరిగింది?
ఎ) రాణా ప్రతాప్ సింగ్
బి) రాణా సంగ్రామ సింగ్
సి) రాణా విజయ్ సింగ్
డి) రాణా అమర్ సింగ్
- View Answer
- సమాధానం: బి
17.కింది వాటిలో సరైంది ఏది?
ఎ) బాబర్ తన స్వీయ చరిత్రను ‘తుజుకీ-ఇ-బాబరీ’ పేరుతో ఛగతాయ్ తుర్కీ భాషలో రచించాడు. ఇతడిని స్వీయచరిత్రల రాజుగా పిలుస్తారు.
బి) ‘తుజుకీ-ఇ-బాబరీ’ గ్రంథాన్ని పర్షియా భాషలోకి అనువదించినవారు: అబ్దుల్ రహీంఖాన్-ఎ-ఖానన్.
సి) ఈ గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించినవారు: శ్రీమతి బెవరిడ్జ్
డి) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: డి
18. హుమాయున్, షేర్షా మధ్య జరిగిన యుద్ధాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) చునార్ యుద్ధం - 1537
బి) చౌసా యుద్ధం - 1539
సి) కనోజ్/బిల్గ్రాం యుద్ధం - 1540
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
19. హుమాయున్ ప్రవాస జీవితం గడిపిన సమయంలో ఆయన భార్య ‘హమీదా బానూ బేగం’కు ఏ రాజపుత్ర రాజు ఆశ్రయం ఇచ్చాడు? (అక్బర్ అక్కడే జన్మించాడు)
ఎ) రాణా ప్రసాద్ - అమర్ కోట
బి) రాణా జయసింగ్ - చిత్తోర్
సి) రాణా అమర్ - మేవార్
డి) మేదినిరాయ్ - రణతంభోర్
- View Answer
- సమాధానం: ఎ
20. హుమాయున్ తాను కోల్పోయిన మొగల్ సింహాసనాన్ని 1555లో జరిగిన ఏ యుద్ధంలో తిరిగి చేజిక్కించుకున్నాడు?
ఎ) సర్హింద్ యుద్ధం
బి) మచ్చవారా యుద్ధం
సి) ఎ, బి
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
21. హుమాయున్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మి నక్షత్రాలకు అనుగుణంగా సైనిక విభాగాలు ఏర్పరిచాడు
బి) తన సొంత గ్రంథాలయం ‘షేర్ మండలీ’ నుంచి జారిపడి మరణించాడు
సి)రెండు డోములు కలిగిన మొదటి సమాధి ఇతడిదే
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
22.మొగల్ పాలకులు, వారి పేర్లకు ఉన్న అర్థాలను జతపరచండి.
ఎ) 1-a, 2-b, 3-c, 4-d జాబితా - 1 జాబితా - 2 1) బాబర్ a) పులి 2) హుమాయున్ b) అదృష్టవంతుడు 3) అక్బర్ c) మహమ్మద్ మత జాబిల్లి 4) ఖుర్రం d) సంతోషం
బి) 1-d, 2-c, 3-b, 4-a
సి) 1-b, 2-d, 3-a, 4-c
డి) 1-c, 2-a, 3-d, 4-b
- View Answer
- సమాధానం: ఎ
23. కింది వారిలో నిరక్షరాస్యుడిగా భావిస్తున్న మొగల్ వంశానికి చెందిన ప్రముఖ పాలకుడు ఎవరు?
ఎ) బాబర్
బి) అక్బర్
సి) జహంగీర్
డి) షాజహాన్
- View Answer
- సమాధానం: బి
24. అక్బర్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) చక్రవర్తి కావడానికి ముందు పంజాబ్ ప్రాంతానికి గవర్నర్
బి) పట్టాభిషేకం ‘కలనౌర్’ ప్రాంతంలో జరిగింది
సి) 1556 నవంబర్ 5న జరిగిన 2వ పానిపట్ యుద్ధంలో హేమూను ఓడించి మొగల్ అధికారాన్ని పునఃస్థాపించాడు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
25. మొగల్ పాలకుల జీవిత చరిత్రలు - వాటి రచయితలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e జాబితా - 1 జాబితా - 2 1) తుజుకీ-బాబరీ a) బాబర్ 2) అక్బర్ నామా b) అబుల్‌ఫజల్ 3) హుమాయున్ నామా c) గుల్ బదన్ బేగం 4) పాద్షా నామా d) అబ్దుల్ హమీద్ లాహిరి 5) అలంగీర్ నామా e) మీర్జా మహమ్మద్ ఖాసిం
బి) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
సి) 1-c, 2-a, 3-d, 4-b, 5-e
డి) 1-d, 2-e, 3-c, 4-a, 5-b
- View Answer
- సమాధానం: ఎ
26. అక్బర్‌ను ఎదిరించిన ఏకైక రాజపుత్ర వంశం శిశోడియా. వీరు ఏ ప్రాంతాన్ని పాలించారు?
ఎ) బికనీర్
బి) జైసల్మీర్
సి) మేవార్
డి) కలంజర్
- View Answer
- సమాధానం: సి
27. కింది వాటిలో అక్బర్ మొదటి, చివరి దండయాత్రలు చేసిన ప్రాంతాలు వరసగా ఏవి?
ఎ) మాళ్వా, ఆసిర్ఘర్
బి) మాళ్వా, గుజరాత్
సి) గుజరాత్, ఆసిర్ఘర్
డి) ఆసిర్ఘర్, కాశ్మీర్
- View Answer
- సమాధానం: ఎ
28. అక్బర్ ఏ ప్రాంతంపై విజయానికి గుర్తుగా ఫతేపూర్ సిక్రీలో ‘బులంద్ దర్వాజా’ నిర్మించాడు?
ఎ) ముల్తాన్
బి) సింధు
సి) గుజరాత్
డి) ఒరిస్సా
- View Answer
- సమాధానం: సి
29. అక్బర్ సంస్కరణలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) యుద్ధ ఖైదీలను బానిసలుగా మార్చడంపై నిషేధం - 1562
బి) తీర్థయాత్రికులపై పన్ను రద్దు - 1563
సి) జిజియా పన్ను రద్దు - 1564
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
30. సర్వమత చర్చల కోసం అక్బర్ 1575లో ‘ఇబాదత్ ఖానా’ అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. ఇందులో వివిధ మతాలకు ప్రాతినిధ్యం వహించిన వారిని జతపరచండి.
ఎ) 1-e, 2-d, 3-c, 4-b, 5-a జాబితా - 1 జాబితా - 2 1) జైన మతం a) హర్విజయసూరి 2) హిందూ మతం b) దేవీ, పురుషోత్తం 3) ఇస్లాం c) అబుల్ ఫజల్ 4) క్రైస్తవ మతం d) ఆక్వావివా, మన్సురట్టి 5) పార్శీ మతం e) మెహరాంజీ రాణా
బి) 1-a, 2-b, 3-c, 4-d, 5-e
సి) 1-c, 2-a, 3-d, 4-b, 5-e
డి) 1-d, 2-b, 3-a, 4-e, 5-c
- View Answer
- సమాధానం: బి
31.మత విషయాల్లో ఉలేమాల జోక్యం తగ్గిస్తూ మతానికి కూడా చక్రవర్తే అధిపతి అని తెలిపే ‘అమోఘత్వ ప్రకటన’ను అక్బర్ ఏ సంవత్సరంలో జారీ చేశాడు?
ఎ) 1580
బి) 1575
సి) 1579
డి) 1582
- View Answer
- సమాధానం: సి
32. అక్బర్ స్థాపించిన నూతన మతం ‘దిన్-ఇ-ఇలాహీ’ గురించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ)1582లో ఏకైక దివ్యతత్వం, సుల్-ఎ-కుల్ సూత్రాల ప్రాతిపదికన స్థాపించాడు
బి) ఈ మతస్థులు పరస్పరం అల్లాహో అక్బర్ అని పలకరించుకుంటారు
సి) ఈ మతంలో చేరిన ఒకే ఒక హిందువు బీర్బల్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
33. ఎలిజబెత్ రాణి ఏ మొగల్ పాలకుడిని కాంబే రాజుగా సంబోధించి, అతడి ఆస్థానానికి రాయబారులను పంపించింది?
ఎ) బాబర్
బి) అక్బర్
సి) జహంగీర్
డి) షాజహాన్
- View Answer
- సమాధానం: బి
34.అక్బర్ ఆస్థానంలో ప్రముఖ హిందువులు, వారి ప్రత్యేకతలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) తాన్సేన్ - హిందూస్థానీ సంగీత విద్వాంసుడు
బి) బీర్బల్ - విదూషకుడు
సి) తోడర్మల్ - రెవెన్యూ అధికారి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
35. ఆగ్రాలో ‘ధర్మగంట’ను ఏర్పాటు చేసి, సామాన్య ప్రజలకు కోరుకున్న సమయంలో దర్శనం ఇచ్చిన మొగల్ పాలకుడెవరు?
ఎ) అక్బర్
బి) జహంగీర్
సి) షాజహాన్
డి) హుమాయున్
- View Answer
- సమాధానం: బి
36. కింది వారిలో కొంత కాలం పాటు మొగల్ సామ్రాజ్యాన్ని పాలించిన వ్యక్తి ఎవరు?
ఎ) షేర్షా
బి) హేము
సి) మహమత్ ఖాన్
డి) పైవారందరూ
- View Answer
- సమాధానం: డి
37. జహంగీర్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) జహంగీర్ జీవితంలో ముఖ్య సంఘటన నూర్జహాన్‌తో వివాహం
బి) ఇతడి పాలనా కాలంలో మొగలులు 1622లో కాందహార్‌ను కోల్పోయారు
సి) ఆంగ్లేయులకు వ్యాపార అనుమతి ఇచ్చిన మొగల్ పాలకుడు ఇతడే
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
38. కింది వారిలో స్వయంగా జీవిత చరిత్ర రాసుకున్న మొగల్ పాలకుడు ఎవరు?
ఎ) బాబర్
బి) జహంగీర్
సి) ఎ, బి
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: సి
39. చిత్రలేఖనంలో అత్యంత ప్రతిభ ఉన్న మొగల్ పాలకుడు ఎవరు? (ఇతడి కాలం నుంచే మొగలుల కాలంలో సూక్ష్మ చిత్రలేఖనం అభివృద్ధి చెందింది)
ఎ) జహంగీర్
బి) ఔరంగజేబు
సి) అలంగీర్
డి) అక్బర్
- View Answer
- సమాధానం: ఎ
40.షాజహాన్‌కు సంబంధించి కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
ఎ) ఇతడి పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటూ రోమన్ చక్రవర్తి ఆగస్టస్ పాలనతో పోలుస్తారు
బి) ప్రపంచ ప్రఖ్యాత తాజ్ మహల్ నిర్మాణాన్ని ఇతడే చేశాడు
సి) షాజహానాబాద్ అనే నూతన రాజధానిని నిర్మించాడు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
41.షాజహాన్ పాలనా కాలంలో మొగల్ ఆస్థానాన్ని సందర్శించిన విదేశీయులు, వారి రచనలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ట్రావెర్నియర్-ట్రావెల్స్ ఇన్ ఇండియా
బి) బెర్నియర్ - ట్రావెల్స్ ఇన్ మొగల్ ఎంపైర్, వార్ ఆఫ్ సక్సెషన్
సి) మనుక్కి - స్టోరియో డి మొగోర్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
42. జహంగీర్ ఏ సిక్కు గురువును ఉరితీయించడం వల్ల మొగలులు, సిక్కుల మధ్య శాశ్వత వైరం ప్రారంభమైంది?
ఎ) గురు అంగద్
బి) గురు రామదాసు
సి) గురు అర్జున్ సింగ్
డి) గురు హరరాయ్
- View Answer
- సమాధానం: సి
43. మొగల్ పాలకులు, వారి తల్లులకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e జాబితా - 1 జాబితా - 2 1) హుమాయున్ a) మహం అంగా 2) అక్బర్ b) హమీదా బానూ బేగం 3) జహంగీర్ c) జోధాబాయి 4) షాజహాన్ d) మన్మతి 5) ఔరంగజేబు e) ముంతాజ్ బేగం
బి) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
సి) 1-c, 2-a, 3-b, 4-e, 5-d
డి) 1-d, 2-e, 3-a, 4-c, 5-b
- View Answer
- సమాధానం: ఎ
44. కింది వాటిలో ఔరంగజేబు ఆక్రమించిన దక్కను రాజ్యం ఏది?
ఎ) బీజాపూర్
బి) గోల్కొండ
సి) ఎ, బి
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
45. ఔరంగజేబు ఉరితీయించిన సిక్కుల 9వ గురువు ఎవరు?
ఎ) తేజ్ బహదూర్ సింగ్
బి) హరికిషన్
సి) అమర్దాస్
డి) హరగోవింద్
- View Answer
- సమాధానం: ఎ
46.ఔరంగజేబు చర్యలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) సంగీతం, నాట్యం, చరిత్ర రచనలను నిషేధించాడు
బి) నాణేలపై ‘కలీమా’ (పవిత్ర వాక్యం) ముద్రణ నిషేధించాడు
సి) 1679లో ‘జిజియా పన్ను’ను తిరిగి విధించాడు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
47. మొగలుల్లో ఔరంగజేబు అత్యధిక ప్రాంతాన్ని పాలించినప్పటికీ అతడు అనుసరించిన ఏ విధానం వల్ల మొగల్ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది?
ఎ) రాజపుత్ర విధానం
బి) మన్సబ్దారీ విధానం
సి) దక్కన్ విధానం
డి) సైనిక విధానం
- View Answer
- సమాధానం: సి
48. మినీ తాజ్ మహల్‌గా పిలిచే ‘బీబికా మక్బారా’ను నిర్మించిన మొగల్ పాలకుడెవరు?
ఎ) షాజహాన్
బి) ఔరంగజేబు
సి) జహంగీర్
డి) హుమాయున్
- View Answer
- సమాధానం: బి
49. మొగలుల కాలంలోని ఆచారాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ఝరోకా దర్శనం - ఉదయం వేళ ప్రభువు ప్రజలకు దర్శనం ఇవ్వడం
బి) మొహర్ ఔర్ పంజా - శరణు వేడిన వారికి అభయ ముద్ర ఇవ్వడం
సి) చేకి తస్లిం ఇచేకి - మొగలుల సామంతులు మొగల్ కోటకు వందనం చేయడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
50. ‘ఫర్మానా’ అంటే..?
ఎ) చర్చ
బి) చక్రవర్తి ఆజ్ఞ
సి) పాలన
డి) రహస్య మంతనం
- View Answer
- సమాధానం: బి
51. మొగలుల కాలంనాటి భూమిశిస్తు విధానాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) గల్లా భక్షీ - రైతు, యజమాని ప్రత్యేక నిష్పత్తిలో పంచుకోవడం
బి) కంకూత్ - భూసారం ఆధారంగా పంటను అంచనా వేసి శిస్తు నిర్ణయించడం
సి) దహ్ సాలా పద్ధతి (బందోబస్తీ/జప్తి) - పదేళ్ల పంట ప్రమాణంగా శిస్తు నిర్ణయించడం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
52. కింది వారిలో మొగలుల రాజ్యాన్ని అతి తక్కువ కాలం పాలించి చరిత్రలో విశిష్ట స్థానం పొందిన వ్యక్తి ఎవరు?
ఎ) షేర్షా
బి) హసన్‌ఖాన్
సి) ఖాన్ సూర్
డి) హేమరాజ్
- View Answer
- సమాధానం: ఎ
53. ఏ కోట ముట్టడి సందర్భంగా తగిలిన గాయాల వల్ల షేర్షా మరణించాడు?
ఎ) రైసిన్
బి) కలింజర్
సి) అజ్మీర్
డి) చునార్
- View Answer
- సమాధానం: బి
-
54. మొగలుల కాలంలో కేంద్ర ఉద్యోగులు - వారి శాఖలను జతపరచండి.
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e జాబితా - 1 జాబితా - 2 1) వజీర్ a) ప్రధానమంత్రి 2) మీర్ భక్షి b) సైనిక, రక్షణ వ్యవహారాలు 3) మీర్ సమస్ c) అంతఃపుర వ్యవహారాలు 4) ముహతిసిబ్ d) నైతిక, నియమ నిబంధనలు 5) మీర్ అతిష్ e) ఫిరంగి దళాలు
బి) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
సి) 1-c, 2-a, 3-d, 4-e, 5-b
డి) 1-d, 2-a, 3-b, 4-c, 5-e
- View Answer
- సమాధానం: ఎ
55. మున్సబ్‌దారీ విధానానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) 1577లో సైనిక విధానంలో దీన్ని అక్బర్ ప్రవేశపెట్టాడు
బి) ప్రతి మున్సబ్దార్కు జత్ (పరిపాలనా స్థాయి), సవార్ (పోషించాల్సిన గుర్రాల సంఖ్య) అనే రెండు హోదాలు ఇచ్చేవారు
సి) మున్సబ్‌దారీ విధానంలో జహంగీర్ ‘దో అస్ప సి అస్ప’ను ప్రవేశపెట్టాడు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
56. ‘దివాన్-ఇ-మఖాపి’ గ్రంథాన్ని రచించిన మొగల్ రాజకుటుంబ స్త్రీ ఎవరు?
ఎ) జహనారా
బి) జేబున్నిసా
సి) రోషనారా
డి) మెహర్నిషా
- View Answer
- సమాధానం: బి
57. షేర్షా సమాధి ఏ వాస్తు రీతిని పోలి ఉంది?
ఎ) హిందూ
బి) ముస్లిం
సి) బౌద్ధం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
58. షేర్షా పాలనా సంస్కరణలను మొగల్ వంశానికి చెందిన ఏ పాలకుడు ఆదర్శంగా తీసుకున్నాడు?
ఎ) అక్బర్
బి) ఔరంగజేబు
సి) బాబర్
డి) షాజహాన్
- View Answer
- సమాధానం: ఎ
59. మొగల్ పాలకులు-వారి సమాధులు ఉన్న ప్రాంతాలను జతపరచండి.
జాబితా - 1 జాబితా - 2
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e జాబితా - 1 జాబితా - 2 1) బాబర్ a) కాబూల్ 2) అక్బర్ b) సికింద్రా 3) జహంగీర్ c) షాదరా 4) షాజహాన్ d) ఆగ్రా 5) ఔరంగజేబు e) దౌలతాబాద్
బి) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
సి) 1-c, 2-d, 3-e, 4-b, 5-a
డి) 1-d, 2-a, 3-e, 4-c, 5-b
- View Answer
- సమాధానం: ఎ
60. ఔరంగజేబు.. రచనలను నిషేధించినప్పటికీ ఆయన సమకాలీకుడైన ఎవరు ‘ముంతకాబ్-ఉల్-లుబాబ్’ పేరుతో రహస్యంగా చరిత్రను రచించాడు?
ఎ) మహమ్మద్ సాఖీ
బి) ఖాఫీఖాన్
సి) రఫీఖాన్
డి) మహమ్మద్ ఖాసిం
- View Answer
- సమాధానం: బి
61. వారసత్వ యుద్ధంలో మరణించకపోతే అక్బర్ కంటే గొప్పవాడై ఉండేవాడని కీర్తి పొందిన మొగల్ యువరాజు ఎవరు?
ఎ) ఖుస్రూ
బి) మురాద్
సి) దారాషికో
డి) షాహుజా
- View Answer
- సమాధానం: సి
62. కింది వాటిలో దారాషికో రచించిన గ్రంథం ఏది?
ఎ) షఫినత్-ఉల్-ఔలియా(సూఫీ రుచుల చరిత్ర)
బి) మజమల్ బహ్రయిన్
సి) సఖినత్-ఉల్-ఔలియా (ఉపనిషత్తుల అనువాదం)
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
63. మొగలుల కాలం నాటి వ్యవసాయ రంగానికి సంబంధించిన పదాలను జతపరచండి.
జాబితా - 1 జాబితా - 2
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e జాబితా - 1 జాబితా - 2 1) పోలాజ్ a) ఏటా సాగు చేసే భూమి 2) కరోరి b) వ్యవసాయ రంగ ప్రోత్సాహ పద్ధతి 3) బంత్ c) శిస్తు చెల్లించే అవసరం లేని భూమి 4) జమా d) ఊహించిన భూమి శిస్తు 5) హాసల్ e) వసూలు చేసిన భూమి శిస్తు
బి) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
సి) 1-c, 2-b, 3-a, 4-d, 5-e
డి) 1-d, 2-a, 3-e, 4-c, 5-b
- View Answer
- సమాధానం: ఎ
64. మొగలుల కాలంలో హిందూ మతానికి చెందిన ఏ పవిత్ర గ్రంథాన్ని ‘రజబ్నామా’ పేరుతో అనువాదం చేశారు?
ఎ) మహాభారతం
బి) భాగవతం
సి) రామాయణం
డి) రుగ్వేదం
- View Answer
- సమాధానం: ఎ