కాకతీయులు
1. కాకతీయ వంశానికి ఆద్యుడు?
1) గణపతిదేవుడు
2) మొదటి గుండన
3) వెన్నరాజు
4) మొదటి బేతరాజు
- View Answer
- సమాధానం: 3
2. ఓరుగల్లు కోట నిర్మాణానికి పునాదులు వేసినవాడు?
1) మొదటి ప్రోలరాజు
2) రెండో ప్రోలరాజు
3) గణపతిదేవుడు
4) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం: 2
3. నతవాడి దుర్గరాజు సోదరి ముప్పమాంబ ఎవరి భార్య?
1) మొదటి ప్రోలరాజు
2) గణపతిదేవుడు
3) మొదటి బేతరాజు
4) రెండో ప్రోలరాజు
- View Answer
- సమాధానం: 4
4. తొలి కాకతీయులు ఎవరికి సామంతులుగా ఉన్నారు?
1) శాతవాహనులు
2) రాష్ర్టకూటులు
3) బాదామి చాళుక్యులు
4) ఇక్ష్వాకులు
- View Answer
- సమాధానం: 2
5. మలి కాకతీయులు ఎవరి సామంతులు?
1) రాష్ర్టకూటులు
2) కల్యాణి చాళుక్యులు
3) బాదామి చాళుక్యులు
4) కందూరి చాళుక్యులు
- View Answer
- సమాధానం: 2
6. రుద్రదేవుడు ఏ కాలంనాటికి తీరాంధ్రను జయించాడు?
1) క్రీ.శ. 1186
2) క్రీ.శ. 1180
3) క్రీ.శ. 1176
4) క్రీ.శ. 1190
- View Answer
- సమాధానం: 1
7. పల్నాటి యుద్ధంలో నలగామ రాజుకు సహాయపడ్డ కాకతీయ రాజు?
1) గణపతిదేవుడు
2) ప్రతాపరుద్రుడు
3) రుద్రదేవుడు
4) రెండోబేతరాజు
- View Answer
- సమాధానం: 3
8. రుద్రదేవుడు యుద్ధాల్లో తనకు సహాయం చేసిన ఏ రాజును ఆమనగల్లు సామంతునిగా నియమించాడు?
1) రేచర్ల నామిరెడ్డి
2) రేచర్ల చెవిరెడ్డి
3) రేచర్ల లోకిరెడ్డి
4) రేచర్ల బేతిరెడ్డి
- View Answer
- సమాధానం: 4
9. వేయి స్తంభాల గుడి (రుద్రేశ్వరాలయం) ని కట్టించినవారు?
1) రుద్రదేవుడు
2) గణపతిదేవుడు
3) రుద్రమదేవి
4) ప్రతాపరుద్రుడు
- View Answer
- సమాధానం: 1
-
10.గణపతిదేవుడు మొదటగా ఎవరిపై దండెత్తాడు?
1) రాజేంద్రచోళుడిపై
2) అయ్య పినచోళుడిపై
3) పృథ్వీశ్వరుడిపై
4) చోడతిక్కనపై
- View Answer
- సమాధానం: 3
11. ఎవరి కాలంలో వెలనాటి చోళ రాజ్యం కాకతీయ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది?
1) ప్రతాపరుద్రుడు
2) రుద్రమదేవి
3) గణపతిదేవుడు
4) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం: 3
12. గణపతిదేవుడి దగ్గరకి తిక్కన సోమయాజిని రాయబారిగా పంపిన రాజు?
1) రక్కనగంగ
2) విజయ గండగోపాలుడు
3) చోడతిక్కన
4) రెండో మనుమసిద్ధి
- View Answer
- సమాధానం: 4
13. నెల్లూరు మనుమసిద్ధికి సహాయంగా గణపతిదేవుడు ఎవరి నాయకత్వంలో తన సైన్యాన్ని పంపాడు?
1) సామంతభోజుడు
2) జాయప్ప
3) రేచర్ల బేతిరెడ్డి
4) ఓబిలిసి
- View Answer
- సమాధానం: 1
14. గణపతిదేవుడు అపజయం పొందిన ఏకైన యుద్ధం?
1) కడప
2) కాంచీపురం
3) ముత్తుకూరు
4) పళైయూరు
- View Answer
- సమాధానం: 3
15. ముత్తుకూరు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
1) క్రీ.శ.1262
2) క్రీ.శ.1263
3) క్రీ.శ.1261
4) క్రీ.శ.1264
- View Answer
- సమాధానం: 2
16. రుద్రమదేవి గణపతిదేవుడి కుమార్తె అని మొదట పేర్కొన్నవారు?
1) నరహరి కవి
2) మార్కోపోలో
3) గంగాధర కవి
4) శేషాద్రి రమణ కవులు
- View Answer
- సమాధానం: 4
17. రుద్రమదేవిని వివాహం చేసుకున్న వీరభద్రుడు ఏ వంశ రాజు?
1) కోటవంశ
2) తూర్పు చాళుక్య
3) యాదవ
4) వెలనాటి చోళ
- View Answer
- సమాధానం: 2
18.రుద్రమదేవి క్రీ.శ.1259లో రాజ్యపాలనకు వచ్చి, ఏ సంవత్సరంలో రాజ్య కిరీటాన్ని ధరించింది?
1) క్రీ.శ.1265
2) క్రీ.శ.1266
3) క్రీ.శ.1269
4) క్రీ.శ.1267
- View Answer
- సమాధానం: 3
19. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తిచేసినవారు?
1) గణపతిదేవుడు
2) ప్రతాపరుద్రుడు
3) రుద్రమదేవి
4) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం:1
20.కాకతీయుల రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు మార్చింది?
1) ప్రతాపరుద్రుడు
2) రుద్రమదేవి
3) గణపతిదేవుడు
4) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం: 3
21. ఏ యుద్ధ విజయం తర్వాత కాకతీయ సేనానులు గజపతిమత్త మాతంగ సింహ, ఒడ్డియ రాయమర్దన అనే బిరుదులను పొందారు?
1) వేంగి
2) కళింగ
3) నెల్లూరు
4) కడప
- View Answer
- సమాధానం: 2
-
22. రుద్రమదేవికి ఎంతమంది కుమార్తెలు?
1) 4
2) 2
3) 3
4) 5
- View Answer
- సమాధానం: 3
23. నాయంకర వ్యవస్థను పునర్వ్యవస్థీకరించింది?
1) గణపతిదేవుడు
2) రుద్రమదేవి
3) ప్రతాపరుద్రుడు
4) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం: 3
24. దక్షిణాపథంపై దండెత్తిన తొలి ముస్లిం పాలకుడు?
1) మహమ్మద్ బిన్ తుగ్లక్
2) అల్లా ఉద్దీన్ ఖిల్జీ
3) ఘియాజుద్దీన్ ఖిల్జీ
4) ఫిరోజ్‌షా తుగ్లక్
- View Answer
- సమాధానం: 2
25. అల్లా ఉద్దీన్ ఖిల్జీ కాకతీయ సామ్రాజ్యంపై మొదటిసారి దండెత్తిన సంవత్సరం?
1) క్రీ.శ.1300
2) క్రీ.శ.1303
3) క్రీ.శ.1301
4) క్రీ.శ.1304
- View Answer
- సమాధానం: 2
26. అల్లా ఉద్దీన్ సైన్యాన్ని కాకతీయ సైన్యం ఏ ప్రాంతం వద్ద ఎదిరించి ఓడించింది?
1) పానగల్లు
2) ఏలకుర్తి
3) పిల్లలమర్రి
4) ఉప్పరపల్లి
- View Answer
- సమాధానం: 4
27. అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఓరుగల్లుపై రెండోసారి దండెత్తినప్పుడు సేనలకు నాయకత్వం వహించింది ఎవరు?
1) మాలిక్ ఫక్రుద్దీన్
2) ఝాజ
3) మాలిక్ కఫూర్
4) ముబారక్ షా
- View Answer
- సమాధానం: 3
28. అల్లా ఉద్దీన్ ఖిల్జీ మరణించిన సంవత్సరం?
1) క్రీ.శ.1313
2) క్రీ.శ.1316
3) క్రీ.శ.1314
4) క్రీ.శ.1317
- View Answer
- సమాధానం: 2
29. ముబారక్‌షా ఖిల్జీ ప్రతాపరుద్రుడిపై దండయాత్రకు ఎవరి ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపాడు?
1) మాలిక్ కఫూర్
2) మాలిక్ ఫక్రుద్దీన్
3) ఝాజ
4) ఖుస్రూ ఖాన్
- View Answer
- సమాధానం: 4
30. ఓరుగల్లుపై నాలుగో దండయాత్ర చేసిన ఢిల్లీ సేనాధిపతి?
1) ఖుస్రూఖాన్
2) ఉలూఘ్ ఖాన్
3) మాలిక్ కఫూర్
4) ఝాజ
- View Answer
- సమాధానం: 2
31. ప్రతాపరుద్రుడు మరణించిన సంవత్సరం?
1) క్రీ.శ.1320
2) క్రీ.శ.1321
3) క్రీ.శ.1323
4) క్రీ.శ.1325
- View Answer
- సమాధానం: 3
32.ప్రతాపరుద్రుడు ఏ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రకారుల అభిప్రాయం?
1) గోదావరి
2) నర్మద
3) కృష్ణా
4) తుంగభద్ర
- View Answer
- సమాధానం: 2
33. ఉలూఘ్ ఖాన్ మరో పేరు?
1) ఘియాజుద్దీన్ తుగ్లక్
2) ముబారక్ షా
3) మహ్మద్ బిన్ తుగ్లక్
4) ఫిరోజ్‌షా తుగ్లక్
- View Answer
- సమాధానం: 3
34. రేచర్ల రెడ్ల వంశ మూలపురుషుడు?
1) రేచర్ల బేతిరెడ్డి
2) రేచర్ల బమ్మిరెడ్డి
3) రేచర్ల నాగిరెడ్డి
4) రెండో కాటచమూపతి
- View Answer
- సమాధానం: 2
35. పిల్లలమర్రి పట్టణాన్ని నిర్మించింది?
1) రేచర్ల బేతిరెడ్డి
2) రేచర్ల బమ్మిరెడ్డి
3) రేచర్ల నాగిరెడ్డి
4) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 1
36. రేచర్ల రెడ్లలో మొదటి రాజు?
1) రేచర్ల బేతిరెడ్డి
2) రేచర్ల బమ్మిరెడ్డి
3) రేచర్ల నాగిరెడ్డి
4) రెండో కాటచమూపతి
- View Answer
- సమాధానం: 4
37. రెండో కాటచమూపతి రాజ్య రాజధాని?
1) ఏలకుర్తి
2) పిల్లలమర్రి
3) ఆమనగల్లు
4) పానగల్లు
- View Answer
- సమాధానం: 1
38. రుద్రదేవుడు బేతిరెడ్డికి ఏ రాజ్యానిచ్చి సామంతుడిగా చేసుకున్నాడు?
1) ఏలకుర్తి
2) పిల్లలమర్రి
3) ఆమనగల్లు
4) దేవరకొండ
- View Answer
- సమాధానం: 3
39. మొదటి ప్రతాపరుద్రుడని ఎవరిని పిలుస్తారు?
1) రెండో ప్రోలరాజు
2) రెండో బేతరాజు
3) జాయప సేనాని
4) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం: 4
40.రేచర్ల రెడ్డి రాజుల్లో ప్రసిద్ధుడు?
1) రేచర్ల బేతిరెడ్డి
2) రేచర్ల నామిరెడ్డి
3) రేచర్ల రుద్రారెడ్డి
4) రెండో కాటచమూపతి
- View Answer
- సమాధానం: 3
41.పిల్లలమర్రిలో ఎరకేశ్వర, కాచేశ్వర, నామేశ్వర దేవాలయాలను కట్టించినవాడు?
1) రేచర్ల బేతిరెడ్డి
2) రేచర్ల రుద్రారెడ్డి
3) రేచర్ల లోకిరెడ్డి
4) రేచర్ల నామిరెడ్డి
- View Answer
- సమాధానం: 4
42. ‘కాకతీయ రాజ్య భార ధౌరేయు’ అని పేరొందింది ఎవరు?
1) రేచర్ల రుద్రారెడ్డి
2) రేచర్ల చెవిరెడ్డి
3) రేచర్ల కాటిరెడ్డి
4) రేచర్ల లోకిరెడ్డి
- View Answer
- సమాధానం: 1
43. భేతాళరెడ్డి అని మరోపేరు ఎవరికి ఉంది?
1) మల్లారెడ్డి
2) చెవిరెడ్డి
3) కాటిరెడ్డి
4) లోకిరెడ్డి
- View Answer
- సమాధానం: 2
44. ఎవరి వంశస్థులు కాలక్రమంలో రేచర్ల పద్మనాయకులు అయ్యారు?
1) మల్లారెడ్డి
2) కోటిరెడ్డి
3) లోకిరెడ్డి
4) చెవిరెడ్డి
- View Answer
- సమాధానం: 4
45. కింద పేర్కొన్న ఏ దేవాలయాలు అజంతా తర్వాత ప్రాచీనమైనవని చరిత్రకారుల అభిప్రాయం?
1) పిల్లలమర్రి
2) పానగల్లు
3) కొలనుపాక
4) ఓరుగల్లు
- View Answer
- సమాధానం: 1
46. చెరకురెడ్డి వంశస్థుల తొలి రాజధాని?
1) పిల్లలమర్రి
2) పానగల్లు
3) జమ్ములూరు
4) కొలనుపాక
- View Answer
- సమాధానం:3
47. విరియాల వంశంలో సుప్రసిద్ధుడు?
1) పోరంటి వెన్న
2) ఎర్రభూపతి
3) ఎర్ర నరేంద్రుడు
4) దన్నసేనాని
- View Answer
- సమాధానం: 3
-
48. రెండో బేతరాజు ఎవరి ద్వారా శైవమతాన్ని అవలంభించాడు?
1) రామేశ్వర పండితుడు
2) అప్పయాచార్యులు
3) పాల్కురికి సోమన
4) బసవేశ్వరుడు
- View Answer
- సమాధానం: 1
49. కాకతీయుల కాలంలో గ్రామరక్షణ బాధ్యత ఎవరిది?
1) కరణం
2) పురోహితుడు
3) రెడ్డి
4) తలారి
- View Answer
- సమాధానం: 4
50. కాకతీయుల కాలంలో స్థూలంగా ఉన్న పన్నుల సంఖ్య?
1) 5
2) 7
3) 6
4) 4
- View Answer
- సమాధానం: 1
51. సెట్టి, కేసరి సముద్రాలను తవ్వించిన కాకతీయ రాజు?
1) మొదటి బేతరాజు
2) రెండో బేతరాజు
3) రుద్రదేవుడు
4) గణపతిదేవుడు
- View Answer
- సమాధానం: 2
52. పాకాల చెరువును తవ్వించింది?
1) రుద్రదేవుడు
2) జాయపసేనాని
3) రేచర్ల రుద్రుడు
4) ప్రతాపరుద్రుడు
- View Answer
- సమాధానం: 3
53. ‘రామప్పచెరువు’ను తవ్వించింది?
1) రేచర్ల రుద్రుడు
2) రుద్రదేవుడు
3) జాయపసేనాని
4) ప్రతాపరుద్రుడు
- View Answer
- సమాధానం: 1
-
54. ఏ కాకతీయ పాలకుడి కాలంలో విశాల భూభాగాలు సాగులోకి వచ్చాయి?
1) గణపతిదేవుడు
2) ప్రతాపరుద్రుడు
3) రుద్రదేవుడు
4) రెండో బేతరాజు
- View Answer
- సమాధానం: 2
55. రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లోని అనేక గ్రామాలు ఎవరి కాలంలో ఏర్పడ్డాయని కైఫీయత్తుల ద్వారా తెలుస్తోంది?
1) బేతరాజు
2) ప్రోలరాజు
3) ప్రతాపరుద్రుడు
4) రుద్రమదేవి
- View Answer
- సమాధానం: 3
56. కాకతీయ రాజ్యంలో శ్రేష్టమైన వస్త్రాలు ఉన్నాయని ప్రశంసించిన విదేశీ యాత్రికుడు?
1) మెగస్తనీస్
2) ప్లీని
3) మార్కోపోలో
4) నికోలో కాంటి
- View Answer
- సమాధానం: 3
57. గోల్కొండ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నట్లు రాసిన విదేశీ యాత్రికుడు?
1) టాలెమి
2) మార్కోపోలో
3) ప్లీని
4) కొలంబస్
- View Answer
- సమాధానం: 2