కాకతీయుల సామంతులు
1. కాకతీయుల ప్రభుత్వ సేవకులుకానివారు?
1) పురోహితుడు
2) కరణం
3) రెడ్డి
4) తలారి
- View Answer
- సమాధానం: 1
2. చెరకురెడ్ల వంశ మూలపురుషుడు?
1) బమ్మిరెడ్డి
2) బొల్లయ్యరెడ్డి
3) కేతసేనాని
4) కాటసేనాని
- View Answer
- సమాధానం: 4
3. కాటసేనానికి చెరకు అనే గ్రామంతోపాటు 12 గ్రామాలిచ్చిన కాకతీయ రాజు?
1) మొదటి బేతరాజు
2) రెండో బేతరాజు
3) గణపతిదేవుడు
4) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం: 2
4. చెరకురెడ్లకు ‘జమ్మలూరు’ రాజ్యమిచ్చి సామంతుడిగా చేసుకున్న కాకతీయ రాజు?
1) మొదటి బేతరాజు
2) రెండో బేతరాజు
3) గణపతిదేవుడు
4) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం: 4
5. చెరకురెడ్లు అనుసరించిన మతం?
1) శైవం
2) వైష్ణవం
3) జైనం
4) బౌద్ధం
- View Answer
- సమాధానం: 1
6. జమ్మలూరులో కేతేశ్వర, కోటేశ్వర, మారేశ్వర, సూర్యదేవర ఆలయాలను నిర్మించింది?
1) కాటసేనాని
2) కేతసేనాని
3) బొల్లయ్యరెడ్డి
4) బమ్మిరెడ్డి
- View Answer
- సమాధానం: 3
7. ఏ వంశంవారు దుర్జయ కులస్థులు?
1) నాగ
2) మల్యాల
3) చెరకురెడ్లు
4) విరియాల
- View Answer
- సమాధానం: 2
8. దన్నసేనాని ఏ వంశ మూలపురుషుడు?
1) యాదవ
2) నాగ
3) గోన
4) మల్యాల
- View Answer
- సమాధానం: 4
9. ‘సమ్మక్క’ ఎవరి కుమార్తె?
1) మేడరాజు
2) గోవిందరాజు
3) పగిడిద్దరాజు
4) యుగంధరుడు
- View Answer
- సమాధానం: 1
10. గోన గన్నారెడ్డి సోదరి అయిన ‘కుప్పాంబిక’ను ఎవరు వివాహం చేసుకున్నారు?
1) చౌడసేనాని
2) బాచసేనాని
3) గుండదండాధీశుడు
4) దన్నసేనాని
- View Answer
- సమాధానం: 3
11. మొదటి ‘బూదపూర’ శాసనాన్ని వేయించింది ఎవరు?
1) గోన గన్నారెడ్డి
2) కామసాని
3) మైలమ
4) గుండదండాధీశుడు
- View Answer
- సమాధానం: 4
12. రెండో బూదపూర శాసన కాలం?
1) క్రీ.శ.1274
2) క్రీ.శ.1272
3) క్రీ.శ.1276
4) క్రీ.శ.1280
- View Answer
- సమాధానం: 3
13. విరియాల వంశ ఆద్యుడు?
1) దన్నసేనాని
2) ఎర్రనరేంద్రుడు
3) ఎర్ర భూపతి
4) పోరంటి వెన్న
- View Answer
- సమాధానం: 4
14.కాకతీయుల కాలంలో పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి అందజేసే బాధ్యులు?
1) తలారి
2) కరణం
3) రెడ్డి
4) పురోహితుడు
- View Answer
- సమాధానం: 3
15. నాలుగో గుండరాజు సోదరి అయిన ‘కామసాని’ని ఎవరు వివాహం చేసుకున్నారు?
1) ఎర్రనరేంద్రుడు
2) పోరంటి వెన్న
3) ఎర్రభూపతి
4) దన్నసేనాని
- View Answer
- సమాధానం: 1
16. కాకతీయ రాజ్యాన్ని నిలబెట్టిన వంశంగా ప్రసిద్ధిపొందిన వంశం?
1) మల్యాల
2) విరియాల
3) గోన
4) చెరకురెడ్లు
- View Answer
- సమాధానం: 2
17. కామసాని రెండో తైలపుడిని ఒప్పించి హనుమకొండ రాజ్యాన్ని ఎవరికి ఇప్పించింది?
1) మొదటి బేతరాజు
2) రెండో బేతరాజు
3) మొదటి ప్రోలరాజు
4) రెండో ప్రోలరాజు
- View Answer
- సమాధానం: 1
18. ‘దేవగిరి’ రాజధానిగా పరిపాలించింది ఎవరు?
1) గోన వంశం
2) హోయసాలులు
3) నతవాడి రాజులు
4) యాదవ రాజులు
- View Answer
- సమాధానం:4
19.యుద్ధాల్లో రుద్రదేవుడికి సహకరించిన యాదవ రాజు?
1) ఒకటో సారంగధరుడు
2) రెండో సారంగధరుడు
3) మాధవ దేవుడు
4) సింగళదేవుడు
- View Answer
- సమాధానం: 1
20. పానగల్లు శాసనాన్ని వేయించింది?
1) రెండో సారంగధరుడు
2) మాధవదేవుడు
3) ఒకటో సారంగధరుడు
4) సింగళదేవుడు
- View Answer
- సమాధానం:1
-
21. పానగల్లు శాసన కాలం?
1) 1263
2) 1267
3) 1265
4) 1269
- View Answer
- సమాధానం: 2
22. నతవాడి వంశ మూలపురుషుడు?
1) దన్నసేనాని
2) పోరంటి వెన్న
3) సారంగధరుడు
4) బేతరాజు
- View Answer
- సమాధానం: 4
23. గణపతిదేవుడి సోదరి ‘మైలాంబ’ను వివాహమాడింది ఎవరు?
1) వక్కడి మల్లరుద్రుడు
2) బుద్ధరాజు
3) దుర్గరాజు
4) బేతరాజు
- View Answer
- సమాధానం: 1
24. అనంతగిరి శాసనం ఏ వంశ పాలకుల గురించి తెలుపుతోంది?
1) గోనవంశం
2) నాగవంశం
3) వావిలాల వంశం
4) నతవాడి వంశం
- View Answer
- సమాధానం: 2
25. 1259లో బూదపూర శాసనాన్ని వేయించింది ఎవరు?
1) గోనబుద్ధ
2) గోన గన్నారెడ్డి
3) గుండ దండాధీశుడు
4) గోన విటయ
- View Answer
- సమాధానం: 3
26. 1276లో గుండేశ్వరాలయాన్ని నిర్మించినవారు?
1) గోనబుద్ధ
2) గోనగన్నారెడ్డి
3) గుండ దండాధీశుడు
4) కుప్పాంబిక
- View Answer
- సమాధానం: 4
27. కాయస్థ వంశ మూలపురుషుడు?
1) బేతరాజు
2) గంగయ సాహిణి
3) ఎర్రనరేంద్రుడు
4) సారంగధరుడు
- View Answer
- సమాధానం: 2
28. తొలి కాకతీయులు అవలంభించిన మతం?
1) బౌద్ధం
2) జైనం
3) శైవం
4) వైష్ణవం
- View Answer
- సమాధానం: 2
29. సమ్మక్క భర్త?
1) మేడరాజు
2) గోవిందరాజు
3) పగిడిద్దరాజు
4) జంపన్న
- View Answer
- సమాధానం: 3
30. ‘ముప్పడినాయకుడు’ ఎవరి మహాప్రధాని?
1) గణపతిదేవుడు
2) రుద్రదేవుడు
3) రుద్రమదేవి
4) ప్రతాపరుద్రుడు
- View Answer
- సమాధానం: 4
31. ప్రతాపరుద్రుడి కాలంలో నాయంకరుల సంఖ్య?
1) 70
2) 75
3) 80
4) 85
- View Answer
- సమాధానం: 2
32. కాకతీయుల కాలంలో ‘ఆయగార్లు’ ఏ విభాగ పాలకులు?
1) స్థలాలు
2) సీమ
3) గ్రామాలు
4) నాడులు
- View Answer
- సమాధానం: 3
33. కాకతీయుల కాలంనాటి ‘ఆయగార్ల’ సంఖ్య?
1) 10
2) 25
3) 12
4) 17
- View Answer
- సమాధానం: 3
34. కాకతీయుల కాలంలో దేశీయ వాణిజ్యానికి ప్రధాన కేంద్రం?
1) మంథెన
2) పిల్లలమర్రి
3) ఓరుగల్లు
4) పేరూరు
- View Answer
- సమాధానం: 3
35. కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన రేవు పట్టణం?
1) మోటుపల్లి
2) మంథెన
3) ఓరుగల్లు
4) పేరూరు
- View Answer
- సమాధానం: 1
36. క్రీడాభిరామం రచయిత?
1) ఏకామ్రనాథుడు
2) పాల్కురికి సోమన
3) ప్రతాపరుద్రుడు
4) వినుకొండ వల్లభరాయుడు
- View Answer
- సమాధానం: 4
37. కాకతీయుల కాలంలో ‘సమయములు’ అని వేటిని వ్యవహరించేవారు?
1) వ్యాపార కేంద్రాలు
2) కుల సంఘాలు
3) గ్రామాలు
4) నగరాలు
- View Answer
- సమాధానం: 2
38. బౌద్ధమతం కాలక్రమంలో ఏ మతంలో కలిసిపోయిందని చరిత్రకారుల అభిప్రాయం?
1) హిందూ
2) జైన
3) వైష్ణవ
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
39. కిందివారిలో జైనమతాన్ని అవలంభించిన కాకతీయ రాజులు?
1) మొదటి బేతరాజు, ప్రోలరాజు
2) రుద్రదేవుడు, గణపతిదేవుడు
3) రుద్రదేవుడు, ప్రతాపరుద్రుడు
4) ప్రతాపరుద్రుడు, ప్రోలరాజు
- View Answer
- సమాధానం: 1
40. కాకతీయల కాలంలో జైనమత కేంద్రం?
1) హనుమకొండ
2) పానగల్లు
3) జోగిపేట
4) కొలనుపాక
- View Answer
- సమాధానం: 3
41. కాకతీయుల కాలంలో ప్రజాదరణ పొందిన శైవమత శాఖ?
1) కాలాముఖ
2) వీరశైవం
3) పాశుపతం
4) కాపాలికం
- View Answer
- సమాధానం: 3