రాజ్యసభ దేని కోసం ఒక కొత్త ‘అఖిల భారత సర్వీసు’ను ఏర్పాటు చేయాలని తీర్మానం చేయవచ్చు?
1. రాజ్యసభ దేని కోసం ఒక కొత్త ‘అఖిల భారత సర్వీసు’ను ఏర్పాటు చేయాలని తీర్మానం చేయవచ్చు?
1) కేంద్ర, రాష్ట్ర సంబంధాల ప్రయోజనం
2) పరిపాలనా సామర్థ్యం
3) జాతీయ ఐక్యత
4) జాతీయ ప్రయోజనాలు
- View Answer
- సమాధానం: 4
2. ‘బలవంతపు సాక్ష్యాలు’ తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) మక్బూల్ Vs స్టేట్ ఆఫ్ బాంబే(1953)
2) యూసఫ్ అలీ Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర (1968)
3) నందినీ శతపథి Vs పి.ఎల్. థానీ కేసు(1978)
4) ఎం. నారాయణ రెడ్డి Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2011)
- View Answer
- సమాధానం: 3
3. ఒక వ్యక్తి కదలికలపై అతడి జీవించే హక్కుకు ఇబ్బంది కలిగేటట్లు ప్రవర్తించరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) మలాక్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్(1981)
2) ఖరాక్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ ఉత్తర ప్రదేశ్ (1962)
3) పీయూసీఎల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2000)
4) స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ Vs ఉమేద్ రాయ్ శర్మ (1986)
- View Answer
- సమాధానం: 4
4. ‘సావధాన తీర్మానం’కు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) పజాప్రాముఖ్యం ఉన్న అంశంపై మంత్రిని అధికారిక ప్రకటన చేయమని కోరవచ్చు
బి) ఈ పద్ధతి భారత్‌లోనే ఆవిర్భవించింది
సి) ఈ పద్ధతిని 1954 నుంచి అమలు చేస్తున్నారు
డి) దీనికి ప్రధానమంత్రి మాత్రమే సమాధానం చెప్పాలి
1) ఎ, బి, సి, డి
2) ఎ, బి
3) బి, సి, డి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
5. ఓటర్ల అర్హతలు, ఓటర్ల లిస్టుల రూపకల్పన తదితర అంశాల గురించి ఏ చట్టంలో పేర్కొన్నారు?
1) ప్రజాప్రాతినిధ్య చట్టం - 1951
2) ప్రజాప్రాతినిధ్య చట్టం - 1950
3) పార్లమెంట్ చట్టం - 1952
4) ప్రజాప్రతినిధుల చట్టం - 1951
- View Answer
- సమాధానం: 2
6. అధికార పక్షానికి చెందిన సభ్యులు ప్రతిపక్ష పార్టీలోకి ఫిరాయించడాన్ని ఏమంటారు?
1) ఫ్లోర్ క్రాసింగ్
2) కార్పెట్ క్రాసింగ్
3) క్రాసింగ్
4) పవర్ క్రాసింగ్
- View Answer
- సమాధానం: 2
7. "Spoils system" తొలిసారిగా ఏ దేశంలో ప్రారంభమైంది?
1) అమెరికా
2) బ్రిటన్
3) కెనడా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 1
8. భారతదేశంలో ప్రధానంగా ఎన్ని రకాల పార్లమెంటరీ కమిటీలు ఉన్నాయి?
1) 2
2) 3
3) 4
4) 5
- View Answer
- సమాధానం: 1
9. ‘ఓటు వేయడం’ అనేది ఒక వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పు చెప్పింది?
1) పీయూసీఎల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2013)
2) కెప్టెన్ హరీష్ ఉప్పల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2011)
3) సురేష్ స్వామి Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ (2001)
4) ఖరాక్ సింగ్ Vs స్టేట్ ఆఫ్ ఉత్తర ప్రదేశ్(1962)
- View Answer
- సమాధానం: 1
10. కింది వాటిలో ప్రాథమిక విధి కానిది ఏది?
1)భారత రాజ్యాంగాన్ని గౌరవించడం
2) దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవించడం
3) స్వాతంత్య్ర సమరయోధులను గౌరవించడం
4) మహిళలను గౌరవించడం
- View Answer
- సమాధానం: 3
11. హైకోర్టు న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు?
1) రాష్ట్రపతి
2) గవర్నర్
3) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
4) న్యాయశాఖా మంత్రి
- View Answer
- సమాధానం: 1
12.పంచాయతీరాజ్ చట్టం (73వ రాజ్యాంగ సవరణ చట్టం) నుంచి మినహాయింపు ఉన్న ప్రాంతాలు/ రాష్ట్రాలేవి?
ఎ) మణిపూర్ కొండ ప్రదేశాలు
బి) నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ
సి) మిజోరాం, మేఘాలయ, నాగాలాండ్
డి) పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండ ప్రాంతాలు
1) ఎ, బి, సి
2) ఎ, బి, సి, డి
3) ఎ, సి, డి
4) బి, సి, డి
- View Answer
- సమాధానం: 3
13. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పూర్వపు శాసనాలు ఎంత కాలం పాటు అమల్లో ఉంటాయి?
1) 6 నెలలు
2) రాష్ట్ర శాసనసభ నిర్ణయం మేరకు
3) సంవత్సరం
4) రెండేళ్లు
- View Answer
- సమాధానం: 3
14. 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు అన్వయించాలంటే.. ఎవరి అనుమతి పొందాలి?
1) సంబంధిత రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్
2) భారత రాష్ట్రపతి
3) భారత పార్లమెంట్
4) కేంద్రపాలిత ప్రాంతాల ప్రజల అభిప్రాయం
- View Answer
- సమాధానం: 2
15. రాజ్యాంగంలో పేర్కొన్న భాగాల ఆధారంగా కింది అంశాల సరైన వరస క్రమం ఏది?
ఎ) ప్రముఖుల జీతభత్యాలు
బి) అధికార భాషలు
సి) కేంద్ర-రాష్ట్ర సంబంధాలు
డి) పార్టీ ఫిరాయింపులు
1) ఎ, బి, సి, డి
2) ఎ, సి, బి, డి
3) ఎ, బి, డి, సి
4) బి, సి, ఎ, డి
- View Answer
- సమాధానం: 2
16. జాతీయ మహిళా కమిషన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు?
1) నన్నపనేని రాజకుమారి
2) లలితా కుమార మంగళం
3) మమతా శర్మ
4) పైన పేర్కొన్న ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 2
17. దేశంలో పంచాయతీరాజ్ విధానాన్ని అమలు చేసిన రెండో రాష్ట్రం ఏది?
1) ఆంధ్రప్రదేశ్
2) రాజస్థాన్
3) గుజరాత్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 1
18. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవీ కాలం ఎంత?
1) 70 ఏళ్ల వయసు నిండే వరకు
2) 5 సంవత్సరాలు
3) 5 సంవత్సరాలు లేదా 70 ఏళ్ల వయసు నిండే వరకు.. ఏది ముందైతే అది
4) 6 సంవత్సరాలు లేదా 70 ఏళ్ల వయసు నిండే వరకు.. ఏది ముందైతే అది
- View Answer
- సమాధానం: 3
19. ‘జాతీయ మానవ హక్కుల కమిషన్’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1993 సెప్టెంబర్ 27
2) 1993 అక్టోబర్ 12
3) 1993 డిసెంబర్ 18
4) 1993 సెప్టెంబర్ 28
- View Answer
- సమాధానం: 2
20. మానవ హక్కులు ప్రధానంగా కింది వాటిలో వేటికి ఉద్దేశించినవి?
ఎ) జీవితం
బి) స్వేచ్ఛ
సి) సమానత్వం-గౌరవం
డి) అభివృద్ధి
1) ఎ, బి, సి
2) బి, సి, డి
3) ఎ, బి
4) ఎ, సి, డి
- View Answer
- సమాధానం: 1
21. జాతీయ మహిళా కమిషన్ సభ్యుల అర్హతలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) న్యాయ లేదా శాసన రంగంలో అనుభవం ఉండాలి
బి) కార్మిక సంఘాల్లో పనిచేసిన అనుభవం ఉండాలి
సి) విద్య లేదా సామాజిక సంక్షేమంలో అనుభవం ఉండాలి
డి) పరిపాలన విషయంలో అనుభవం ఉండాలి
ఇ) రాజ్యాంగ పరిజ్ఞానం ఉండాలి
1) ఎ, బి, సి
2) ఎ, బి, సి, డి , ఇ
3) ఎ, బి, సి, డి
4) బి, సి, డి, ఇ
- View Answer
- సమాధానం: 3
22. 89వ రాజ్యాంగ సవరణ చట్టం (2003) ద్వారా ఏర్పాటు చేసిన కమిషన్ ఏది?
1) జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్
2) జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్
3) జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్
4) జాతీయ మానవ హక్కుల కమిషన్
- View Answer
- సమాధానం: 2
23. కింది వాటిలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్న రాజ్యాంగ భాగాలు ఏవి?
ఎ) 3, 4
బి) 10, 16
సి)5, 6
డి) 7, 8
1) ఎ, బి
2) ఎ, బి, సి, డి
3) ఎ, బి, సి
4) బి, సి
- View Answer
- సమాధానం: 1
24. అల్ప సంఖ్యాక వర్గాల వారి గురించి రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొన్నారు?
1) మూడో భాగం
2) 19వ భాగం
3) నాలుగో భాగం
4) అయిదో భాగం
- View Answer
- సమాధానం: 1
25. కింది వాటిలో రాష్ట్రపతి ద్వారా షెడ్యూల్డ్ ప్రాంతాలు ప్రకటించని రాష్ట్రాలేవి?
1) ఆంధ్రప్రదేశ్, బిహార్
2) గుజరాత్, మహారాష్ట్ర
3) ఒడిశా, రాజస్థాన్
4) అసోం, పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 4
26. కమిటీలు - ఏర్పాటు చేసిన సంవత్సరాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
1) i-b, ii-a, iii-d, iv-c జాబితా - I జాబితా - II i) దంత్వాలా కమిటీ a) 1988 ii) పి.కె. తుంగన్ కమిటీ b) 1978 iii) ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ c) 1985 iv) జి.వి.కె. రావు కమిటీ d) 1986
2) i-a, ii-b, iii-d, iv-c
3) i-d, ii-a, iii-b, iv-c
4) i-c, ii-d, iii-b, iv-a
- View Answer
- సమాధానం: 1
27. అధికరణ 243(S) ప్రకారం వార్డు కమిటీల ఏర్పాటుకు సంబంధించి కింది వాటిలో సరైన అంశాలేవి?
ఎ) మూడు లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా కలిగిన మున్సిపాలిటీలలో వార్డు కమిటీలు ఉంటాయి
బి) ఒక వార్డు కమిటీ పరిధిలోని వార్డు ప్రతినిధి ఆ వార్డు కమిటీలో సభ్యుడిగా ఉండాలి
సి) వార్డు కమిటీ.. ఒకే వార్డుకు ఏర్పడినప్పుడు ఆ వార్డు ప్రతినిధి ఆ కమిటీ అధ్యక్షుడిగా ఉంటాడు
డి) వార్డు కమిటీకి అధ్యక్షుడిగా మున్సిపల్ చైర్మన్ ఉంటారు
1) ఎ, బి, సి
2) ఎ, బి, సి, డి
3) బి, సి, డి
4) బి, సి
- View Answer
- సమాధానం: 1
28. 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది?
1) 1993 జూన్ 1
2) 1993 ఏప్రిల్ 24
3) 1992 ఏప్రిల్ 24
4) 1992 జూన్ 1
- View Answer
- సమాధానం: 2
29. ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ(1986) సిఫారసులకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) పంచాయతీలకు కొత్తగా ఒక భాగాన్ని ఏర్పాటు చేయాలి
బి)కమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి
సి) న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి
డి) సర్పంచ్‌ను పరోక్షంగా ఎన్నుకోవాలి
1) ఎ, బి
2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి
4) బి, సి, డి
- View Answer
- సమాధానం: 2
30. జి.వి.కె. రావు కమిటీ (1985) సిఫారసులకు సంబంధించి కింది వాటిలో సరైనవేవి?
ఎ) జిల్లా పరిషత్‌లను పటిష్టపరచాలి
బి) ఉద్యోగస్వామ్యాన్ని పెంచాలి
సి) బ్లాక్ వ్యవస్థను రద్దు చేయాలి
డి) క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహించాలి
1) ఎ, బి
2) ఎ, సి, డి
3) ఎ, బి, సి, డి
4) బి, సి, డి
- View Answer
- సమాధానం: 2
31. అశోక్ మెహతా కమిటీ (1978) సిఫారసులకు సంబంధించి కింది వాటిలో సరికానివి ఏవి?
ఎ) జిల్లా స్థాయిలో ఆడిట్ చేయాలి
బి) ఎస్సీ, ఎస్టీలకు జనాభా ఆధారంగా సీట్లను రిజర్వ చేయాలి
సి) గ్రామ పంచాయతీలను రద్దుచేయాలి
డి) జిల్లా పరిషత్‌లను క్రమంగా రద్దుచేయాలి
1) ఎ, బి, సి
2) ఎ, సి
3) బి, సి
4) డి మాత్రమే
- View Answer
- సమాధానం: 4
32.స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ‘రిప్పన్ తీర్మానం’ ఎప్పుడు చేశారు?
1) 1882 మే 18
2) 1882 జూన్ 18
3) 1884 మే 18
4) 1882 ఏప్రిల్ 18
- View Answer
- సమాధానం: 1
33. ఏ కమిషన్ సిఫారసుల ప్రకారం భారతదేశంలో సమాజాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు?
1) వి.టి. కృష్ణమాచారి కమిషన్
2) బల్వంత్రాయ్ మెహతా కమిటీ
3) అశోక్ మెహతా కమిషన్
4) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: 1
34. ‘ఫిర్కా ప్రయోగం’ను ఎవరు అమలు చేశారు?
1) ఆల్బర్ట్ మేయర్
2) టంగుటూరి ప్రకాశం పంతులు
3) వి.టి. కృష్ణమాచారి
4) కలెక్టర్ అయాన్
- View Answer
- సమాధానం: 2
35. ‘కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు’ అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) ఎం.హెచ్. దేవేంద్రప్ప Vs కర్ణాటక స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (1998)
2) ఒ.కె.ఎ. నాయర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1976)
3) పీయూసీఎల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2013)
4) ఎం. హసన్ Vs గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (1998)
- View Answer
- సమాధానం: 1