ప్రాథమిక హక్కులు,ఆదేశిక నియమాలు
1. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల విరోధానికి కారణం?
ఎ) రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడానికి న్యాయశాఖ ఆరాటం
బి) లిఖిత రాజ్యాంగం
సి) సాంఘిక, ఆర్థిక అసమానతలు
డి) ముందుచూపు ఉన్న నాయకులు లేకపోవడం
- View Answer
- సమాధానం: ఎ
2. ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఆర్టికల్ 41లో లేని హక్కు ఏది?
ఎ) పని హక్కు
బి) ఆశ్ర య హక్కు
సి) విద్యాహక్కు
డి) ప్రభుత్వ సహాయహక్కు
- View Answer
- సమాధానం: బి
3. ‘ఆదేశిక సూత్రాల అమలును ఏ ప్రభుత్వమైనా విస్మరిస్తే, వారు ఎన్నికల కాలంలో ప్రజల ముందు తప్పనిసరిగా జవాబుదారీయె నిలవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించిందెవరు?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
సి) ఐవర్ జెన్నింగ్స్
డి) వల్లభ్ భాయ్ పటేల్
- View Answer
- సమాధానం: బి
4. మహాత్మాగాంధీ తత్వాన్ని ప్రతిబింబించే ఆదేశిక నియమాలు ఏవి?
ఎ) సమాన పనికి సమాన వేతనం
బి) ఉచిత న్యాయ సలహా
సి) గోవధ నిషేధం
డి) చారిత్రక కట్టడాల పరిరక్షణ
- View Answer
- సమాధానం: సి
5. ప్రాథమిక విధుల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక అధ్యాయం ఉండాలని సూచించిన సంఘం?
ఎ) సర్కారియా
బి) రాజ్‌మన్నార్
సి) ఏఆర్సీ
డి) స్వరణ్ సింగ్
- View Answer
- సమాధానం: డి
6. ఆదేశిక నియమాలకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) వీటికి న్యాయ సంరక్షణ లేదు
బి) ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు
సి) వీటికి మరో పేరు న్యాయ సంరక్షణ లేని హక్కులు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
7.ఆదేశిక సూత్రాల అమల్లో ప్రస్తుతం ఉన్న ప్రతిబంధకాలు ఏవి?
ఎ) ప్రపంచీకరణ
బి) ఆర్థిక సరళీకరణ
సి) ప్రైవేటీకరణ
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
8. కింది వాటిలో కొత్తగా చేర్చినఆదేశికాలు ఏవి?
ఎ) ఉచిత న్యాయ సలహా
బి) పర్యావరణ పరిరక్షణ
సి) పరిశ్రమ నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
9. ‘ప్రకరణ 39(బి, సి) నిర్దేశిక నియమాల అమలు కోసం చేసే చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనప్పటికీ చెల్లుబాటు అవుతాయి’ అని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మార్పు చేశారు?
ఎ) 24
బి) 23
సి) 42
డి) 44
- View Answer
- సమాధానం: ఎ
10. విద్యాసంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేందుకు ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు?
ఎ) కులం
బి) పేదరికం
సి) గ్రామీణ వాతావరణం
డి) మతం
- View Answer
- సమాధానం: ఎ
11. ప్రకరణ 19(1) ప్రకారం నిర్వహించే హిక్లిన్ టెస్ట్ (Hicklin Test) దేనికి సంబంధించింది?
ఎ) సభ్యత, నైతికత
బి) ప్రాణ నష్టం
సి) భారత సమైక్యత
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
12. ప్రభుత్వ పాలనకు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలేవి?
ఎ) ప్రాథమిక హక్కులు
బి) మానవ హక్కులు
సి) శాసన సూత్రాలు
డి) ఆదేశిక సూత్రాలు
- View Answer
- సమాధానం: డి
13. ఆదేశిక సూత్రాల ముఖ్యోద్దేశం ఏమిటి?
ఎ) నిరుద్యోగ నిర్మూలన
బి) సంక్షేమ రాజ్యస్థాపన
సి) పారిశ్రామికీకరణ
డి) ఆర్థిక పురోభివృద్ధి
- View Answer
- సమాధానం: బి
14. గ్రామ పంచాయతీల ఏర్పాటును ఎన్నో ఆర్టికల్ సూచిస్తోంది?
ఎ) 40
బి) 41
సి) 42
డి) 43
- View Answer
- సమాధానం: ఎ
15.‘ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను పరిమితం చేయరాదు’ అని ఏ కేసులో తీర్పు ఇచ్చారు?
ఎ) గోలక్‌నాథ్ కేసు
బి) కేశవానంద భారతీ కేసు
సి) మినర్వా మిల్స్ కే సు
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
16. కింది వాటిలో ఉమ్మడి పౌరస్మృతిని తెలిపే నిబంధన ఏది?
ఎ) 44
బి) 45
సి) 46
డి) 47
- View Answer
- సమాధానం: ఎ
17. జతపరచండి.
1. ఆర్టికల్ 40 i. కార్మికులకు కనీస వేతనాలు 2. ఆర్టికల్ 41 ii. పని హక్కు 3. ఆర్టికల్ 42 iii. గ్రామ పంచాయతీల నిర్వహణ 4. ఆర్టికల్ 43 iv. పని చేయడానికి తగిన పరిస్థితులు, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాల కల్పన
ఎ) 1-iii, | 2-ii, | 3-iv, | 4-i |
బి) 1-i, | 2-ii, | 3-iv, | 4-iii |
సి) 1-ii, | 2-i, | 3-iv, | 4-iii |
డి) 1-ii, | 2-iii, | 3-iv, | 4-i |
- View Answer
- సమాధానం: ఎ
18. ఆదేశిక సూత్రాలు అంటే ఏమిటి?
ఎ) ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలు
బి) రాష్ట్రాలకు కేంద్రం జారీ చేసే ఆదేశాలు
సి) కేంద్ర, రాష్ట్ర సంబంధాలను నిర్వహించే సూత్రాలు
డి) న్యాయ సాధనలను నిర్వహించే సూత్రాలు
- View Answer
- సమాధానం: ఎ
19. ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు మధ్య తేడా ఏమిటి?
ఎ) ప్రాథమిక హక్కులు న్యాయ సాధ్యమైనవి, ఆదేశిక సూత్రాలు కావు
బి) ఆదేశిక సూత్రాలు న్యాయ సాధ్యమైనవి, ప్రాథమిక హక్కులు కావు
సి) ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు రెండూ న్యాయ సాధ్యమైనవి.
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: ఎ
20. ‘ఆదేశ సూత్రాలు ఒక వాస్తవమైన మానసిక ప్రవృత్తుల చెత్తకుండి’ అని వ్యాఖ్యానించినవారెవరు?
ఎ) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
బి) టి.టి. కృష్ణమాచారి
సి) కె.ఎం. మున్షీ
డి) ఎన్. గోపాలస్వామి అయ్యంగార్
- View Answer
- సమాధానం: బి
21. ‘శాసన వ్యవస్థకు నిర్దేశిక నియమాలు కరదీపం లాంటివి’ అని అభిప్రాయపడినవారెవరు?
ఎ) ఎం.సి. చాగ్లా
బి) ఎం.సి. సెతల్వాడ్
సి) కె.టి. షా
డి) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
- View Answer
- సమాధానం: బి
22. కింది వాటిలో భారత రాజ్యాంగంలోని లక్ష్యాల సాధనకు తోడ్పడినవి ఏవి?
ఎ) ప్రాథమిక హక్కులు
బి) నిర్దేశిక నియమాలు
సి) ప్రాథమిక విధులు
డి) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: బి
23. కింది వాటిలో సరైంది.
1. పురుషులకు, మహిళలకు సమాన పని, సమాన వేతనాన్ని ప్రోత్సహించేందుకు రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేదు
2. వెనుకబడిన తరగతులను రాజ్యాంగం నిర్వచించలేదు
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1, 2 సరైనవే
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: డి
24. రాజ్యాంగాన్ని అనుసరించి సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఏ విషయంలో నియంత్రించవచ్చు?
ఎ) ప్రజా భద్రత
బి) విదేశాల్లో స్నేహ సంబంధాల నిర్వహణ దృష్ట్యా
సి) కోర్టు ధిక్కరణ విషయంలో
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
25. ‘ఆర్థిక ప్రజాస్వామ్యం’ దేని ద్వారా సాధ్యమవుతుంది?
ఎ) ప్రాథమిక హక్కులు
బి) ప్రవేశిక
సి) రాష్ట్ర విధానానికి సంబంధించిన ఆదేశిక సూత్రాలు
డి) కేంద్ర జాబితా
- View Answer
- సమాధానం: సి
26. ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులపై ఆధిక్యతను కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ?
ఎ) 25
బి) 42
సి) 44
డి) ఎ, బి
- View Answer
- సమాధానం: బి
27. ప్రపంచీకరణ ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో ప్రభావితమవుతున్న ఆదేశిక సూత్రాల స్వభావం ఏది?
ఎ) సంక్షేమ స్వభావం
బి) గాంధేయ స్వభావం
సి) ఉదార స్వభావం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
28. కింది వాటిలో ఆదేశికాలకు సంబంధించిన వ్యాఖ్యల్లో సరైన జత ఏది?
ఎ) ఆదేశికాలు నూతన పోకడలు - డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
బి) శుష్క వాగ్దానాలు - ఐవర్ జెన్నింగ్స్
సి) రాజ్యాంగ లక్ష్యాల మేనిఫెస్టో - కె.సి. వేర్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
29. ఆదేశిక నియమాలు...
ఎ) పౌరుల బాధ్యతలను తెలుపుతాయి
బి) పౌరుల హక్కులను పరిరక్షిస్తాయి
సి) న్యాయ పాలనలో ప్రాతిపదికలు
డి) పరిపాలనలో మార్గదర్శకాలు
- View Answer
- సమాధానం: డి
30. ‘సంక్షేమ రాజ్య స్వభావం’ అనే భావనను ఏ భాగంలో స్పష్టీకరించారు?
ఎ) ప్రవేశిక
బి) ప్రాథమిక హక్కులు
సి) ఆదేశిక నియమాలు
డి) ప్రాథమిక విధులు
- View Answer
- సమాధానం: సి
31.కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులకు సంబంధం లేదు
బి) ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల కంటే గొప్పవి
సి) ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల కంటే గొప్పవి
డి) పరస్పర పోషకాలు
- View Answer
- సమాధానం: డి
32. ఆదేశిక నియమాలకు కింద పేర్కొన్న ఏ లక్షణాన్ని ఆపాదించలేము?
ఎ) న్యాయ సంరక్షణ
బి) వ్యక్తి శ్రేయస్సు
సి) స్వామ్యవాద తరహా లక్షణం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
33. ఆదేశిక నియమాలకు న్యాయ సంరక్షణ కల్పించలేదు. కారణమేంటి?
ఎ) అమలు చేయడం సాధ్యం కాకపోవడం
బి) అంత ప్రాముఖ్యమైనవి కాకపోవడం
సి) ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉండటం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
34. కింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త ఆదేశికాలు చేర్చలేదు?
ఎ) 24వ సవరణ
బి) 42వ సవరణ
సి) 97వ సవరణ
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: డి
35. ప్రాథమిక హక్కులకు, ఆదేశిక నియమాలకు మధ్య వివాదాన్ని ఎలా పేర్కొంటారు?
ఎ) శాసనశాఖ -న్యాయశాఖ మధ్య వివాదం
బి) కార్యనిర్వాహక శాఖ - న్యాయశాఖ మధ్య వివాదం
సి) న్యాయశాఖ - ప్రజల మధ్య వివాదం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
36. కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) ప్రాథమిక హక్కులు - ప్రభుత్వంపై పరిమితులు
బి) ఆదేశిక నియమాలు - ప్రభుత్వ బాధ్యతలు
సి) ప్రాథమిక విధులు - పౌరుల బాధ్యతలు
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: డి
37. కింది వాటిలో సరైనవి ఏవి?
1. ఆదేశిక నియమాల అమలు కోసం న్యాయస్థానాల జోక్యాన్ని కోరలేము
2. వీటికి న్యాయ సంరక్షణ లేదు
3. ఇవి సవరణలకు అతీతం
4. ఇప్పటి వరకు ఒక్క ఆదేశిక నియమాన్ని కూడా రాజ్యాంగం నుంచి తొలగించలేదు
ఎ) 1, 2, 3, 4
బి) 1, 2, 3
సి) 1, 2, 4
డి) 2, 3, 4
- View Answer
- సమాధానం: సి
38. కింద పేర్కొన్న ఏ ఆదేశిక సూత్రాలను సామ్యవాదేతర అంశాలుగా పరిగణించవచ్చు?
ఎ) స్త్రీ, పురుషులకు సమాన జీవన అవసరాలు
బి) మానవీయ పని ప్రదేశాలు
సి) ఉచిత న్యాయ సలహా
డి) యువతను దోపిడీ నుంచి రక్షించడం
- View Answer
- సమాధానం: సి
39. ప్రాథమిక హక్కులు, ఆదేశిక నియమాల మధ్య ప్రస్తుతం ఎలాంటి సంబంధం ఉంది?
ఎ) ప్రాథమిక హక్కులను ప్రభావితం చేసేలా ఏ ఆదేశిక నియమం అమలు చేసినప్పటికీ అవి చెల్లుబాటు కావు
బి) సమానత్వ హక్కును ఉల్లంఘించేలా ఆదేశిక నియమాలు అమలు చేయరాదు
సి) ఆదేశిక నియమాల్లోప్రకరణ 39 (ఎ, బి) అమలు చేస్తూ చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైనప్పటికీ చెల్లుబాటు అవుతాయి
డి) అన్ని విషయాల్లో ప్రాథమిక హక్కులదే పైచేయి అవుతుంది.
- View Answer
- సమాధానం: సి
40. ఇంతవరకు అమలు కాని ఏకైక ఆదేశిక నియమం?
ఎ) ప్రకరణ 44
బి) ప్రకరణ 49
సి) ప్రకరణ 43
డి) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: ఎ