‘భారత రాజ్యాంగ పరిషత్’ను కింది వాటిలో దేని ప్రకారం ఏర్పాటు చేశారు?
1. ‘భారత రాజ్యాంగ పరిషత్’ను కింది వాటిలో దేని ప్రకారం ఏర్పాటు చేశారు?
1) సిమ్లా సమావేశం - 1945
2) లార్డ్ వేవెల్ ప్లాన్ - 1945
3) క్రిప్స్ రాయబారం - 1942
4) మంత్రిత్రయ రాయబారం - 1946
- View Answer
- సమాధానం: 4
2. భారత రాజ్యాంగ పరిషత్‌కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక చైర్మన్ - సచ్చిదానంద సిన్హా
2) రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక డిప్యూటీ చైర్మన్ - ఫ్రాంక్ ఆంటోని
3) రాజ్యాంగ పరిషత్ సలహాదారు - బి.ఎన్. రావు
4) రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి - హెచ్.సి. ముఖర్జీ
- View Answer
- సమాధానం: 4
3. 2014 డిసెంబర్ 9న ఏ భాషలోకి అనువదించిన భారత రాజ్యాంగ ప్రతిని ఆవిష్కరించారు?
1) అరబిక్
2) రష్యన్
3) ఫ్రెంచి
4) స్పానిష్
- View Answer
- సమాధానం: 1
4.కింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది?
1) భారత రాజ్యాంగం ఐరావతం లాంటిది - హెచ్.వి. కామత్
2) భారత రాజ్యాంగాన్ని సర్వసమ్మతి ప్రకారం రూపొందించారు - విస్కౌంట్ సైమన్
3) భారత రాజ్యాంగ పరిషత్ న్యాయవాదుల స్వర్గం - ఐవర్ జెన్నింగ్స్
4) అంబేడ్కర్ రాజ్యాంగ పితామహుడు, ఆధునిక మనువు - ఎమ్.వి. ఫైలి
- View Answer
- సమాధానం: 2
5. ఫ్రాన్సిస్, మాన్సన్, క్లోవరింగ్, బార్డ్ వెల్ ఎవరు?
1) 1726లో మేయర్ కోర్టు న్యాయమూర్తులు
2) 1773లో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు
3) 1774లో కలకత్తాలోని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
4) 1862లో హైకోర్టు న్యాయమూర్తులు
- View Answer
- సమాధానం: 2
6. కింది వాటిలో సరైంది ఏది?
1) కేంద్రంలో ద్వంద్వ పాలన (డయార్కీ) - మాంటెగ్-చెమ్స్‌ఫర్డ్ చట్టం (1919)
2) కేంద్రంలో ద్విసభా విధానం - మింటో - మార్లే చట్టం (1909)
3) వైస్రాయికే వీటో, ఆర్డినెన్స్ అధికారం - మొదటి కౌన్సిల్ చట్టం (1861)
4) వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తొలిసారిగా ఒక భారతీయుడికి అవకాశం - రెండో కౌన్సిల్ చట్టం (1892)
- View Answer
- సమాధానం: 3
7. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రధాన సూత్రం ఏమిటి?
1) అధికార కేంద్రీకరణ
2) రాష్ట్రపతి నియంతృత్వం
3) బాధ్యాతాయుత ప్రభుత్వం
4) స్థిరమైన ప్రభుత్వం
- View Answer
- సమాధానం: 3
8. సమన్యాయ పాలన ‘భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం’లో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) మినర్వామిల్స్ కేసు (1980)
2) ఇందిరా సహాని కేసు (1992)
3) ఎస్.ఆర్. బొమ్మైకేసు (1994)
4) రోరిక్ ఎస్టేట్ కేసు (2011)
- View Answer
- సమాధానం: 4
9. కింది వాటిలో సరికాని జత ఏది?
1) విన్సెంట్ లీ కమిషన్ - పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు
2) మెకాలే కమిటీ-సివిల్ సర్వీస్‌ల ఏర్పాటు
3) అక్వర్త కమిటీ-రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్
4) బట్లర్ కమిషన్ - విద్యా విధానం
- View Answer
- సమాధానం: 4
10. ప్రజలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నికైన వ్యక్తి రాజ్యాధినేతగా ఉండే ప్రభుత్వ విధానాన్ని ఏమంటారు?
1) ప్రజాస్వామ్యం
2) మోనార్కీ
3) రిపబ్లిక్
4) అరిస్టోక్రసీ
- View Answer
- సమాధానం: 3
11. భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలను 8వ షెడ్యూల్లో పొందుపరిచారు. కింది వాటిలో ఆ జాబితాలోని ఒక భాష ఏది?
1) ఇంగ్లిష్
2) రాజస్థానీ
3) భోజ్‌పురి
4) కొంకణీ
- View Answer
- సమాధానం: 4
12. క్రిమీలేయర్ ప్రస్తుతం ఎవరికి వర్తిస్తుంది?
1) ఇతర వెనుకబడిన వర్గాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందినవారు
2) ఇతర వెనుకబడిన వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడినవారు
3) ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో ఆర్థికంగా అభివృద్ధి చెందినవారు
4) అన్ని కులాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందినవారు
- View Answer
- సమాధానం: 1
13. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం నియమించిన తొలి కమిషన్/ కమిటీ ఏది?
1) ఎస్.కె. థార్ కమిషన్
2) జె.వి.పి. కమిటీ
3) కైలాస్నాథ్ వాంఛూ కమిటీ
4) ఫజల్ అలీ కమిషన్
- View Answer
- సమాధానం: 1
14.కింది వాటిలో ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించని అంశం ఏది?
1) ఆదేశిక సూత్రాలు
2) రాష్ట్రపతి ఎన్నిక విధానం
3) సంయుక్త సమావేశం
4) రాజ్యసభ సభ్యుల నియామకం
- View Answer
- సమాధానం: 3
15. రెండు లేదా మూడు రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఎవరు ఏర్పాటు చేస్తారు?
1) రాష్ట్రపతి
2) పార్లమెంట్
3) యూపీఎస్సీ
4) కేంద్ర ప్రభుత్వం
- View Answer
- సమాధానం: 2
16. రాజ్యాంగ ప్రవేశిక ప్రస్తుత స్వభావం?
1) రాజ్యాంగంలో అంతర్భాగం, న్యాయ సమ్మతమైంది
2) రాజ్యాంగంలో అంతర్భాగం కాదు, కానీ న్యాయ సమ్మతమైంది
3) రాజ్యాంగంలో అంతర్భాగం కానీ న్యాయ సమ్మతమైంది కాదు
4) రాజ్యాంగంలో అంతర్భాగం కాదు, న్యాయ సమ్మతమూ కాదు
- View Answer
- సమాధానం: 3
17. కింది వారిలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా పనిచేయనివారు?
1) జె.ఎస్.వర్మ
2) రంగనాథ్ మిశ్రా
3) కె.జి.బాలకృష్ణన్
4) బి.పి.జీవన్ రెడ్డి
- View Answer
- సమాధానం: 4
18.‘పరిత్యజించే సిద్ధాంతం’ (డాక్ట్రిన్ ఆఫ్ వేవర్)ను సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది?
1) బికాజీ నారాయణ్ Vs మధ్యప్రదేశ్ స్టేట్ (1955)
2) భశేశ్వర్నాథ్ Vs ఆదాయపన్ను శాఖ (1959)
3) బెన్నెట్, కాల్మన్ Vs కేంద్రం (1973)
4) మోహినీ జైన్ Vs కర్ణాటక స్టేట్ (1992)
- View Answer
- సమాధానం: 1
19. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఉద్యోగుల పదోన్నతిలో రిజర్వేషన్లు కల్పించడానికి చేసిన 77వ, 85వ రాజ్యాంగ సవరణ చట్టాలను ఏ అధికరణలో పొందుపరిచారు?
1) 15(4)
2) 15(4 - A)
3) 16(4)
4) 16(4 - A)
- View Answer
- సమాధానం: 4
20. ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమైన ‘విద్యా హక్కు’ దేనిలో భాగంగా ఉంది?
1) స్వేచ్ఛా హక్కు
2) సమానత్వ హక్కు
3) సహజ హక్కు
4) రాజ్యాంగ పరిహార హక్కు
- View Answer
- సమాధానం: 1
21. సంకీర్ణ ప్రభుత్వాల వల్ల కలిగే పరిణామం/ ప్రయోజనం ఏమిటి?
1) రాజకీయ స్థిరత్వం ఉంటుంది
2) ప్రధానమంత్రి నియంతలా వ్యవహ రించవచ్చు
3) చిన్న పార్టీలకు గుర్తింపు ఉంటుంది
4) త్వరితంగా నిర్ణయాలు తీసుకోవచ్చు
- View Answer
- సమాధానం: 3
22. చట్టాలు - అవి చేసిన సంవత్సరాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది?
1) వెట్టిచాకిరి నిషేధ చట్టం - 1976
2) సమాన వేతనాల చట్టం - 1978
3) కనీస వేతనాల చట్టం - 1948
4) బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం- 1986
- View Answer
- సమాధానం: 2
23. భారత రాజ్యాంగం ఏవిధమైన మైనార్టీలను గుర్తించింది?
1) కులపర, మతపర
2) కులపర, భాషాపర
3) మతపర, లింగపర
4) మతపర, భాషాపర
- View Answer
- సమాధానం: 4
24. రాజ్యాంగంలోని మూడో భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులను రాష్ట్రపతి ఏ సందర్భంలో తాత్కాలికంగా రద్దు చేస్తారు?
1) జాతీయ అత్యవసర పరిస్థితి (అధికరణ-352)
2) రాష్ట్రపతి పాలన (అధికరణ-356)
3) ఆర్థిక అత్యవసర పరిస్థితి (అధికరణ-360)
4) పైన పేర్కొన్న మూడు సందర్భాల్లో
- View Answer
- సమాధానం: 1
25. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లలో ‘నోటా (None Of The Above)’ మీటను ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి, నెగ్గిన సంస్థ ఏది?
1) అసోసియేషన్ ఫర్ డెమోక్రసీ రిఫార్మ్స
2) కామన్ కాజ్ సంస్థ
3) పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
26.‘ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులే మిన్న’ అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) ఎ.కె. గోపాలన్ కేసు
2) చంపకం దొరైరాజన్ కేసు
3) బిజో ఎమ్మాన్యువల్ కేసు
4) మేనకా గాంధీ కేసు
- View Answer
- సమాధానం: 2
27. ఆదేశిక సూత్రాలను ‘భారత ప్రభుత్వ చట్టం - 1935’లోని Instrument of Instructions తో ఎవరు పోల్చారు?
1) నెహ్రూ
2) గాంధీజీ
3) అంబేడ్కర్
4) హెచ్.వి. కామత్
- View Answer
- సమాధానం: 3
28.కింది వాటిలో సరికాని జత ఏది?
1) బాల బడి విద్య - ఆర్టికల్ 46
2) మద్యపాన నిషేధం - ఆర్టికల్ 47
3) గోవధ నిషేధం - ఆర్టికల్ 48
4) అంతర్జాతీయ శాంతి - ఆర్టికల్ 51
- View Answer
- సమాధానం: 1
29.భారతదేశంలో ప్రస్తుతం ఏడు జాతీయ పార్టీలు ఉండగా.. ఇటీవలే జాతీయ పార్టీ హోదా పొందిన పార్టీ ఏది?
1) జనతాదళ్ (యు)
2) తృణమూల్ కాంగ్రెస్ పార్టీ
3) తెలుగుదేశం పార్టీ
4) ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.
- View Answer
- సమాధానం: 2
30. 2009లో ఏ రాష్ట్ర అసెంబ్లీకి నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం సీట్లను ఒకే రాజకీయ పార్టీ గెలుచుకుంది?
1) ఢిల్లీ (70 సీట్లు)
2) గోవా (40 సీట్లు)
3) సిక్కిం (32 సీట్లు)
4) మిజోరాం (40 సీట్లు)
- View Answer
- సమాధానం: 3
31. కింది వాటిలో ప్రాథమిక విధి ఏది?
1) ఉమ్మడి వ్యాపారం
2) ఉమ్మడి హైకోర్టు
3) ఉమ్మడి సంస్కృతి
4) ఉమ్మడి పౌరస్మృతి
- View Answer
- సమాధానం: 3
32. భారత రాజ్యాంగానికి సంబంధించి కింది వాటిలో సమాఖ్య లక్షణం కానిది ఏది?
1) దృఢ రాజ్యాంగం
2) ఏకీకృత న్యాయ వ్యవస్థ
3) స్వతంత్ర న్యాయ వ్యవస్థ
4) ద్విసభా విధానం
- View Answer
- సమాధానం: 2
33. కింది వాటిలో ఉమ్మడి జాబితాలోని అంశం ఏది?
1) వికలాంగుల సంక్షేమం
2) గ్రంథాలయాలు
3) సాంఘిక, ఆర్థిక ప్రణాళిక
4) ప్రజారోగ్యం
- View Answer
- సమాధానం: 3
34. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2010లో నియమించిన ‘మహాదాయి ట్రిబ్యునల్’ ఏ రాష్ట్రాల జలాల పంపిణీకి సంబంధించింది?
1) ఒడిశా, ఆంధ్రప్రదేశ్
2) గోవా, కర్ణాటక, మహారాష్ట్ర
3) కర్ణాటక, తమిళనాడు
4) కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 2
35. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం ఏది?
1) బిహార్
2) గుజరాత్
3) మధ్యప్రదేశ్
4) గోవా
- View Answer
- సమాధానం: 1
36.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్’ ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది?
1) 2011 డిసెంబర్ 3
2) 2012 డిసెంబర్ 3
3) 2011 అక్టోబర్ 2
4) 2012 అక్టోబర్ 2
- View Answer
- సమాధానం: 2
37. కేంద్ర - రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) పి.వి. రాజమన్నార్ కమిటీ - కరుణానిధి ప్రభుత్వం
2) బెంగాల్ మెమోరాండం - జ్యోతిబసు ప్రభుత్వం
3) ఆర్.ఎస్. సర్కారియా కమిషన్ - ఇందిరాగాంధీ ప్రభుత్వం
4) మదన్ మోహన్ పూంచీ కమిషన్ - వాజ్‌పేయి ప్రభుత్వం
- View Answer
- సమాధానం: 4
38. కేంద్ర ప్రభుత్వం దేని సిఫారసుల ఆధారంగా భారత సంఘటిత నిధి నుంచి రాష్ట్రాలకు ‘గ్రాంట్ - ఇన్ - ఎయిడ్’ను మంజూరు చేస్తుంది?
1) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) ఆర్థిక సంఘం
3) ఆర్థిక మంత్రిత్వ శాఖ
4) ప్రధానమంత్రి కార్యాలయం
- View Answer
- సమాధానం: 2
39. భారత రాష్ట్రపతి హోదా..?
1) డిజ్యూర్
2) డిఫాక్టో
3) ప్రభుత్వాధినేత
4) దేశ నాయకుడు
- View Answer
- సమాధానం: 1
40.ఆర్టికల్ - 360 ప్రకారం రాష్ట్రపతి విధించిన ఆర్థిక అత్యవసర పరిస్థితిని పార్లమెంట్ ఏవిధంగా ఆమోదిస్తుంది?
1) సాధారణ మెజారిటీతో నెల లోపు
2) ప్రత్యేక మెజారిటీతో నెల లోపు
3) సాధారణ మెజారిటీతో 2 నెలల్లోపు
4) ప్రత్యేక మెజారిటీతో 2 నెలల్లోపు
- View Answer
- సమాధానం: 4
41.కింది వారిలో ఎవరు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నలుగురు ప్రధానమంత్రులు మారారు?
1) జాకీర్ హుస్సేన్
2) ఆర్. వెంకట్రామన్
3) కె.ఆర్. నారాయణన్
4) ఎ.పి.జె. అబ్దుల్ కలాం
- View Answer
- సమాధానం: 2
42. కింది వారిలో ఉప ప్రధానమంత్రిగా, ప్రధానమంత్రిగా సేవలు అందించినవారెవరు?
1) లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్
2) ఇందిరా గాంధీ, మొరార్జీ దేశాయ్
3) మొరార్జీ దేశాయ్, హెచ్.డి. దేవెగౌడ
4) మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్
- View Answer
- సమాధానం: 4
43. ఏ కేబినెట్ కమిటీని ‘సూపర్ కేబినెట్’ అంటారు?
1) పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ
2) రాజకీయ వ్యవహారాల కమిటీ
3) ఆర్థిక వ్యవహారాల కమిటీ
4) భద్రతా వ్యవహారాల కమిటీ
- View Answer
- సమాధానం: 2
44. కింది వాటిలో సరికాని జత ఏది?
1) పంచశీల ఒప్పందం (1954): నెహ్రూ - చౌ-ఎన్-లై
2) తాష్కేంట్ ఒప్పందం (1966): లాల్ బహదూర్ శాస్త్రి - అయూబ్ ఖాన్
3) సిమ్లా ఒప్పందం (1972): ఇందిరా గాంధీ - జుల్ఫికర్ అలీ భుట్టో
4) ఢిల్లీ ఒప్పందం (1999): ఐ.కె. గుజ్రాల్ - నవాజ్ షరీఫ్
- View Answer
- సమాధానం: 4
45.84వ రాజ్యాంగ సవరణ చట్టం (2000) ప్రకారం.. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్యను ఏ సంవత్సరం వరకు పెంచకూడదు?
1) 2020
2) 2022
3) 2024
4) 2026
- View Answer
- సమాధానం: 4
46. దేశంలో మొట్టమొదటి ముస్లిం మహిళా ముఖ్యమంత్రి ఎవరు?
1) సైదా అన్వర్ తైమూర్ (అసోం)
2) కౌర్ భట్టాల్ (పంజాబ్)
3) శశికలా కకోద్కర్ (గోవా)
4) మెహబూబా ముఫ్తీ (జమ్మూ-కశ్మీర్)
- View Answer
- సమాధానం: 1
47. ముస్లిం మహిళల మనోవర్తికి సంబంధించి ‘షాబానో కేసు’ (1985)లో తీర్పు ఇచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
1) కోకా సుబ్బారావు
2) ఎస్.ఎం. సిక్రీ
3) బి.పి. జీవన్ రెడ్డి
4) వై.వి. చంద్రచూడ్
- View Answer
- సమాధానం: 4
48. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు కింది వాటిలో దేని ద్వారా రాజ్యాంగబద్ధత కల్పించారు?
1) 65వ రాజ్యాంగ సవరణ చట్టం
2) 66వ రాజ్యాంగ సవరణ చట్టం
3) 67వ రాజ్యాంగ సవరణ చట్టం
4) 68వ రాజ్యాంగ సవరణ చట్టం
- View Answer
- సమాధానం: 1