17వ లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి ఎంత మంది అభ్యర్థులు పోటీ చేశారు?
1. 17వ లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి ఎంత మంది అభ్యర్థులు పోటీ చేశారు?
1) 183
2) 185
3) 187
4) 189
- View Answer
- సమాధానం: 2
వివరణ: 17వ లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మంది అభ్యర్థులు పోటీచేసిన నియోజకవర్గంగా నిజామాబాద్ రికార్డు సృష్టించింది. పసుపు, ఎర్రజొన్నలకు తగినంత మద్ధతు ధర కల్పించకపోవడంతో నిరసనగా 178 మంది రైతులు నామినేషన్ వేయడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి 185 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దేశంలోనే తొలిసారిగా ఈ నియోజకవర్గంలో M3 ఓటింగ్ మిషన్‌ను వినియోగించారు. ఒక్కో బూత్‌లో 12 ఈవీఎంలను వాడారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం సాధించారు.
గతంలో భారతదేశ లోక్‌సభ ఎన్నికల చరిత్రలో అత్యధిక మంది పోటీ చేసిన నియోజకవర్గంగా నల్గొండ రికార్డ సృష్టించింది. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 480 మంది అభ్యర్థులు పోటీ చేశారు. లోక్‌సభ ఎన్నికల చరిత్రలో అత్యధిక మంది పోటీ చేసిన నియోజకవర్గం ఇదే. ఈ ఎన్నిక నిర్వహణకై 50 పేజీల బ్యాలెట్ బుక్‌లెట్‌ను రూపొందించారు.
అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో అత్యధిక మంది పోటీ చేసిన నియోజకవర్గం తమిళనాడులోని మొదకురుచి. ఈ నియోజకవర్గంలో 1996 అసెంబ్లీ ఎన్నికల్లో 1033 మంది పోటీ చేశారు.
- సమాధానం: 2
2. 17వ లోక్‌సభ ఎన్నికల్లో ఎంత మంది మహిళ అభ్యర్థులు ఎన్నికయ్యారు?
1) 61
2) 71
3) 78
4) 88
- View Answer
- సమాధానం: 3
వివరణ: లోక్‌సభ ఎన్నికల చరిత్రలో అత్యధిక సంఖ్యలో 78 మహిళలు ఎన్నికయ్యారు. మొత్తం సభ్యుల సంఖ్యలో వీరిశాతం 14.36 శాతం. గతంలో అత్యధిక సంఖ్యలో మహిళలు 2014లో 16వ లోక్‌సభలో 62 మంది ఎన్నికయ్యారు. అదే విధంగా 1977లో ఆరో లోక్‌సభ ఎన్నికల్లో అతి తక్కువ సంఖ్యలో కేవలం 19 మంది మహిళలు మాత్రమే లోక్‌సభకు ఎన్నికయ్యారు.
- సమాధానం: 3
3. లోక్‌సభ కాలపరిమితి సాధారణంగా ఐదేళ్లు. కానీ అత్యవసర పరిస్థితి కాలంలో దానిని పొడిగించే అధికారం ఎవరికి ఉంది?
1) రాష్ర్టపతి
2) కేంద్ర ప్రభుత్వం
3) ఎన్నికల కమిషన్
4) భారత పార్లమెంట్
- View Answer
- సమాధానం: 4
వివరణ: సాధారణంగా లోక్‌సభ కాలపరిమితి ఐదేళ్లు. కానీ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించి నప్పుడు భారత పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీని కాలపరిమితిని ఒక ఏడాది పాటు పొడిగించవచ్చు. 1971లో ఏర్పడిన 5వ లోక్‌సభ కాలపరిమితిని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా (1976) జాతీయ అత్యవసర పరిస్థితి విధించి ఉన్న కాలంలో పార్లమెంట్ ఒక ఏడాది పాటు పొడిగించింది. ఈ విధంగా అతి ఎక్కువ కాలం కొనసాగిన లోక్‌సభ 5వది (1971-77).
అదే విధంగా లోక్‌సభను ఐదేళ్ల కంటే ముందే రద్దు చేసే అధికారం ఆర్టికల్- 85(2బి) ప్రకారం కేంద్ర కేబినెట్ సలహా ప్రకారం భారత రాష్ర్టపతికి ఉంటుంది.
- సమాధానం: 4
4. 17వ లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ఏ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నిక య్యారు?
1) అమేథీ
2) రాయ్‌బరేలీ
3) వయనాడ్
4) సుల్తాన్పూర్
- View Answer
- సమాధానం: 3
వివరణ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 17వ లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ (ఉత్తరప్రదేశ్), వయనాడ్(కేరళ) నియోజక వర్గాల నుంచి పోటీ చేశారు. అమేథీ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి స్తృతీ ఇరానీ చేతిలో ఓడిపోగా, వయనాడ్ నియోజకవర్గం నుంచి మాత్రం గెలిచారు.
గతంలో ఇందిరాగాంధీ 1977లో అరో లోక్‌సభ ఎన్నికల్లో రాయబరేలీ నియోజకవర్గంలో రాజ్‌నారాయణ్ చేతిలో ఓటమి చెందగా, అదే ఎన్నికల్లో పోటీ చేసిన మరో నియోజకవర్గం తెలంగాణలోని మెదక్ నుంచి ఎన్నికయ్యారు.
- సమాధానం: 3
5. 17వ లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ కూటమిలో కాంగ్రెస్ పార్టీ తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకున్న రాజకీయ పార్టీ ఏది?
1) డీఎంకే
2) టీఎంసీ
3) ఎన్సీపీ
4) నేషనల్ కాన్ఫరెన్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి 92 స్థానాలు గెలవగా, అందులో వరుసగా కాంగ్రెస్ - 52 సీట్లు ప్రథమ స్థానంలో, డీఎంకే - 23 సీట్లు గెలిచి రెండో స్థానంలో, ఎన్సీపీ-5 సీట్లు గెలిచి మూడో స్థానంలో ఉన్నాయి.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 353 స్థానాలు గెలవగా అందులో బీజేపీ 303 సీట్లతో మొదటి స్ధానంలో, శివసేన 18 సీట్లతో రెండో స్థానంలో , జనతాదళ్(యూ) 16 సీట్లతో మూడో స్థానంలో ఉన్నాయి.
17వ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం పార్లమెంట్ సీట్లలో బీజేపీ 303 సీట్లతో ప్రథమ స్థానంలో, కాంగ్రెస్ 52 సీట్లతో రెండో స్థానంలో, డీఏంకే 23 సీట్లతో మూడో స్థానంలో, వైఎస్సార్సీపీ, టీఎంసీ పార్టీలు 22 సీట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
- సమాధానం: 1
6. 17వ లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన అభ్యర్థి ఎవరు?
1) నరేంద్ర మోడీ
2) సి.ఆర్.పాటిల్
3) మేనకా గాంధీ
4) రాహుల్‌గాంధీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: గుజరాత్ రాష్ర్టంలోని నవ్‌సరి నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సి.ఆర్. పాటిల్ 6,89,668 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి డి.బి. పటేల్‌ను ఓడించి ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. అతి తక్కువగా 181 ఓట్లతో బీజేపీ అభ్యర్థి బోలేనాథ్ ఉత్తరప్రదేశ్‌లోని మచిలిషెహర్ నియోజకవర్గం నుంచి గెలిచారు.
భారత లోక్‌సభ ఎన్నికల చరిత్రలో అత్యధిక మెజారిటీతో మహారాష్ర్టకు చెందిన ప్రీతం ముండే గెలిచారు. ఈమె 2014 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ర్ట బీఢ్ నియోజకవర్గం నుంచి 6,96,321 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఇదే భారీ రికార్డుగా నిలిచింది.
- సమాధానం: 2
7. లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ హోదా పొందాలంటే కనీసం ఎంత శాతం సీట్లను పొందాలి?
1) 5
2) 10
3) 12
4) 20
- View Answer
- సమాధానం: 2
వివరణ: లోక్‌సభలో ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదా పొందాలంటే కనీసం పది శాతం సీట్లను అంటే 55 సీట్లను గెలవాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 52 సీట్లను మాత్రమే గెలిచింది. కాబట్టి అధికారికంగా ప్రతిపక్ష పార్టీ హోదా పొందడానికి అర్హత లేదు.
భారత లోక్‌సభ చరిత్రలో అధికారికంగా ప్రతిపక్ష నాయకునిగా గుర్తింపు పొందిన తొలివ్యక్తి వై. బి. చవాన్. 1977లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా ప్రభుత్వం ఏర్పడడంతో కాంగ్రెస్ పార్టీ 154 సీట్లతో రెండో స్థానం పొంది ప్రతిపక్ష హోదాను తొలిసారి పొందింది. దాని నేత వై.బి.చవాన్ అధికారికంగా ప్రతిపక్షనేతగా గుర్తింపు పొందారు. 1952, 57, 62, 67, 71 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ప్రతిపక్ష పార్టీ హోదా పొందడానికి కావలసిన సీట్లను ఏ పార్టీ గెలవలేదు.
1984 ఎన్నికల్లో 28 స్థానాలు గెలుచుకున్న టీడీపీ లోక్‌సభలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ నాయకుడు పి. ఉపేంద్ర అనధికారికంగా ప్రతిపక్ష నాయ కునిగా గుర్తింపు పొందారు.
- సమాధానం: 2
8. లోక్‌సభకు పోటీచేసే జనరల్ అభ్యర్థి చెల్లించాల్సిన కనీస డిపాజిట్ మొత్తం ఎంత?
1) రూ. 10,000
2) రూ. 15,000
3) రూ. 20,000
4) రూ. 25,000
- View Answer
- సమాధానం: 4
వివరణ: లోక్‌సభకు పోటీ చేసే జనరల్ అభ్యర్థి రూ.25,000లను డిపాజిట్‌గా చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థి అయితే రూ.12,500 చెల్లించాలి. ఒక వేళ పోలై చెల్లిన ఓట్లలో ఆరో వంతు ఓట్లు వ స్తే డిపాజిట్ వాపస్ వస్తుంది. లేకపోతే అది గల్లంతు అవుతుంది.
- సమాధానం: 4
9. లోక్‌సభలో ఏయే వర్గాలకు కొన్ని స్థానాలు ప్రత్యేకంగా రిజర్వ్ చేశారు?
1) ఎస్సీ, ఎస్టీ
2) ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు
3) ఎస్సీ, ఎస్టీ, బీసీలు
4) ఎస్సీ, ఎస్టీ, మహిళలు
- View Answer
- సమాధానం: 1
వివరణ: 545 లోక్‌సభ స్థానాల్లో 84 స్థానాలు ఎస్సీలకు, 47 స్థానాలు ఎస్టీలకు రిజర్వ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ - 330 ప్రకారం లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీలకు ఈ స్థానాలు రిజర్వ చేశారు. అదే విధంగా ఆర్టికల్ - 331 ప్రకారం ఆంగ్లో ఇండియన్లకు ప్రాతినిథ్యం లభించకపోతే ఇద్దరు ఆంగ్లో - ఇండియన్లను భారత రాష్ర్టపతి నియమిస్తారు.
- సమాధానం: 1
10. ప్రోటెం స్పీకర్ ఏ విధంగా పదవిని చేపడుతారు?
1) లోక్‌సభ సభ్యులతో ఎన్నిక ద్వారా
2) కేంద్ర కేబినేట్ అమోదం ద్వారా
3) ఎన్నికల కమిషన్ ద్వారా
4) రాష్ట్రపతితో నియామకం ద్వారా
- View Answer
- సమాధానం: 4
వివరణ: లోక్‌సభ ఎన్నికల తర్వాత సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్ ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ వ్యక్తిని ప్రొటెం స్పీకర్‌గా భారత రాష్ట్రపతి నియమిస్తారు. ప్రొటెం స్పీకర్‌గా పనిచేసిన తొలివ్యక్తి జీవీ మౌలంకర్, ఎక్కువ సార్లు ప్రొటెం స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి ఇంద్రజిత్ గుప్తా. ప్రస్తుత 17వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్రకుమార్ వ్యవహరించారు.
- సమాధానం: 4
11. భారత ఎన్నికల సంఘం నిర్వహించని ఎన్నిక ఏది?
1) స్పీకర్
2) స్థానిక సంస్థలు
3) డిప్యూటీ స్పీకర్
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఆర్టికల్ 324 ప్రకారం ఏర్పడిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ, కౌన్సిల్ ఎన్నికలను మాత్రమే నిర్వహిస్తుంది.
స్పీకర్ ఎన్నికను ప్రొటెం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికను స్పీకర్ నిర్విహస్తాడు.
అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఆర్టికల్ 243(కె) ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
- సమాధానం: 4
12. బ్యాలెట్ పేపర్ స్థానంలో ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లను తొలిసారిగా ఏ నియోజకవర్గంలో ఉపయోగించారు?
1) శివకాశి
2) మాండ్యా
3) తమర్
4) పరూర్
- View Answer
- సమాధానం: 4
వివరణ: ఈవీఎంలను తొలిసారిగా 1982లో పరూర్ (కేరళ) నియోజకవర్గంలో వినియోగించారు. 1999లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో పూర్తిగా వినియోగించారు. అనంతరం 2004లో 14వ లోక్‌సభ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలను ప్రవేశ పెట్టారు. ఈవీఎంల్లో నోటా (నన్ ఆఫ్ ది ఎబౌ) బటన్‌ను 2013 నుంచి ప్రవేశపెట్టారు. వీవీప్యాట్ (ఓటర్ వేరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్)ను 2013లో నాక్సెన్ (నాగాలాండ్) నియోజకవర్గంలో వినియో గించగా, పూర్తి స్థాయిలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించారు.
- సమాధానం: 4
13. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య?
1) 13
2) 18
3) 21
4) 23
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాజ్యాంగం ప్రకారం లోక్‌సభలో గరిష్టంగా 552 మంది సభ్యులు ఉండవచ్చు. కాని ప్రస్తుతం 545 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 530 మంది సభ్యులు 29 రాష్ట్రాల నుంచి ఎన్నికవుతారు. 13 మంది సభ్యులు 7 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నిక కాగా ఇద్దరు ఆంగ్లో- ఇండియన్ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.
- సమాధానం: 1
14. కింది వాటిలో ఎన్నిక ద్వారా పదవిలోకి వచ్చేవారు?
1) ఉపరాష్ట్రపతి
2) ప్రధానమంత్రి
3) ఆంగ్లో - ఇండియన్ సభ్యుడు
4) ప్రొటెం స్పీకర్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత ఉపరాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ‘ఎన్నికల గణం’గా ఏర్పడి ఎన్నుకుంటారు. భారత ప్రధానమంత్రిని లోక్‌సభలో మెజార్టీ పార్టీ నాయకున్ని భారత ప్రధానిగా రాష్ట్రపతి నియమిస్తాడు. లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ సభ్యులను అదే విధంగా ప్రొటెం స్పీకర్‌ను కూడా రాష్ట్రపతి నియమిస్తాడు.
- సమాధానం: 1
15. లోక్‌సభ కస్టోడియన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
1) ప్రధాన మంత్రి
2) హోంశాఖ మంత్రి
3) స్పీకర్
4) సిబ్బంది వ్యవహారాలశాఖ మంత్రి
- View Answer
- సమాధానం: 3
వివరణ: లోక్‌సభ కస్టోడియన్‌గా స్పీకర్ వ్యవహరిస్తాడు. లోక్‌సభ ప్రథమ పౌరుడు లోక్‌సభ అధ్యక్షుని హోదాలో సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. లోక్‌సభ సభ్యున్ని అరెస్ట్ చేస్తే స్పీకర్ అనుమతి తప్పనిసరి. లోక్‌సభ సభ్యులు తమ రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు ఇవ్వాలి.
- సమాధానం: 3
16. పార్లమెంట్‌ను సమావేశ పరచడాన్ని ఏమంటారు?
1) ప్రొరోగ్
2) సమన్
3) అడ్జర్న
4) సైనేడే
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభలను సమావేశ పరచడాన్ని ‘సమన్’ అంటారు. పార్లమెంట్ ఉభయ సభలను సమావేశాలు పూర్తై తర్వాత ముగిసినవి ప్రకటించేది లేదా దీర్ఘకాలికంగా వాయిదా వేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. దీనినే ప్రోరోగ్ అంటారు. సమావేశం జరుగుతున్నప్పుడు తాత్కలికంగా వాయిదా వేసే అధి కారం ఆయా సభాధ్యక్షులకు ఉంటుంది. దీనినే అడ్జర్న అంటారు. సభను నిరవధి కంగా వాయిదా వేసే అధికారం సభా ధ్యక్షులకు ఉంటుంది. దీనినే సైనేడే అంటారు.
- సమాధానం: 2
17. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన తొలి మహిళ?
1) వయెలెట్ అల్వా
2) వి.ఎస్. రమాదే వి
3) సుమిత్రా మహాజన్
4) మీరాకుమార్
- View Answer
- సమాధానం: 4
వివరణ: లోక్‌సభకు 16మంది స్పీకర్లు పనిచేస్తే అందులో ఇద్దరు మాత్రమే మహిళ స్పీకర్లు ఉన్నారు. తొలి మహిళా స్పీకర్ మీరాకుమార్ (2009-14), కాగా రెండో మహిళా స్పీకర్ సుమిత్రా మహాజన్ (2014-19) ఈమె 16వ లోక్‌సభకు స్పీకర్‌గా వ్యవహరించారు.ప్రస్తుత 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- సమాధానం: 4
18. రాజ్యసభ సభ్యుని పదవీకాలం ఎన్నేళ్లు?
1) 6 ఏళ్లు
2) 5 ఏళ్లు
3) 3 ఏళ్లు
4) శాశ్వత సభ
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాజ్యసభ శాశ్వత సభ కానీ రాజ్యసభ సభ్యుని పదవీకాలం 6 ఏళ్లు. రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉండగా ప్రతి రెండేళ్లకు మూడో వంతు మంది రాజీనామా చేస్తే వారి స్థానంలో కొత్తవారిని ఎన్ను కుంటారు.
- సమాధానం: 1
19. లోక్‌సభ సభ్యుని ఎన్నిక వివాదాన్ని పరిష్కరించే న్యాయస్థానం ఏది?
1) సుప్రీంకోర్టు
2) హైకోర్టు
3) జిల్లాకోర్టు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: లోక్‌సభ సభ్యుని ఎన్నిక వివాదాన్ని హైకోర్టు తన ప్రాథమిక విచారణాధికారంలో అంతర్భాగంగా పరిష్కరిస్తుంది. అదే విధంగా రాజ్యసభ సభ్యుని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నిక వివాదాన్ని కూడా హైకోర్టు పరిష్కరిస్తుంది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయవచ్చు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది.
- సమాధానం: 2
20. లోక్‌సభలో సాధారణంగా అధికార పార్టీ ప్రవేశపెట్టెది ఏది ?
1) విశ్వాస తీర్మానం
2) అవిశ్వాస తీర్మానం
3) కోత తీర్మానం
4) అభిశంసన తీర్మానం
- View Answer
- సమాధానం: 1
వివరణ: అధికార పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత సభా విశ్వాసాన్ని పొందుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం మైనార్టీలో పడినప్పుడు రాష్ట్రపతి ఆదేశం ప్రకారం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. దీనిని సభ అమోదిస్తే ప్రభుత్వం ఉంటుంది. ఒకవేళ తిరస్కరిస్తే ప్రభుత్వం రద్దవుతుంది.
- సమాధానం: 1