మొదటిసారిగా వ్యాపారస్థులకు లెసైన్స్ విధానాన్ని, విదేశీయులకు పాస్ పోర్టు విధానాన్ని అమలు చేసిన రాజ్యం ఏది?
1. కుషాణుల కాలంలోని అడక, ప్రస్త, ఘటక అంటే ఏమిటి?
1) కొలతలు
2) పన్నులు
3) తూనికలు
4) నాణేలు
- View Answer
- సమాధానం: 1
వివరణ: మిళిందపన్హ ప్రకారం అంగుళి, వ్యామ, యోజన అనేవి కొలతలు. భాగ, బలి, శుల్క అనేవి పన్నులు, మధుర శాసనం ప్రకారం అడక, ప్రస్త, ఘటక అంటే తూనికలు. నాణేలను పణాలు అనేవారు
- సమాధానం: 1
2. ప్రపంచంలో మొదటిసారి తగరపు నాణేలను ముద్రించిన ఘనత ఎవరిది?
1) రెండవ ట్రాటో
2) మీనాండర్
3) హెమిడ్రాక్స్
4) పాంటలియన్స్ అగతోకల్స్
- View Answer
- సమాధానం: 4
వివరణ: రెండవ ట్రాటో సీసం నాణేలను ముద్రించాడు. మీనాండర్ బంగారు నాణేలను ముద్రించాడు. హెమిడ్రాక్స్ వెండి నాణేలను ముద్రించాడు. పాంటలియన్స్ అగతోకల్స్ ప్రపంచంలో మొదటిసారి తగరపు నాణేలను ముద్రించాడు.
- సమాధానం: 4
3. భారతదేశంలో నాణేలపై శాసనాలను ముద్రించడం ప్రారంభించినవారు?
1) మౌర్యులు
2) శాతవాహనులు
3) గుప్తులు
4) ఇండో గ్రీకులు
- View Answer
- సమాధానం: 4
వివరణ: భారతదేశంలో మొదటగా నాణేలపై శాసనాలను ముద్రించడం ఇండో గ్రీకులతోనే ప్రారంభమైంది.
- సమాధానం: 4
4. నాణేలపై భారతీయ దేవత లక్ష్మీదేవి బొమ్మను ముద్రించిన మొదటి రాజు ఎవరు?
1) గొండోఫర్నెస్
2) అజిలెసైస్
3) అబ్దగాసెస్
4) డైద్రాక్మ్
- View Answer
- సమాధానం: 2
వివరణ: గొండోఫర్నెస్ నాణేలపై గ్రీకు దేవతల బొమ్మలను ముద్రించాడు. అజిలెసైస్ అనే శక రాజు భారతీయ దేవత లక్ష్మీదేవి బొమ్మను నాణేలపై ముద్రించాడు. అబ్దగాసెస్ అనే పహ్లవ రాజు నాణేలను ముద్రించాడు. డైద్రాక్మ్ అనే ఇండో గ్రీకు రాజు వెండి నాణేలను ముద్రించాడు.
- సమాధానం: 2
5. రెండు భాషల్లో ఉండే శాసనాలను గ్రీక్ లిపి గ్రీక్ భాష, ఖరోష్టి లిపి ప్రాకృత భాషల్లో నాణేలపై శాసనాలు చెక్కించిన చివరి కుషాణరాజు ఎవరు?
1) కుజుల కాడ్ఫయిసెస్
2) వేమా కాడ్ఫయిసెస్
3) కనిష్కుడు
4) హవిష్కుడు
- View Answer
- సమాధానం: 2
వివరణ: కుషాణ రాజులలో మొదటివాడైన కుజుల కాడ్ఫయిసెస్ రెండు భాషల్లో నాణేలపై శాసనాలు ముద్రించాడు. వేమా కాడ్ఫయిసెస్ రెండు భాషలలో నాణేలపై శాసనాలు ముద్రించిన చివరి కుషాణ రాజు. కనిష్కుడు రాజు బొమ్మ, వెనకవైపు గ్రీక్ భాషల్లోనే శాసనాలను ముద్రించాడు. హవిష్కుడు నాణేలపై ఎడమవైపు అభిముఖంగా రాజు బొమ్మను ముద్రించాడు.
- సమాధానం: 2
6. కుషాణుల కాలంలో బావులు తవ్వేవారిని ఏమని పిలిచేవారు?
1) మ్రిట్టిక వాహక
2) పేశలక
3) కూపకారక
4) ధనుకార
- View Answer
- సమాధానం: 3
వివరణ: మ్రిట్టిక వాహక అనగా మట్టిపనివారు. పేశలక అనగా వాస్తుశిల్పులు. కూపకారక అనగా బావులు తవ్వేవారు. ధనుకార అనగా దువ్వెనలు తయారు చేసేవారు.
- సమాధానం: 3
7. గుప్తుల శాసనాల ప్రకారం పూర్వం సాగులో ఉండి, ప్రస్తుతం సాగుచేయని భూమిని ఏమనేవారు?
1) క్షేత్ర
2) గోపధసరత
3) వాస్తు
4) ఖిల
- View Answer
- సమాధానం: 4
వివరణ: క్షేత్ర అనగా వ్యవసాయ భూమి. గోపధసర: అనగా పశువుల మేతకు ఉపయోగపడే పచ్చిక భూమి. వాస్తు అనగా నివాసయోగ్యమైన భూమి. ఖిల అనగా పూర్వం సాగులో ఉండి, ప్రస్తుతం సాగుచేయడానికి వీలులేని భూమి.
- సమాధానం: 4
8. గుప్తుల కాలంనాటి 6 కౌలుదారీ విధానాల్లో శాశ్వత కౌలుదారీ పద్దతిని స్పష్టంగా సూచించేది ఏది?
1) నీవి ధర్మం
2) భూమిచ్ఛిద్ర న్యాయం
3) అప్రద ధర్మం
4) అక్షయ నీవి ధర్మం
- View Answer
- సమాధానం: 2
వివరణ: నీవి ధర్మం అనగా నీవి అంటే కొనసాగించి దానిపై వచ్చే ఆదాయాన్ని మాత్రమే గ్రహీత అనుభవించవచ్చు అని తెలుపుతుంది. భూమిచ్ఛిద్ర న్యాయం శాశ్వత కౌలుదారీ పద్దతిని స్పష్టంగా సూచించినట్లు దామోదర్‌పూర్ తామ్ర శాసనం తెలుపుతుంది. అప్రద ధర్మం ప్రకారం భూమిని శాశ్వతంగా అనుభవించవచ్చు కానీ ఇతరులకు దానం ఇవ్వడం కుదరదు. అక్షయ నీవి ధర్మం అంటే అన్ని హక్కులతో భూమిని దానం చేయడం.
- సమాధానం: 2
9. గుప్తుల కాలంనాటి బెంగాల్ శాసనాల ప్రకారం భూమి కొలతల్లో దాదాపు ఒక ఎకరా విస్తీర్ణానికి సమానమైన భూమిని ఏమని పిలిచేవారు?
1) కుల్యవాప
2) ద్రోణవ్యాప
3) ఆధవాప
4) హస్తం
- View Answer
- సమాధానం: 1
వివరణ: కుల్యవాప అంటే దాదాపు ఒక ఎకరా భూమికి సమానం. ఒక కుల్యవాప 8 ద్రోణ వాపలకు, 32 ఆధవాపలకు సమానం. హస్తం అంటే 45 సెం.మీ. కి సమానం.
- సమాధానం: 1
10. గుప్తుల కాలంనాటి భూమిశిస్తులో పంటలో రాజు భాగాన్ని ఏమని పిలిచేవారు?
1) ఉద్రంగ
2) కర
3) ఉపరికర
4) హిరణ్య
- View Answer
- సమాధానం: 1
వివరణ: పంటలో రాజు భాగాన్ని ఉద్రంగ అని, నిర్ణీత సమయాల్లో చెల్లించే పన్నును కర అని, కౌలు రైతులపై విధించే పన్నును ఉపకరిక అని, ధనం లేదా బంగారం రూపంలో చెల్లించే పన్నును హిరణ్య అని పిలిచేవారు.
- సమాధానం: 1
11. గుప్తుల కాలంలో వెట్టిపని ఉండేదని తెలుపని శాసనం ఏది?
1) రిద్దాపూర్ శాసనం
2) ఖో తామ్రశాసనం
3) చమ్మక్ సివాని తామ్రశాసనం
4) గంగాధర్ శిలాశాసనం
- View Answer
- సమాధానం: 4
వివరణ: వాకాటక మహారాణి ప్రభావతి గుప్త రిద్దాపూర్ శాసనం, జయనాథుని ఖో తామ్రశాసనం, రెండవ ప్రవరసేనుని చమ్మక్ సివాని తామ్రశాసనాలు గుప్తులకాలంలోని వెట్టిపని గురించి తెలియజేస్తాయి. విశ్వవర్మనుని గంగాధర్ శిలాశాసనం మాళ్వా ప్రాంతంలోని పెద్దబావి గురించి వివరిస్తుంది.
- సమాధానం: 4
12. గుప్తుల కాలంలోని శ్రేణుల సలహాసంఘంలో సభ్యుడు కానివారు ఎవరు?
1) నగరశ్రేష్ఠి
2) సార్థవాహా
3) భాండగారిక
4) ప్రథమ కులిక
- View Answer
- సమాధానం: 3
వివరణ: గుప్తుల కాలంలో ప్రతి శ్రేణికి ఒక సలహాసంఘం ఉండేది. దీనిలోముగ్గురు సభ్యులుండేవారు. వారు నగరశ్రేష్ఠి (నగర షావుకారు), సార్థవాహా (ప్రధాన వ్యాపారస్థుడు), ప్రథమ కులిక (ప్రధాన చేతిపనివారు) దీనిలో సభ్యులు. భాండగారికుడు శ్రేణుల సమాఖ్యకు అధ్యక్షునిగా ఉండేవాడు.
- సమాధానం: 3
13. మొదటిసారిగా వ్యాపారస్థులకు లెసైన్స్ విధానాన్ని, విదేశీయులకు పాస్ పోర్టు విధానాన్ని అమలు చేసిన రాజ్యం ఏది?
1) మౌర్యులు
2) శాతవాహనులు
3) గుప్తులు
4) కుషాణులు
- View Answer
- సమాధానం: 1
వివరణ: మౌర్యుల కాలంలో వ్యవస్థీకృతమైన వ్యాపార వ్యవస్థ ఉండేది. అన్ని వివరాలు పక్కాగా రిజిస్టర్లలో నమోదు చేసుకొనేవారు. వీరి కాలంలో ప్రతి వ్యాపారి మార్కెట్ల (పణ్యశాల)లో అమ్మకాలు సాగించేందుకు లెసైన్స్ తీసుకోవాలి. విదేశాల నుంచి వచ్చిన వ్యాపారులు పాస్ పోర్టు తీసుకోవాల్సి ఉండేది.
- సమాధానం: 1
14. ‘భారతదేశం రోమ్ సామ్రాజ్యం నుంచి పదికోట్లసెసోస్టెరస్ (నాణేలు) పొందని సంవత్సరం లేదు’ అని పేర్కొన్నది ఎవరు?
1) మెగస్తనీస్
2) పాహీయాన్
3) ఇత్సింగ్
4) ప్లీనీ
- View Answer
- సమాధానం: 4
వివరణ:మొదటి ముగ్గురు వివిధకాలల్లో భారత దేశంలో పర్యటించిన చైనా యాత్రికులు, కానీ ప్లీనీ అనే గ్రీకు యాత్రికుడు రోమ్ సంపద బంగారం రూపంలో భారతదేశానికి తరలిపోతుంది అని వాపోయారు. అతడు రచించిన ‘నాచురల్ హిస్టరీ’ అనే గ్రంథంలో ‘భారతదేశం రోమ్ సామ్రాజ్యం నుంచి పదికోట్ల సెసోస్టెరస్ (నాణేలు) పొందని సంవత్సరం లేదు‘ అని పేర్కొన్నాడు.
- సమాధానం: 4
15. జతపరచండి.
జాబితా 1
1. మొదటి చంద్రగుప్తుడు
2. రెండవ చంద్ర గుప్తుడు
3. సముద్ర చంద్ర గుప్తుడు
జాబితా 2
ఎ. వెండి నాణేలు
బి. రాగి నాణేలు
సి. బంగారు నాణేలు
1) 1 -ఎ, 2 - బి, 3 - సి
2) 1 - బి, 2 - సి, 3 - ఎ
3) 1 - సి, 2 - ఎ, 3 - బి
4) 1 - సి, 2 - బి, 3 - ఎ
- View Answer
- సమాధానం: 3
వివరణ: గుప్త రాజుల్లో మొదటి చంద్ర గుప్తుడు బంగారు నాణేలను, రెండవ చంద్ర గుప్తుడు వెండి నాణేలను, సముద్ర చంద్ర గుప్తుడు రాగి నాణేలను మొదటగా ముద్రించారు.
- సమాధానం: 3
16. భవిష్యత్తులో సంభవించే కరువుకాటకాలు, యుద్ధాలు మొదలైన అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి గుప్తులు తమ అత్యవసర నిధిని ఎలా ఉపయోగించేవారు?
1) వ్యాపారంలో పెట్టుబడి రూపంలో
2) శ్రేణుల దగ్గర డిపాజిట్ల రూపంలో
3) రహస్యనిధుల రూపంలో
4) బాండ్ల రూపంలో
- View Answer
- సమాధానం: 3
వివరణ: భవిష్యత్తులో సంభవించే కరువుకాటకాలు, యుద్ధాలు మొదలగు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి గుప్తులు ధనాన్ని రహస్యంగా దాచిపెట్టేవారు. గుప్త సామ్రాజ్యంలోని అనేక ప్రదేశాల్లో జరిగిన తవ్వకాల్లో లభించిన గుప్తనిధుల ద్వారా ఈ విషయం మనకు స్పష్టమైంది.
- సమాధానం: 3
17. తొలి గుప్తరాజుల బంగారు నాణేలు ఎవరి ప్రామాణిక తూకంపై ఆధారపడి ముద్రించేవారు?
1) మౌర్యుల ప్రామాణిక తూకంపై
2) శాతవాహనుల ప్రామాణిక తూకంపై
3) కుషాణుల ప్రామాణిక తూకంపై
4) గ్రీకుల ప్రామాణిక తూకంపై
- View Answer
- సమాధానం: 3
వివరణ: తొలి గుప్తరాజుల బంగారు నాణేలు కుషాణుల బంగారు నాణేల ప్రామాణిక తూకంపై ఆధారపడి ముద్రించారు. కుషాణులు నాణేలు ముద్రించేందుకు రోమ్ చక్రవర్తులకు చెందిన ’అరై’ బంగారు నాణేల ప్రామాణిక తూకాన్ని అనుసరించారు. స్కందగుప్తుడు మాత్రం ఈ పద్దతిని మార్చి 80 రత్తిలు లేదా 144 గురివింద గింజల భారతీయ సువర్ణ నాణేల ప్రామాణిక తూకాన్ని వాడాడు.
- సమాధానం: 3
18. గుప్తుల వెండినాణేలు ఎక్కువగా భారతదేశంలోని ఏ ప్రాంతంలో లభించాయి?
1) తూర్పు భారత దేశంలో
2) పశ్చిమ భారత దేశంలో
3) మధ్య భారత దేశంలో
4) దక్షిణ భారత దేశంలో
- View Answer
- సమాధానం: 2
వివరణ: పశ్చిమ భారత దేశంలో జరిపిన తవ్వకాల్లో గుప్తుల వెండి నాణేలు ఎక్కువగా లభించాయి.
- సమాధానం: 2
19. భారతీయులు శ్రీలంకను ‘సీల్ అడిబ ’ అని పిలిచేవారు అని చెప్పిన యాత్రికుడెవరు?
1) గుణాడ్యుడు
2) హాలుడు
3) కాస్మాస్
4) పాహియాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: కాస్మాస్ అనే గ్రీకు యాత్రికుడు, భారతీయులు శ్రీలంకను ’సీల్ అడిబ’ అని పిలిచేవారు అని రాసుకున్నాడు. అలాగే మన దేశానికి ఇథియోఫియా, శ్రీలంకలతో ఉన్న వ్యాపార సంబంధాలను ఎగుమతి, దిగుమతులను పేర్కొన్నాడు. హాలుడు ప్రాకృత భాషలో ’గాథాసప్తశతి’ అనే గ్రంథాన్ని సంకలనం చేశాడు. గుణాడ్యుడు బృహత్కథ అనే గ్రంథాన్ని ప్రాకృతంలో రాశాడు. పాహియాన్ చైనా యాత్రికుడు ఇతను అనేక విషయాలను తన గ్రంథాల్లో వివరించాడు.
- సమాధానం: 3
20. గుప్తుల కాలంలోని గనుల గురించి, ఖనిజాల గురించి పేర్కొన్న గ్రంథం ఏది?
ఎ. బృహత్సంహిత
బి. గాథాసప్తశతి
సి. అమరకోశం
డి. కాతంత్ర వ్యాకరణం
1) బి, సి, డి
2) ఎ, బి, సి
3) ఎ, బి, డి
4) ఎ, సి
- View Answer
- సమాధానం: 4
వివరణ: గుప్తుల కాలంలో గనులు, ఖనిజ సంపద, రిజర్వు అడవులు మొదలైనవి ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. చోటానాగపూర్ ప్రాంతాలు లోహ ఖనిజాలకు మూలాధారంగా ఉండేవి. వీటి గురించి అమరకోశం, బృహత్సంహిత పేర్కొన్నాయి.
- సమాధానం: 4
21. గుప్తుల కాలంలో చర్మ పరిశ్రమ మీద గుత్తాదిపత్యం ఎవరికి ఉండేది?
1) ప్రభుత్వానికి
2) గ్రామాలకు
3) రైతులకు
4) వర్తకులకు
- View Answer
- సమాధానం: 1
వివరణ: గుప్తుల కాలంలో చర్మ పరిశ్రమపై ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేది. ప్రభుత్వమే చర్మాలను చర్మకారులకు, వర్తకులకు అమ్మకం చేసేది. పాదరక్షలు తయారుచేసేవారిని, వివిధ రకాల పాదరక్షలను గురించి అమరకోశం పేర్కొంది.
- సమాధానం: 1
22. గుప్తుల కాలంలో అద్దాల తయారీలో వాడే ముఖ్యమైన లోహాలు ఏవి?
ఎ. రాగి
బి. కంచు
సి. ఇత్తడి
డి. గాజు
1) ఎ, బి, సి, డి
2) ఎ, బి, సి
3) ఎ, బి, డి
4) ఎ, సి, డి
- View Answer
- సమాధానం: 2
వివరణ: గుప్తుల కాలంలో ప్రజలు అలంకరణలో భాగంగా అద్దాలు వాడేవారు. అయితే తయారు చేసేందుకు గాజును వాడేవారు కాదు. లోహాలకు బాగా మెరుగుపెట్టి అద్దాలుగా వాడేవారు. అద్దాల తయారీకి రాగి, కంచు, ఇత్తడి వాడేవారు. అజంతా చిత్రాల్లో లోహంతో చేసిన గుండ్రని అద్దాలు కనిపిస్తాయి.
- సమాధానం: 2
23. శూద్రులు వ్యవసాయదారులని పేర్కొన్న యాత్రికుడు ఎవరు?
1) ఇత్సింగ్
2) మెగస్తనీస్
3) హుయాన్ త్సాంగ్
4) పాహియాన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: హర్షుని కాలంలో పర్యటించిన హుయాన్ త్సాంగ్ శూద్రులు వ్యవసాయదారులని పేర్కొన్నాడు.
- సమాధానం: 3
24. ‘విజేత, అవనీపతి అయిన శ్రీశిలాదిత్యుడు స్వర్గలోకాన్ని జయిస్తాడు ’ అని నాణేలమీద శాసనం రాయించిన చక్రవర్తి ఎవరు?
1) హర్షుడు
2) ఖారవేలుడు
3) రెండవ పులకేశి
4) రెండవ చంద్రగుప్తుడు.
- View Answer
- సమాధానం: 1
వివరణ: హర్షుడు ప్రతాపశ అనే వెండి నాణేలను ముద్రించాడు. దానిపైన ‘విజేత, అవనీపతి అయిన శ్రీశిలాదిత్యుడు స్వర్గలోకాన్ని జయిస్తాడు’ అని శాసనం రాయించాడు.
- సమాధానం: 1
25. గుప్తుల కాలంలో తయారు చేసిన రాగి బుద్ధుని విగ్రహాలు ఏ రాష్ట్రంలో దొరికాయి?
ఎ. బెంగాల్
బి. బీహార్
సి. ఉత్తర్‌ప్రదేశ్
డి. మధ్యప్రదేశ్
1) ఎ, బి, డి
2) బి, డి
3) బి, ఎ, డి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 2
వివరణ: గుప్తుల కాలంలో ఇనుము తర్వాత రాగి అత్యంత ఉపయోగకరమైన లోహం. రాగి, కంచు లోహాల్ని ముఖ్యంగా ప్రతిమలు, వంటపాత్రలు, కుండలు, నాణేల తయారీకి వాడేవారు. రాగితో చేసిన బుద్ధుని విగ్రహాలు బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో దొరికాయి.
- సమాధానం: 2