మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభించిందెవరు?
సంపూర్ణ స్వాతంత్య్రమే లక్ష్యంగా సాగుతున్న, శాసనోల్లంఘనోద్యమం జరుగుతున్న కాలంలో లండన్‌లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. ఆనాటి లేబర్ పార్టీకి చెందిన ప్రధాని రామ్సే మాక్ డోనాల్డ్ సూచనతో ఇర్విన్ INC నాయకుల వద్దకు జయకర్, తేజ్ బహదూర్ సప్రూలను సంప్రదింపుల కోసం పంపారు. రౌండ్ టేబుల్ సమావేశాలు సంపూర్ణ స్వరాజ్యం లక్ష్యంగా చర్చలు జరగాలని పట్టుబట్టడంతో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం INC నుంచి ఎవరి ప్రాతినిధ్యం లేకుండానే జరిగింది. అయితే మత అంశాలు, అభిప్రాయాలు, విభేదాలు మొదలైన కారణాలతో ఈ సమావేశం వాయిదా పడింది.
రెండో రౌండ్ టేబుల్ సమావేశంలోనూ కమ్యూనల్ అవార్డు ప్రతిపాదనను అనుసరించి భారత్‌లోని కుల, మత ఇతర వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే మిషతో విభజించు, పాలించు అనే సిధ్ధాంతాన్ని బ్రిటిష్ వారు అనుసరించారు అనేది మేధావుల అభిప్రాయం. అందువల్ల బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత్‌లో సాగుతున్న జాతీయోద్యమాన్ని అరికట్టడమే బ్రిటిష్ ప్రభుత్వ లోగుట్టు. ఈ సమావేశాల ఫలితంగా భారతీయుల కొన్ని సమస్యలు చర్చించటానికి అవకాశం ఏర్పడింది.
రౌండ్ టేబుల్ సమావేశాలు (1930-1932):
- రౌండ్ టేబుల్ సమావేశాలు మొత్తం 3 జరిగాయి.
- రౌండ్ టేబుల్ సమావేశాల ముఖ్య ఉద్దేశం నూతన రాజ్యాంగాన్ని రచించడానికి, అన్నీ పక్షాల వారితో చర్చించడానికి.
- రౌండ్ టేబుల్ సమావేశాలకు మరో పేరు ‘అఖిలపక్ష సమావేశాలు’
- మొదటి, మూడో రౌండ్ టేబుల్ సమావేశాలను భారత జాతీయ కాంగ్రెస్ తిరస్కరించింది.
- 1930 నవంబర్ 12 నుంచి 1931 జనవరి 19 వరకు జరిగింది.
- ఈ సమావేశం నాటికి బ్రిటన్‌లో అధికారంలో ఉన్న పార్టీ - లేబర్ పార్టీ
- ఈ సమావేశం నాటికి బ్రిటన్ ప్రధాని - రామ్సే మాక్ డోనాల్డ్
- ఈ సమావేశం నాటి బ్రిటన్ రాజు - ఐదో జార్జి (సమావేశం ప్రారంభించాడు).
- ఈ సమావేశానికి హాజరైన మొత్తం ప్రతినిధుల సంఖ్య - 89
- ఈ సమావేశం జేమ్స్ ప్యాలెస్‌లో జరిగింది.
- మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షుడు రామ్సే మాక్ డోనాల్డ్.
- ముస్లింలు - 16
- హిందూ మహాసభ - 3
- సిక్కులు - 2
- బ్రాహ్మణేతరులు - 4
- భూస్వాములు - 4
- బర్మావారు -3
- యూరోపియన్లు - 4
- ఆంగ్లో ఇండియన్లు - 1
- భారతీయ వర్తకులు -1
- సంస్థానాధీశులు -16
- లిబరల్ పార్టీవారు -16
- ఈ సమావేశంలో ముస్లిం ప్రతినిధులకు, హిందూ మహాసభ ప్రతినిధులకు విభేదాలు ఏర్పడ్డాయి.
- అంబేడ్కర్ షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక నియోజక వర్గాలు ఇవ్వాలని పేర్కొన్నారు.
- మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎటువంటి నిర్ణయం చేయకుండానే 1931 జనవరి 1కి వాయిదా పడింది.
- మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్న సమయంలోనే రహ్మత్ అలీ పాకిస్తాన్ ప్రతిపాదన చేశాడు.
- అలహాబాద్ ముస్లిం లీగ్ సభలో అధ్యక్షుడు మహ్మద్ ఇక్బాల్ పాకిస్తాన్ కావాలనే భావాన్ని వ్యక్తీకరించాడు.
- భారతదేశ విభజనకు దోహదం చేసింది మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్న సందర్భంలోనే.
- రౌండ్ టేబుల్ సమావేశాలకు స్వతంత్ర పార్టీ (లిబరల్ పార్టీ) తరపున హాజరైన ఆంధ్రుడు - సి.వై. చింతామణి
- కమ్యూనల్ అవార్డును వ్యతిరేకించిన ప్రముఖ హరిజన నాయకుడు - కుసుమ ధర్మన్న
- 1932 జనవరి 4వ తేదిన గాంధీజీని మరోసారి బ్రిటిష్ వారు అరెస్ట్ చేశారు.
- గాంధీ-ఇర్విన్ చర్చలు 1931 ఫిబ్రవరి 17న ప్రారంభమయ్యాయి.
- 1931 మార్చి 5న గాంధీ - ఇర్విన్ ఒడంబడిక జరిగింది.
- రాజకీయ ఖైదీలకు కొన్ని మినహాయింపులను ఇచ్చి విడుదల చేయాలి
- శాసనోల్లంఘన ఉద్యమాన్ని తాత్కాలికంగా నిలిపి వేయాలి.
- సొంత వాడకానికి ఉప్పు తయారీ చేసుకోవచ్చు.
- సత్యాగ్రహుల ఆస్తులను ప్రభుత్వం తిరిగి ఇచ్చి వేయాలి.
- వసూలు చేయని జరిమానాలు రద్దు చేయడానికి అనుమతినివ్వాలి.
- భూమి శిస్తు మాఫీ మొదలైనవి.
గాంధీ- ఇర్విన్ ఒప్పందాన్ని జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్ర బోస్ విమర్శించారు.
గాంధీ-ఇర్విన్ ఒప్పందంలో భగత్‌సింగ్ శిక్ష రద్దును గురించి చర్చించలేదని గాంధీపై ఒక విమర్శ ఉంది.
ఈ ఒప్పందాలను అనుసరించి:
- 1931లో కరాచీలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీని తమ ఏకైక ప్రతినిధిగా పంపించడానికి తీర్మానించారు.
- ఈ సమావేశానికి వ్యక్తిగత హోదాలో హాజరైన వారు - సరోజిని నాయుడు, మదన్ మోహన్ మాలవ్యా
- ఈ సమావేశంలో అంబేడ్కర్ కోరిన ప్రత్యేక నియోజక వర్గాల అంశానికి వ్యతిరేకంగా గాంధీజీ మాట్లాడాడు.
- ఈ సమావేశంలో పాల్గొని గాంధీ భారత్‌కు 1931 డిసెంబర్ 28న తిరిగి వచ్చారు.
- 1932 జనవరి 1న బొంబాయిలో గాంధీ శాసనోల్లంఘనోద్యమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
- గాంధీని అరెస్ట్ చేసిన జనవరి 4వ తేదీని ‘ అఖిల భారత ఖైదీల దినం’గా పరిగణిస్తారు.
- 1932 నవంబర్ 17న లండన్‌లో ప్రారంభమైన ఈ సమావేశం డిసెంబర్ 24 వరకు జరిగింది.
- 3వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన బ్రిటిష్ ప్రతినిధులలో కీలక పాత్రధారి - సర్జాన్ సైమన్
- ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య- 46
- కమ్యూనల్ అవార్డ ప్రకారం దేశంలోని రాష్ర్ట శాసన సభల్లో 71 సీట్లు కేటాయించారు.
- కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా గాంధీజీ ఎరవాడ (పూనా) జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.
- గాంధీ-అంబేడ్కర్ల మధ్య పూనా ఒడంబడిక జరిగింది (1932 సెప్టెంబర్ 24).
- ఈ రౌండ్ టేబుల్ సమావేశాల ఆధారంగా ప్రభుత్వం 1933 సంవత్సరంలో ‘శ్వేతపత్రం’విడుదల చేసింది.
- 1935 చట్టం 3వ రౌండ్ టేబుల్ సమావేశం ఫలితంగా ఏర్పడింది.
- గాంధీ-అంబేడ్కర్ల మధ్య జరిగిన పూనా ఒప్పందం ప్రకారం, కమ్యూనల్ అవార్డు ప్రకారం కేటాయించిన సీట్లు 71 నుంచి 148కి పెంచారు. అయితే ఇవి ప్రత్యేక నియోజక వర్గాలు కాదు, అందరి భాగస్వామ్యం, ద్వంద్వ ఎన్నిక విధానం ప్రకారం కేటాయించినవి.
- త్వరలో తయారు కాబోయే భారత రాజ్యాంగంలో ‘హక్కుల జాబితా’ను చేర్చాలని భారతీయులు సూచన చేసినప్పటికీ బ్రిటిష్ మేధావులు అంగీకరించలేదు. అందుకే ఈ సమావేశమూ సత్ఫలితం ఇవ్వకుండానే ముగిసింది.
ఈ సమావేశానికి మొత్తం 89 మంది ప్రతినిధులు హాజరయ్యారు-INC బహిష్కరించింది.
1. మూంజే - హిందూమహాసభ
2. H.A.J గిడ్ని - ఆంగ్లో ఇండియన్లు
3. డా. బి.ఆర్. అంబేడ్కర్- దళితులు/ వెనుకబడినవారు.
4. ముస్లిం లీగ్: మహ్మద్ షఫీ, మహ్మద్ అలీ, మహ్మద్ అలీ జిన్నా, ఫజల్ ఉల్హక్
5. సిక్కు: సంపూరణ్ సింగ్
6. లిబరల్ పార్టీ: తేజ్ బహదూర్ సప్రూ వి.ఎస్. శ్రీనివాస శాస్త్రి
సి.వై. చింతామణి
7. సర్ హ్యూబర్ట వింబ్కార్ - బ్రిటిష్ వాణిజ్య వర్గం
8. కె.టి. పాల్ - భారతీయ క్రైస్తవులు
9. సర్ అక్బర్ హైదరీ - హైదరాబాద్ సంస్థానం
10. సర్ మీర్జా మహ్మద్ ఇస్మాయిల్ - మైసూర్ సంస్థానం
11. కల్నల్ కె.యన్. హక్సన్ - గ్వాలియర్
రెండో రౌండ్ టేబుల్ సమావేశం/ హాజరైన ప్రముఖులు/ప్రతినిధులు:
- (1931 సెప్టెంబర్7-1931 డిసెంబర్ 1)
- జి.డి. బిర్లా - వ్యాపార వేత్త/ వణిక్ ప్రముఖుడు
- భారత జాతీయ కాంగ్రెస్ - మహాత్మా గాంధీ
- అలీ ఇమామ్ - నేషనలిస్ట్ ముస్లిం పార్టీ
- శ్రీమతి సరోజిని నాయుడు, మదన్ మోహన్ మాలవ్య వ్యక్తిగత హోదాలో గాంధీజీతో పాటుగా హాజరయ్యారు.
- డా. ఎస్.కె. దత్తా - భారతీయ క్రైస్తవుడు.
- గాంధీజీ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో 1931 నవంబర్ 30వ తేదీన ప్రసంగించారు.
1. కింది వారిలో ఎవరు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు?
1) మదన్ మోహన్ మాలవ్యా
2) డా. బి. ఆర్. అంబేడ్కర్
3) మహ్మద్ ఇక్బాల్
4) సి.వై. చింతామణి
- View Answer
- సమాధానం: 2
2. రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనని వారెవరు?
1) మహాత్మా గాంధీ
2) జి.డి. బిర్లా
3) అలీ ఇమామ్
4) అబ్బాస్ త్యాబ్జీ
- View Answer
- సమాధానం: 4
3. కింది వాటిలో సరైంది ఏది?
1) మొత్తం 46 మంది ప్రతినిధులు 3వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు
2) మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని 5వ జార్జి ప్రారంభించారు
3) ఇర్విన్‌తో జరిపిన చర్చల వల్ల గాంధీజీ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
4. ఇంగ్లండ్‌కు చెందిన వివిధ పార్టీల వారు మొత్తం ఎంత మంది మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు?
1) 16
2) 18
3) 20
4) 22
- View Answer
- సమాధానం: 1
5.కింది వాటిలో సరికాని అంశం ఏది?
1) 1932 మార్చి 5న గాంధీ-ఇర్విన్ ఒప్పందం జరిగింది
2) 57 మంది భారత ప్రతినిధులు మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు
3) ఇర్విన్ తర్వాత భారత్ వచ్చిన వైశ్రాయ్ లార్డ వెల్లింగ్టన్
4) ఏదీ కాదు
- View Answer
- సమాధానం: 1
6. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1930 నవంబర్ 12
2) 1930 డిసెంబర్ 12
3) 1930 నవంబర్ 21
4) 1930 డిసెంబర్ 21
- View Answer
- సమాధానం: 1
7. కింది వారిలో కమ్యూనల్ అవార్డు వ్యతిరేకించిన వారు ఎవరు?
1) డా. బి.ఆర్. అంబేడ్కర్
2) రామ్సే మాక్ డోనాల్డ్
3) కుసుమ ధర్మన్న
4) భాగ్యారెడ్డి వర్మ
- View Answer
- సమాధానం: 3
8.మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నాటికి ఇంగ్లండ్‌లో అధికారంలో ఉన్న పార్టీ ఏది?
1) లిబరల్ పార్టీ
2) డెమోక్రటిక్ పార్టీ
3) కన్జర్వేటివ్ పార్టీ
4) లేబర్ పార్టీ
- View Answer
- సమాధానం: 4
9. కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా గాంధీజీ ఎక్కడ నిరాహార దీక్ష చేపట్టారు?
1) ఎర్రవాడ
2) వార్థా
3) అహ్మదాబాద్
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 1
10. రెండో రౌండ్ టేబుల్ సమావేశాల కాలంలో ఇంగ్లండ్‌లో అధికారంలో ఉన్న పార్టీ ఏది?
1) లేబర్ పార్టీ
2) కన్జర్వేటివ్ పార్టీ
3) కో-ఆపరేటివ్ పార్టీ
4) లిబరల్ పార్టీ
- View Answer
- సమాధానం: 2
11.మొదటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభించిందెవరు?
1) రామ్సే మాక్ డోనాల్డ్
2) జార్జి -V
3) జార్జి- VI
4) ఎలిజబెత్ -II
- View Answer
- సమాధానం: 2
12. గాంధీ - అంబేడ్కర్ల మధ్య పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది?
1) 1932 సెప్టెంబర్ 24
2) 1932 అక్టోబర్ 2
3) 1932 ఆగస్ట్ 16
4) 1932 నవంబర్ 19
- View Answer
- సమాధానం: 1
13. రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీకి సహకరించడానికి వ్యక్తిగత హోదాలో హాజరైన మహిళ ఎవరు?
1) దుర్గాభాయ్ దేశ్‌ముఖ్
2) యామినీ పూర్ణ తిలకం
3) సరోజిని నాయుడు
4) పద్మజా నాయుడు
- View Answer
- సమాధానం: 3
14. అఖిల భారత ఖైదీల దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు?
1) జనవరి 2
2) జనవరి 3
3) జనవరి 4
4) జనవరి 5
- View Answer
- సమాధానం: 3
15. 3వ రౌండ్ టేబుల్ సమావేశ ఫలితంగా ఏర్పడిన చ ట్టం ఏది?
1) భారత స్వాతంత్య్ర చట్టం 1947
2) రౌలత్ చ ట్టం
3) వితంతు పునర్వివాహ చట్టం
4) 1935 భారత ప్రభుత్వ చట్టం
- View Answer
- సమాధానం: 4