మహారాష్ర్టులు
1. ‘మహారాష్ట్ర జాతిపిత’గా గుర్తింపు పొందింది ఎవరు?
ఎ) శివాజీ
బి) శంభాజీ
సి) రాజారాం
డి) సాహు
- View Answer
- సమాధానం: ఎ
2. కింది వాటిలో మహారాష్ట్ర రాజ్య రాజధానిగా వర్థిల్లిన ప్రాంతం ఏది?
ఎ) రాయ్‌గఢ్
బి) డిండి, సతార
సి) కొల్హాపూర్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
3. జతపరచండి.
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ జాబితా - 1 జాబితా - 2 1) శివాజీ ఆధ్యాత్మిక గురువు ఎ) సమర్థ రామదాసు 2) శివాజీ సంరక్షకుడు బి) దాదాజీ కొండదేవ్ 3) శివాజీ తండ్రి సి) షాజీ బోన్సలే 4) శివాజీని బంధించడానికి వచ్చిన వ్యక్తి డి) షయిస్తాఖాన్ 5) శివాజీతో పురందర్ సంధి చేసుకున్న పాలకుడు ఇ) ఔరంగజేబు
బి) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి, 5-ఇ
డి) 1-డి, 2-ఇ, 3-సి, 4-ఎ, 5-బి
- View Answer
- సమాధానం: ఎ
4. శివాజీని అత్యంత ప్రభావితం చేసిన అతడి తల్లి జిజియాబాయి ఏ వంశానికి చెందినవారు?
ఎ) పాండ్య
బి) యాదవ
సి) చేర
డి) రాష్ట్రకూట
- View Answer
- సమాధానం: బి
5. మొగలులను ఎదిరించిన మహారాష్ట్ర వీరవనిత ఎవరు?
ఎ) జిజియాబాయి
బి) వసూబాయి
సి) తారాబాయి
డి) రాజసబాయి
- View Answer
- సమాధానం: సి
6. శివాజీ మొదట ఆక్రమించిన కోట ఏది?
ఎ) తోరణ దుర్గం
బి) కళ్యాణ్
సి) భివాండి
డి) మహాలి
- View Answer
- సమాధానం: ఎ
7. శివాజీ కంటే ముందే మహారాష్ట్ర ప్రాంతాన్ని సంస్కృతిపరంగా ఏకం చేసిందెవరు?
ఎ) ఏకనాథ్
బి) తుకారాం
సి) రామదాసు
డి) పైవారందరూ
- View Answer
- సమాధానం: డి
8. ఆంగ్లేయులకు ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని ఇచ్చింది ఎవరు?
ఎ) రంజిత్‌సింగ్
బి) దిలీప్‌సింగ్
సి) రాణి జిందాన్
డి) కరణ్‌సింగ్
- View Answer
- సమాధానం: బి
9.శివాజీ ఆధ్యాత్మిక గురువు సమర్థరామదాసు రచించిన గ్రంథం ఏది?
ఎ) అమరచిత్ర
బి) దాసబోధ
సి) రత్నావళి
డి) నీతిశాస్త్ర ముక్తావళి
- View Answer
- సమాధానం: బి
10. శివాజీ.. తాను ఆక్రమించిన ఏ కోటకు ‘విజయపురి’గా నామకరణం చేశాడు?
ఎ) పురందర్
బి) రాయ్‌గఢ్
సి) సింహగఢ్
డి) కోండన్
- View Answer
- సమాధానం: సి
11. శివాజీ జీవితంలో ప్రముఖ సంఘటనలు - సంవత్సరాలను జతపరచండి.
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ జాబితా - 1 జాబితా - 2 1) శివాజీ జననం ఎ) 1627 2) మొదటి దాడి బి) 1646 3) పురందర్ సంధి సి) 1665 4) ఛత్రపతిగా పట్టాభిషేకం డి) 1674 5) మరణం ఇ) 1680
బి) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
సి) 1-సి, 2-ఎ, 3-ఇ, 4-బి, 5-డి
డి) 1-డి, 2-ఇ, 3-బి, 4-ఎ, 5-సి
- View Answer
- సమాధానం: ఎ
12. శివాజీని బంధించడానికి వచ్చిన సేనాని ఎవరు?
ఎ) అఫ్జల్ఖాన్
బి) షయిస్తాఖాన్
సి) రాజా జైసింగ్
డి) పైవారందరూ
- View Answer
- సమాధానం: డి
13. శివాజీ 1653లో ప్రవేశపెట్టిన నూతన శకం ఏది?
ఎ) శక యుగం
బి) విజయ శకం
సి) విక్రమ శకం
డి) జయ శకం
- View Answer
- సమాధానం: బి
14. జతపరచండి.
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ జాబితా - 1 జాబితా - 2 1) చివరి పీష్వాల్లో గొప్పవాడు ఎ) మాధవరావు 2) మొదటి పీష్వా బి) బాలాజీ విశ్వనాథ్ 3) పీష్వాల్లో అగ్రగణ్యుడు సి) మొదటి బాజీరావు 4) చివరి పీష్వా డి) రెండో బాజీరావు 5) మూడో పానిపట్ యుద్ధ మరాఠా నాయకుడు ఇ) సదాశివరావు
బి) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
సి) 1-సి, 2-బి, 3-ఎ, 4-ఇ, 5-డి
డి) 1-డి, 2-ఎ, 3-ఇ, 4-సి, 5-బి
- View Answer
- సమాధానం: ఎ
15. శివాజీ విధించిన పన్నులకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) చౌత్ (1/4) - శివాజీ దాడులు చేయకుండా ఉండటానికి
బి) సర్దేశ్ముఖి (1/10) - ఇతరుల దాడుల నుంచి శివాజీ రక్షించడానికి
సి) ఎ, బి
డి) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: సి
16. అష్ట ప్రధానుల్లో ప్రధానమంత్రిని ఏమని వ్యవహరించారు?
ఎ) అమాత్య
బి) పీష్వా
సి) సుర్నవిష్
డి) సుమంత్
- View Answer
- సమాధానం: బి
17. అష్ట ప్రధానుల్లో యుద్ధ రంగానికి వెళ్లనిది ఎవరు?
ఎ) పండితరావు
బి) న్యాయాదీశ్
సి) ఎ, బి
డి) పైవేవీకాదు
- View Answer
- సమాధానం: సి
18. శివాజీ కాలంలో ప్రధాన నౌకాదళ కేంద్రం ఏది?
ఎ) కళ్యాణ్
బి) కొలాబా
సి) భివాండి
డి) సతార
- View Answer
- సమాధానం: బి
19. శివాజీ వారసుడు, శివాజీ అనంతరం మహారాష్ట్ర రాజ్య పాలకుడైనవారెవరు?
ఎ) శంభాజీ
బి) సాహు
సి) రాజారాం
డి) రెండో శంభాజీ
- View Answer
- సమాధానం: ఎ
20. శంభాజీని వధించి, అతడి కుమారుడిని బంధించిన మొగల్ పాలకుడెవరు?
ఎ) బహదూర్షా
బి) ఔరంగజేబు
సి) ఫరూఖ్ సియర్
డి) షా ఆలం
- View Answer
- సమాధానం:బి
21. ఏ మరాఠా పాలకుడి కాలం నుంచి మహారాష్ట్రలో పీష్వాల ప్రాబల్యం పెరిగింది?
ఎ) రెండో శివాజీ
బి) సాహు
సి) మూడో శివాజీ
డి) మూడో రాజారాం
- View Answer
- సమాధానం: బి
22. శివాజీ ఏ యురోపియన్ దేశస్థుల సాయంతో ‘మలావాన్’ ఓడరేవును నిర్మించాడు?
ఎ) ఆంగ్లేయులు
బి) ఫ్రెంచ్‌వారు
సి) పోర్చుగీసువారు
డి) డచ్‌వారు
- View Answer
- సమాధానం: సి
23. శివాజీ ఆదేశంతో పరిపాలన కోసం ‘పండిట్ హనుమంత్’ రచించిన గ్రంథం ఏది?
ఎ) రాజ్య వ్యవహార కోశం
బి) విజ్ఞానేశ్వరీయం
సి) నీతిశాస్త్రం
డి) నీతిసారం
- View Answer
- సమాధానం: ఎ
24. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) కథి - భూమిని కొలిచే సాధనం
బి) ఫక్ - శివాజీ సైన్యంలో అశ్వికదళం
సి) బర్గీల్ - ప్రభుత్వమే గుర్రాలు, ఆయుధాలు సరఫరా చేసే అధికారి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
25. శివాజీ పట్టాభిషేకానికి హాజరైన ఆంగ్లేయుడు ఎవరు?
ఎ) ఆక్సిండన్
బి) రాల్పిచ్
సి) వాట్సన్
డి) థామస్ రో
- View Answer
- సమాధానం: ఎ
26. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) ఖేద్ యుద్ధం- సాహు, తారాభాయ్
బి) వర్ణా సంధి-సాహు, రెండో శంభాజీ
సి) ఎ, బి
డి) పైవేవీ కాదు
- View Answer
- సమాధానం: సి
27. వర్ణ సంధి ప్రకారం.. రెండో శంభాజీ దక్షిణ మహారాష్ట్రను దేన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు?
ఎ) కొల్హాపూర్
బి) సతార
సి) రాయ్‌గఢ్
డి) డిండి
- View Answer
- సమాధానం: ఎ
28. మరాఠాలు, అహ్మద్‌షా అబ్దాలి మధ్య ఎన్నో పానిపట్టు యుద్ధం జరిగింది?
ఎ) మొదటి
బి) రెండో
సి) మూడో
డి) నాలుగో
- View Answer
- సమాధానం: సి
29. మరాఠా చాణక్యుడిగా పేరు పొందిన నాయకుడు ఎవరు?
ఎ) నారాయణరావు
బి) మాధవరావు
సి) నానా ఫడ్నవీస్
డి) రెండో బాజీరావు
- View Answer
- సమాధానం: సి
30. 1713-1818 మధ్య కాలాన్ని ఏమని పిలుస్తారు?
ఎ) పీష్వా యుగం
బి) మలి మొగల్ యుగం
సి) మత చైతన్య యుగం
డి) కూటమి యుగం
- View Answer
- సమాధానం: ఎ
31. మహారాష్ట్ర కూటమిని ఏర్పాటు చేసిన పీష్వా ఎవరు?
ఎ) మొదటి బాజీరావు
బి) బాలజీ విశ్వనాథ్
సి) రెండో నారాయణరావు
డి) నానా సాహెబ్
- View Answer
- సమాధానం: బి
32. ‘హిందూ పద్ పద్ షాహీ’ ఆశయం కోసం కృషి చేసిన వ్యక్తి ఎవరు?
ఎ) మొదటి బాజీరావు
బి) రెండో బాజీరావు
సి) నారాయణరావు
డి) బాలాజీ బాజీరావు
- View Answer
- సమాధానం: ఎ
33. పీష్వా పదవిని ఎప్పుడు రద్దు చేశారు?
ఎ) 1772
బి) 1818
సి) 1880
డి) 1795
- View Answer
- సమాధానం: బి
34. కింది వాటిలో సరైంది ఏది?
ఎ) మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం: 1775 - 82
బి) రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం: 1803 - 05
సి) మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం: 1817-18
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
35. మహారాష్ర్టుల పతనానికి కారణమైన 3వ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది?
ఎ) 1761 జనవరి 14
బి) 1750 జూన్ 6
సి) 1755 జూలై 17
డి) 1769 ఆగస్టు 27
- View Answer
- సమాధానం: ఎ
36. మహారాష్ట్ర కూటమికి చెందిన వివిధ ప్రాంతాలు, ఆధిపత్య వంశాలను జతపరచండి.
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 1) ఖాందేష్ ఎ) పీష్వా 2) గోండ్వానా బి) భోంస్లే 3) గుజరాత్ సి) గైక్వాడ్ 4) మాళ్వా డి) సింథియా
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
- View Answer
- సమాధానం: ఎ
37. ‘సిక్’ అంటే అర్థమేమిటి?
ఎ) గురువు
బి) శిష్యుడు
సి) మార్గదర్శి
డి) జ్ఞానం
- View Answer
- సమాధానం: బి
38. సిక్కుమతంలో గురువుల సంఖ్య?
ఎ) 10
బి) 9
సి) 7
డి) 5
- View Answer
- సమాధానం: ఎ
39. మొగల్ చక్రవర్తి హుమాయూన్ ఏ సిక్కు గురువును దర్శించాడు?
ఎ) గురునానాక్
బి) గురు అంగద్
సి) గురు రామదాస్
డి) గురు అమర్దాస్
- View Answer
- సమాధానం: బి
40. గురురామదాస్కు పంజాబ్‌లో కొంత భూమిని దానంగా ఇచ్చిన మొగల్ చక్రవర్తి?
ఎ) అక్బర్
బి) జహంగీర్
సి) ఔరంగజేబు
డి) బహదూర్ షా
- View Answer
- సమాధానం: ఎ
41. సిక్కుల 5వ గురువు అర్జున్దేవ్కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) నానక్, మరికొందరి బోధనలను ‘ఆది గ్రంథ్’ (సిక్కుల పవిత్ర గ్రంథం)గా సంకలనం చేశాడు
బి) అమృత్‌సర్‌లో స్వర్ణ దేవాలయం నిర్మించాడు
సి) రాజకీయాల్లో తలదూర్చిన మొదటి సిక్కు గురువు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
42. గురుగోవింద్‌కు బందా (Slave)గా ఉండి, ‘బందా బహదూర్’గా పేరు పొందిన సిక్కు వీరుడు ఎవరు?
ఎ) లక్ష్మణ్‌దాస్
బి) నారాయణ్‌దాస్
సి) హనుమంత్దాస్
డి) రామ్‌దాస్
- View Answer
- సమాధానం: ఎ