పవనాలు
1. సాధారణంగా పవనాలు?
ఎ) అల్పపీడన ప్రాంతంలో వీస్తాయి
బి) అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి వీస్తాయి.
సి) అల్పపీడన ప్రాంతం నుంచి అధిక పీడన ప్రాంతానికి వీస్తాయి.
డి) అధిక పీడన ప్రాంతంలో వీస్తాయి.
- View Answer
- సమాధానం: బి
2.ఏ ప్రాంతంలో కొరియాలిస్ ప్రభావం శూన్యం?
ఎ) ధ్రువాలు
బి) కర్కట రేఖ
సి) భూమధ్య రేఖ
డి) మకర రేఖ
- View Answer
- సమాధానం: సి
3. దక్షిణార్ధ గోళంలో వ్యాపార పవనాలను ఏమని పిలుస్తారు?
ఎ) ఆగ్నేయ వ్యాపార పవనాలు
బి) నైరుతి వ్యాపార పవనాలు
సి) పశ్చిమ పవనాలు
డి) ఈశాన్య వ్యాపార పవనాలు
- View Answer
- సమాధానం: ఎ
4. పశ్చిమ పవనాలకు మరో పేరు?
ఎ) వ్యాపార పవనాలు
బి) ప్రతివ్యాపార పవనాలు
సి) రుతు పవనాలు
డి) స్థానిక పవనాలు
- View Answer
- సమాధానం: బి
5. ‘గర్జించే నలభైలు’ అంటే?
ఎ) ఉత్తరార్ధ గోళంలోని వెచ్చని సముద్ర ప్రవాహాలు
బి) ఉత్తరార్ధ గోళంలో వీచే పశ్చిమ పవనాలు
సి) దక్షిణార్ధగోళంలో వీచే పశ్చిమ పవనాలు
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: సి
6. తూర్పు పవనాలు అని వేటిని పిలుస్తారు?
ఎ) వ్యాపార పవనాలు
బి) భూజల పవనాలు
సి) ధ్రువ పవనాలు
డి) ఈశాన్య రుతుపవనాలు
- View Answer
- సమాధానం: సి
7. భూమి నుంచి సముద్రం వైపు వీచే గాలిని ఏమంటారు?
ఎ) భూపవనాలు
బి) సముద్ర పవనాలు
సి) పశ్చిమ పవనాలు
డి) వ్యాపార పవనాలు
- View Answer
- సమాధానం: ఎ
8. పవన దిశను కనుగొనడానికి ఉపయోగించే పరికరం?
ఎ) బ్యూఫోర్ట్ స్కేలు
బి) పవన సూచి
సి) అనిమోమీటర్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
9. కింది వాటిలో అత్యధిక పవన వేగాన్ని కలిగింది ఏది?
ఎ) లూ
బి) టోర్నడో
సి) టైపూన్
డి) హరికేన్
- View Answer
- సమాధానం: బి
10. మధ్యదరా సముద్ర ప్రాంతంలో వీచే శీతల పవనాలేవి?
ఎ) మిస్ట్రల్, బోరా
బి) ఫోన్, చినూక్
సి) బ్లిజ్జర్డ్స, బెర్గ్స
డి) ప్యూనా, పాంపెరొ
- View Answer
- సమాధానం: ఎ