ప్రపంచ ప్రకృతిసిద్ధ మండలాలు - 1
1. ‘ప్రకృతిసిద్ధ మండలం’గా గుర్తించాలంటే మానవ జీవన విధానంతో కింది వాటిలో ఏ అంశం పోలిక కలిగి ఉండాలి?
1) నైసర్గిక స్థితి
2) సహజ వృక్ష సంపద
3) శీతోష్ణస్థితి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
2. భూగోళం గురించి మానవుడు మొదటిసారిగా దేని ఆధారంగా పరిశీలన చేశాడు?
1) వృక్ష సంపద
2) నేలలు
3) ఉష్ణోగ్రత
4) ప్రజలు
- View Answer
- సమాధానం: 3
3. జాన్ హర్బట్సన్ భూమిని ఎన్ని ప్రకృతిసిద్ధ మండలాలుగా వర్గీకరించాడు?
1) 8
2) 10
3) 11
4) 13
- View Answer
- సమాధానం: 4
4. భూమధ్యరేఖకు ఇరువైపులా 10ని అక్షాంశాల వరకు విస్తరించి ఉన్న ప్రకృతిసిద్ధ మండలం ఏది?
1) భూమధ్యరేఖా మండలం
2) ఆయనరేఖా ఎడారులు
3) రుతుపవన మండలం
4) ఉష్ణమండల పచ్చిక బయళ్లు
- View Answer
- సమాధానం: 1
5. కింది వాటిలో భూమధ్యరేఖా మండలం విస్తరించని ప్రాంతం ఏది?
1) శ్రీలంక
2) వెస్టిండీస్ దీవులు
3) ఫ్రాన్స్
4) బ్రెజిల్
- View Answer
- సమాధానం: 3
6. భూమధ్యరేఖా మండలానికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ఈ మండలంలో రుతువులు ఏర్పడవు
2) ఈ మండలంలో సంవత్సరం పొడవునా అధిక ఉష్ణోగ్రత, వర్షపాతం ఉంటుంది
3) ఈ మండలంలో రాత్రి సమయంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది
4) ఈ మండలాన్ని ‘ప్రశాంత మండలం’ అని పిలుస్తారు
- View Answer
- సమాధానం: 3
7. ‘బోగోర్’ ద్వీపం ఎక్కడ ఉంది?
1) జావా
2) కాంగో
3) బోర్నియా
4) సుమత్రా
- View Answer
- సమాధానం: 1
8.‘కామెరూన్’ పర్వత శిఖరం ఏ ఖండంలో ఉంది?
1) దక్షిణ అమెరికా
2) ఆఫ్రికా
3) ఆసియా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
9. ‘డోల్డ్రమ్స్’ అంటే అర్థం ఏమిటి?
1) తక్కువ ఒత్తిడి క్షేత్రం
2) ఎక్కువ ఒత్తిడి క్షేత్రం
3) అసలు ఒత్తిడి లేని క్షేత్రం
4) సైక్లోనిక్ క్షేత్రం
- View Answer
- సమాధానం:1
10. అమెజాన్ తట్టు (బేసిన్)లో వర్షపు అడవిని ఏ పేరుతో పిలుస్తారు?
1) కంపాలు
2) సెల్వాలు
3) పంపాలు
4) లానోలు
- View Answer
- సమాధానం: 2
11.ప్రపంచంలో అత్యధికంగా కోకో పండించే దేశం ఏది?
1) ఘనా
2) ఐవరీకోస్ట్
3) నైజీరియా
4) బ్రెజిల్
- View Answer
- సమాధానం: 1
12. సమాంగ్ అనే గిరిజన తెగకు చెందిన ప్రజలు కింది ఏ ప్రాంతంలో నివసిస్తారు?
1) అమెజాన్ బేసిన్
2) జైర్ బేసిన్
3) ఇండోనేషియా
4) మలేషియా
- View Answer
- సమాధానం: 4
13. ప్రపంచంలో కెల్లా అత్యంత దట్టమైన అడవులు ఏవి?
1) లయనాలు
2) సెల్వాలు
3) ప్లయాలు
4) స్టెప్పీలు
- View Answer
- సమాధానం: 2
14. భూమధ్యరేఖా మండలంలో అత్యధిక జనసాంద్రత ఉన్న ద్వీపం ఏది?
1) బోగోర్
2) జావా
3) సుమత్రా
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 2
15. కింది వాటిని జతపరచండి.
ప్రాంతాలు తెగలు
ఎ. సుమత్రా 1. వెడ్డాలు
బి. కాంగో 2. పపువాలు
సి. శ్రీలంక 3. కాబూలు
డి. న్యూగినియా 4. పిగ్మీలు
ఎ బి సి డి
1) 1 2 3 4
2) 2 3 4 1
3) 3 4 1 2
4) 4 1 2 3
- View Answer
- సమాధానం:3
16. ప్రపంచానికి రబ్బరును పరిచయం చేసిన ప్రాంతం ఏది?
1) కాంగో నదీ పరీవాహక ప్రాంతం
2) మలేషియా ప్రాంతం
3) అమెజాన్ పరీవాహక ప్రాంతం
4) జైర్ పరీవాహక ప్రాంతం
- View Answer
- సమాధానం:3
17. ‘ఫాజెండాలు’ అంటే ఏమిటి?
1) భూమధ్యరేఖా మండలంలోని దట్టమైన అడవులు
2) ఉష్ణమండల గడ్డి భూములు
3) ఆయనరేఖా ఎడారుల్లో ప్రవహించే నదులు
4) భూమధ్యరేఖా మండలంలోని కాఫీ క్షేత్రాలు
- View Answer
- సమాధానం: 4
18.‘బేతూకర్’ అనే అడవులు ఏ దేశంలో పెరుగుతాయి?
1) ఇండోనేషియా
2) మలేషియా
3) వెస్టిండీస్
4) శ్రీలంక
- View Answer
- సమాధానం: 2
19. ఏ దేశంలో పెరిగే ‘జాపోట్’ వృక్షాల నుంచి ‘చూయింగ్ గమ్’ను తయారు చేస్తారు?
1) దక్షిణ అమెరికా
2) బ్రెజిల్
3) వెస్టిండీస్
4) ఘనా
- View Answer
- సమాధానం: 3
20. ‘ఎర్బామేట్’ పానీయానికి ఉపయోగపడే ‘ఎర్బా’ ఆకులు ఏ దేశంలో లభిస్తాయి?
1) పశ్చిమ ఇండీస్
2) ఐవరీ కోస్ట్
3) మెక్సికో
4) దక్షిణ అమెరికా
- View Answer
- సమాధానం:4
21. ఇండోనేషియాలో చేసే పోడు వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు?
1) జూమ్
2) లడంగ్
3) చీనా
4) మిల్సా
- View Answer
- సమాధానం:2
22. ప్రపంచంలో గంధకాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది?
1) మెక్సికో
2) మలేషియా
3) బ్రూనై
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 1
23. ఖండాల పశ్చిమ భాగంలో భూమధ్యరేఖకు ఇరువైపులా 15° నుంచి 30° వరకు వ్యాపించి ఉన్న ప్రకృతి సిద్ధ మండలం ఏది?
1) భూమధ్యరేఖా మండలం
2) ఉష్ణ మండల ఎడారులు
3) ఉష్ణమండల గడ్డి భూములు
4) రుతుపవన మండలం
- View Answer
- సమాధానం: 2
24. దక్షిణార్ధ గోళంలో పెద్దది, ప్రపంచంలో రెండో పెద్దదైన ఎడారి ఏది?
1) అటకామా
2) కలహారి ఎడారి
3) సోనారన్
4) ఆస్ట్రేలియన్ ఎడారి
- View Answer
- సమాధానం: 4
25. దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్వానా దేశాల్లో విస్తరించి ఉన్న ఎడారి ఏది?
1) అటకామా
2) పెటగోనియా
3) కలహారి
4) సహారా
- View Answer
- సమాధానం: 3
26. ఎడారి ప్రాంతంలో ప్రవహించే నదులను ఏమని పిలుస్తారు?
1) ఎక్సోటిక్ నదులు
2) ప్లయాలు
3) వాడీలు
4) సైమూన్స్
- View Answer
- సమాధానం: 1
27. ‘డార్లింగ్’ నది ఏ ప్రాంతంలో ప్రవహిస్తుంది?
1) ఆఫ్రికా
2) ఆసియా
3) దక్షిణాఫ్రికా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 4
28. కింది వాటిలో ఎక్సోటిక్ నది కానిది ఏది?
1) కొలరాడో
2) సింధు
3) ఆరెంజ్
4) అమెజాన్
- View Answer
- సమాధానం:4
29. ఎడారుల్లో ఏర్పడే తాత్కాలిక సరస్సులను ఏమని పిలుస్తారు?
1) వాడీలు
2) ప్లయాలు
3) రేగ్
4) ఎర్గ్
- View Answer
- సమాధానం: 2
30. ‘సైమూన్స్’ అంటే ఏమిటి?
1) రాతి ఎడారులు
2) ఎడారుల్లో పెరిగే వృక్షాలు
3) తాత్కాలిక వాగులు
4) ఎడారుల్లో ధూళి తుపానులు
- View Answer
- సమాధానం: 4
31.ప్రపంచంలో అధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం ఏది?
1) అజీజియా
2) మృత్యులోయ
3) కామెరూన్
4) జాకోబాబర్
- View Answer
- సమాధానం: 1
32. టైగ్రీస్ నది ఏ దేశంలో ప్రవహిస్తుంది?
1) ఇరాన్
2) ఇరాక్
3) దక్షిణాఫ్రికా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 2
33. మెక్సికో, కాలిఫోర్నియా, అరిజోనా రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఎడారి ఏది?
1) అటకామా
2) కలహారి
3) పెటగోనియా
4) సోనారన్
- View Answer
- సమాధానం: 4
34. కింది వాటిలో సరికాని జత ఏది?
1) సింధు - ఆసియా
2) నైలు - ఆఫ్రికా
3) యూప్రటిస్ - ఇరాక్
4) కొలరాడో - దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 4
35. రాతి ఎడారులను ఏమని పిలుస్తారు?
1) ఎర్గ్
2) హమడా
3) వాడీలు
4) ప్లయాలు
- View Answer
- సమాధానం: 2
36. ‘ఆశ్వాన్ డ్యామ్’ను ఏ నదిపై నిర్మించారు?
1) సింధు
2) కొలరాడో
3) నైలు
4) అమెజాన్
- View Answer
- సమాధానం: 3
37. కింది వాటిలో ‘గ్జీరోఫైటిక్’ లక్షణం కలిగి ఉండే వృక్షం ఏది?
1) మహాగని
2) టేకు
3) సుందరి
4) నాగజెముడు
- View Answer
- సమాధానం:4
38. కింది వాటిలో అత్యంత అనాగరికమైన తెగగా దేన్ని పేర్కొంటారు?
1) బుష్మెన్లు
2) బిడౌనియన్లు
3) బిండిబాలు
4) ఫల్లాహిన్లు
- View Answer
- సమాధానం: 1
39. కింది వాటిలో సరికాని జత ఏది?
1) కలహారి - బుష్మెన్లు
2) సహారా - ఫల్లాహిన్లు
3) ఆస్ట్రేలియా - టౌరెన్లు
4) అరేబియా - బిడౌనియన్లు
- View Answer
- సమాధానం: 3
40. పెరూ తీర ప్రాంతంలో లభించే పక్షి రెట్టను ఏమని పిలుస్తారు?
1) రూకరీలు
2) గుయానో
3) కనాట్లు
4) డింగో
- View Answer
- సమాధానం: 2
41. ప్రపంచంలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం ఉన్న ప్రదేశం ఏది?
1) కిర్కుక్
2) కైరో
3) మక్కా
4) అబదాన్
- View Answer
- సమాధానం: 4
42. కాల్గూర్లీ, కూల్గార్డీ గనులు దేనికి ప్రసిద్ధి చెందాయి?
1) నైట్రేట్లు
2) చమురు
3) బంగారం
4) రాగి
- View Answer
- సమాధానం: 3
43. ప్రపంచంలో పొడుగు పింజ పత్తి ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
1) ఆస్ట్రేలియా
2) భారతదేశం
3) దక్షిణాఫ్రికా
4) ఈజిప్టు
- View Answer
- సమాధానం: 4
44. ‘సూయజ్ కాలువ తాళపు చెవి’గా ఏ నగరాన్ని పేర్కొంటారు?
1) కైరో
2) ఎడిన్
3) అబదాన్
4) అలెగ్జాండ్రియా
- View Answer
- సమాధానం: 2
45. దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల గడ్డిభూములను ఏమని పిలుస్తారు?
1) సవన్నాలు
2) కంపాలు
3) పంపాలు
4) లానోలు
- View Answer
- సమాధానం: 2
46. వెనిజులా, అర్జెంటీనా మధ్య ఉన్న ఆకు రాల్చే అడవి ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?
1) లానోలు
2) సవన్నాలు
3) గ్రీన్ చాకో
4) వెల్డులు
- View Answer
- సమాధానం: 3
47. ఒరినాకో నదీ పరీవాహక ప్రాంతంలో విస్తరించి ఉన్న ఉష్ణ మండల గడ్డి భూములేవి?
1) లానోలు
2) కంపాలు
3) సవన్నాలు
4) ప్రయరీలు
- View Answer
- సమాధానం: 1
48. ‘సవన్నా’ గడ్డి భూములు ఎక్కడ విస్తరించి ఉన్నాయి?
1) ఉత్తర అమెరికా
2) దక్షిణ అమెరికా
3) ఆఫ్రికా
4) ఆస్ట్రేలియా
- View Answer
- సమాధానం: 3
49. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదైన ‘వయలిలీ’ శిఖరం ఎక్కడ ఉంది?
1) కామోరూన్
2) కౌవాయి
3) బోగోర్
4) క్యూబా
- View Answer
- సమాధానం: 2
50. ‘ఏనుగు గడ్డి’ ప్రధానంగా ఎక్కడ పెరుగుతుంది?
1) ఉత్తర అమెరికా
2) ఆస్ట్రేలియా
3) ఆఫ్రికా
4) దక్షిణ అమెరికా
- View Answer
- సమాధానం: 3
51.‘క్వెబ్రాషో’ వృక్షాల నుంచి తీసే ‘టానిన్’ను ఏ పరిశ్రమలో ఉపయోగిస్తారు?
1) పట్టు పరిశ్రమ
2) అల్యూమినియం పరిశ్రమ
3) ఇనుము-ఉక్కు పరిశ్రమ
4) తోళ్ల పరిశ్రమ
- View Answer
- సమాధానం: 4
52. కింది వాటిలో సరికానిది ఏది?
1) పశ్చిమ ఆఫ్రికా - హౌసా
2) కెన్యా - కాసోవారి
3) తూర్పు ఆఫ్రికా - మసాయి
4) వెనిజులా - లానెరో
- View Answer
- సమాధానం: 2
53. ‘కటంగా’ ఏ నిల్వలకు ప్రసిద్ధి?
1) బాక్సైట్
2) పెట్రోలియం
3) రాగి
4) ఇనుము
- View Answer
- సమాధానం: 3
54. ఏ గడ్డి భూములను ‘పార్కలాండ్స్’ (ఉద్యానవన భూములు) అని పిలుస్తారు?
1) సవన్నాలు
2) లానోలు
3) ప్రయరీలు
4) పంపాలు
- View Answer
- సమాధానం: 1
55. ‘విక్టోరియా’ జలపాతం ఏ నదిపై ఉంది?
1) జైరే
2) జాంబేజీ
3) అమెజాన్
4) ఆరెంజ్
- View Answer
- సమాధానం:2