మానవ భూగోళ శాస్త్రం - ఖండాలు
1. యూరప్ ఖండంలోని ప్రజలు ఏ జాతికి చెందినవారు?
1) నీగ్రోయిడ్స్
2) మంగోలాయిడ్స్
3) కాకసాయిడ్
4) ప్రోటో ఆస్ట్రలాయిడ్స్
- View Answer
- సమాధానం: 3
2. ప్రపంచంలో మొట్టమొదటగా ఆవిర్భవించిన మానవ జాతి ఏది?
1) మధ్యధరా జాతి
2) మంగోలాయిడ్స్
3) ప్రోటో ఆస్ట్రలాయిడ్స్
4) నీగ్రోయిడ్స్
- View Answer
- సమాధానం: 4
3. ద్వీపకల్ప భారతదేశంలోని ప్రజలు ఏ జాతికి చెందినవారు?
1) నీగ్రోయిడ్స్
2) ప్రోటో ఆస్ట్రలాయిడ్స్
3) మంగోలాయిడ్స్
4) కాకసాయిడ్
- View Answer
- సమాధానం: 2
4. ఆఫ్రికా ఖండంలోని అధిక శాతం జనాభా ఏ జాతికి చెందింది?
1) కాకసాయిడ్
2) నీగ్రోయిడ్స్
3) ప్రోటో ఆస్ట్రలాయిడ్స్
4) మంగోలాయిడ్స్
- View Answer
- సమాధానం: 2
5. కింది వాటిలో సరికాని జత ఏది?
1) మలేషియా - సకాయి
2) సుమత్రా - కాబూలు
3) సహారా ఎడారి - బిడౌనియన్లు
4) న్యూ గినియా - పపువా
- View Answer
- సమాధానం: 3
6. ప్రపంచంలో 99 శాతం భూభాగం ఎడారిమయమైన దేశం ఏది?
1) లిబియా
2) ఈజిప్టు
3) కెన్యా
4) న్యూ గినియా
- View Answer
- సమాధానం: 1
7. ఏ దేశ ప్రజలను ‘కివీస్’ అని పిలుస్తారు?
1) ఆస్ట్రేలియా
2) దక్షిణాఫ్రికా
3) న్యూజిలాండ్
4) బోర్నియా
- View Answer
- సమాధానం: 3
8. ప్రపంచంలో అత్యంత ఉత్తరాన ఉన్న తెగ ఏది?
1) అబోరిజనులు
2) కోసక్లు
3) లాపులు
4) యాకూత్లు
- View Answer
- సమాధానం: 4
9. కింది వాటిలో సరికాని జత ఏది?
1) కలహారి ఎడారి - హటెన్టాట్స్
2) కాంగో పరీవాహక ప్రాంతం - పిగ్మీలు
3) కెన్యా - మసాయి
4) ఆస్ట్రేలియా - బిండిబాలు
- View Answer
- సమాధానం:3
10. ‘పర్వతాలకు పుట్టినిల్లు’గా ఏ ఖండాన్ని పేర్కొంటారు?
1) యూరప్
2) దక్షిణ అమెరికా
3) ఆసియా
4) ఆఫ్రికా
- View Answer
- సమాధానం: 3
11. ప్రపంచంలో అతి ఎక్కువ తీర రేఖ ఉన్న దేశం ఏది?
1) జోర్డాన్
2) కెనడా
3) శ్రీలంక
4) మలేసియా
- View Answer
- సమాధానం: 2
12. ప్రపంచంలో మొదటిసారిగా అముదార్య, సిరిదార్య అనే నదులను అనుసంధానం చేశారు. ఇవి ఏ దేశంలో జన్మిస్తాయి?
1) ఇరాన్
2) ఇరాక్
3) చైనా
4) కజకిస్తాన్
- View Answer
- సమాధానం: 4
13. లీనా నది ఎక్కడ జన్మిస్తుంది?
1) అరల్ సముద్రం
2) బైకాల్ సరస్సు
3) మృత సముద్రం
4) టర్నూల్ సరస్సు
- View Answer
- సమాధానం: 2
14. కింది వాటిలో సరికాని జత ఏది?
1) హిమాలయాల రాజ్యం - నేపాల్
2) చైనా దుఃఖదాయని - హోయాంగ్ హో నది
3) పసుపు నది - సికియాంగ్ నది
4) బ్లూ రివర్ - యాంగ్ ట్సికియాంగ్
- View Answer
- సమాధానం: 3
15. తక్లమకాన్ అనేది ఒక..
1) నది
2) సరస్సు
3) పర్వతం
4) ఎడారి
- View Answer
- సమాధానం:4
16.ఆఫ్రికా నుంచి ఆసియాను వేరు చేసే సముద్రం ఏది?
1) ఎర్ర సముద్రం
2) పసుపు సముద్రం
3) మధ్యదరా సముద్రం
4) నల్ల సముద్రం
- View Answer
- సమాధానం: 1
17. కింది వాటిలో ఏ జలసంధి మలయా ద్వీపకల్పాన్ని సుమత్రా దీవుల నుంచి వేరు చేస్తుంది?
1) బేరింగ్
2) ఫార్మోసా
3) మలక్కా
4) బాస్పరస్
- View Answer
- సమాధానం: 3
18. ప్రపంచంలో అతి పొడవైన జలసంధి ఏది?
1) బాస్పరస్
2) టాటార్
3) హర్మోజ్
4) ఫార్మోసా
- View Answer
- సమాధానం:2
19. ఇండోనేషియాలోని పోడు వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు?
1) కురువా
2) మిల్సా
3) చినా
4) లడంగ్
- View Answer
- సమాధానం: 4
20. సూయజ్ కాలువ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది?
1) నల్ల సముద్రం - ఎర్ర సముద్రం
2) ఎర్ర సముద్రం - కాస్పియన్ సముద్రం
3) మధ్యదరా సముద్రం - కాస్పియన్ సముద్రం
4) ఎర్ర సముద్రం - మధ్యదరా సముద్రం
- View Answer
- సమాధానం: 4
21. ‘పీఠభూముల ఖండం’గా ఏ ఖండాన్ని పేర్కొంటారు?
1) ఆసియా
2) ఆఫ్రికా
3) దక్షిణ అమెరికా
4) యూరప్
- View Answer
- సమాధానం:2
22. కింది వాటిలో డ్రాకెన్స్ బర్గ్ పర్వతాల్లో జన్మించే నది ఏది?
1) జాంబెజీ
2) కాంగో
3) నైలు
4) లింపోపో
- View Answer
- సమాధానం: 4
23. ‘ఆశ్వాన్’ ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు?
1) ఆరెంజ్
2) కాంగో
3) నైలు
4) నైగర్
- View Answer
- సమాధానం: 3
24. ‘మధ్యదరా సముద్రపు తాళపు చెవి’గా ఏ జలసంధిని పేర్కొంటారు?
1) జిబ్రాల్టర్ జలసంధి
2) బేరింగ్ జలసంధి
3) బాబ్ - ఎల్ మాండబ్ జలసంధి
4) బాస్పరస్ జలసంధి
- View Answer
- సమాధానం: 1
25.కింది వాటిలో ఏ ఖండాన్ని 90ని తూర్పు రేఖాంశం రెండుగా విభజిస్తుంది?
1) ఉత్తర అమెరికా
2) దక్షిణ అమెరికా
3) ఆఫ్రికా
4) ఆసియా
- View Answer
- సమాధానం: 4
26. కింది వాటిలో సరికాని జత ఏది?
1) ఆల్టామ్ పర్వతాలు - రష్యా
2) టియాన్షాన్ - చైనా
3) హిందూకుష్ - అఫ్గానిస్తాన్
4) యాబ్లోనోలి - వియత్నాం
- View Answer
- సమాధానం: 4
27. ఆసియాలో టైగాలకు దక్షిణంగా ఉండే గడ్డి భూములను ఏమని పిలుస్తారు?
1) లానోలు
2) స్టెప్పీలు
3) సవన్నాలు
4) డౌనులు
- View Answer
- సమాధానం: 2
28. సూయజ్ కాలువ తవ్వడం వల్ల భారత్, బ్రిటన్ దేశాల మధ్య ఎంత దూరం తగ్గింది?
1) 5,600 కి.మీ.
2) 6000 కి.మీ.
3) 6,500 కి.మీ.
4) 6,600 కి.మీ.
- View Answer
- సమాధానం:3
29. పాక్లాండ్ దీవులు ఏ సముద్రంలోని ద్వీప సమూహంలో ఉన్నాయి? (A.S.W.O. - 2012)
1) దక్షిణ పసిఫిక్ సముద్రం
2) ఉత్తర పసిఫిక్ సముద్రం
3) దక్షిణ అట్లాంటిక్ సముద్రం
4) ఉత్తర అట్లాంటిక్ సముద్రం
- View Answer
- సమాధానం: 3
30. ‘పచ్చల ద్వీపం’ (ఎమరాల్డ్ ఐలాండ్) అని పేరు పొందిన ప్రదేశం ఏది?(Group-I, 2012)
1) బ్రిటన్
2) టాస్మానియా
3) ఐర్లాండ్
4) సిసిలీ
- View Answer
- సమాధానం: 3
31. ‘కారాకుమ్’ ఎడారి ఎక్కడ ఉంది? (Group-I, 2012)
1) మంగోలియా
2) చైనా
3) ఉజ్బెకిస్తాన్
4) తుర్క్ మెనిస్తాన్
- View Answer
- సమాధానం: 4
32.ఆసియాలో అతి పొడవైన నది ఏది? (Group-I, 2012)
1) పసుపుపచ్చ నది (హోయాంగ్ హో)
2) బ్రహ్మపుత్ర
3) గంగ
4) యాంగ్ట్జి
- View Answer
- సమాధానం: 4
33. టైగ్రిస్ నది ప్రధానంగా ఎక్కడ ప్రవహిస్తుంది? (Group-I, 2012)
1) టెంబక్టూ
2) ఇరాక్
3) ఇరాన్
4) టాంగాన్వికా
- View Answer
- సమాధానం: 2
34. ‘దస్ట్-ఎ-కవీర్’ అనేది ఒక..(Group-I, 2012)
1) ఇరాన్లో ఎడారి
2) ఇరాక్‌లో ఎడారి
3) ఇరాన్లో నది
4) ఇరాక్‌లో నది
- View Answer
- సమాధానం: 1
35. టైగ్రిస్, యూఫ్రటిస్ నదుల కలయికతో ఏర్పడిన నది ఏది? (DL, 2012)
1) షెబలీ నది
2) షట్ట్-ఆల్- అరబ్
3) వైల్
4) అముర్ నది
- View Answer
- సమాధానం: 2
36.‘లాండ్ ఆఫ్ మోర్నింగ్ కామ్’ అని ఏ దేశాన్ని పిలుస్తారు? (A.P. port officer, 2011)
1) కొరియా
2) జపాన్
3) కెనడా
4) జర్మనీ
- View Answer
- సమాధానం: 1
37. కాంబోడియా దేశాన్ని పూర్వం ఏ పేరుతో పిలిచేవారు? (A.P. port officer, 2011)
1) కాంపూచియా
2) కెనడా
3) కౌలాలంపూర్
4) దక్షిణాఫ్రికా
- View Answer
- సమాధానం: 1
38. కింది వాటిలో భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న నగరం ఏది? (FROs - 2012)
1) కొలంబో
2) జకార్తా
3) మనీలా
4) సింగపూర్
- View Answer
- సమాధానం: 4
39.కింద పేర్కొన్న ఏ ఖండంలో అట్లాసు పర్వతాలు ఉన్నాయి? (Group-I, 2003)
1) ఆసియా
2) ఆఫ్రికా
3) ఆస్ట్రేలియా
4) ఐరోపా
- View Answer
- సమాధానం: 2
|