దేశంలో రోగులకు ఔషధాలను సరఫరా చేయడానికి ప్రవేశపెట్టిన రైలు ఏది?
1. భారతదేశానికి మొదటిసారిగా వలస వచ్చిన జాతుల్లో కింది వాటిలో ఎవరిని పేర్కొంటున్నారు?
1) నీగ్రిటాయిడ్స్
2) మెడిటరేనియన్స్
3) ప్రొటోస్ట్రలాయిడ్స్
4) మంగోలాయిడ్స్
- View Answer
- సమాధానం: 1
2. శాంటినలీస్, ఓంజస్, జార్వాస్ అనే తెగలకు చెందిన ప్రజలు దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నారు?
1) అండమాన్ దీవులు
2) లక్షదీవులు
3) మన్నార్ సింధు శాఖ
4) ఈశాన్య ప్రాంతాలు
- View Answer
- సమాధానం: 1
3. దేశంలో రోగులకు ఔషధాలను సరఫరా చేయడానికి ప్రవేశపెట్టిన రైలు ఏది?
1) రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్
2) ధన్వంతరి
3) సైన్స్ ఎక్స్‌ప్రెస్
4) హాస్పిటల్ ఆన్ రైల్వే వీల్స్
- View Answer
- సమాధానం: 2
4.కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
1) 1
2) 2
3) 3
4) 4
- View Answer
- సమాధానం: 2
5.కింది వాటిలో సరికానిది ఏది?
1) వెండి విప్లవం - గుడ్ల ఉత్పత్తి
2) పసుపు విప్లవం-నూనె గింజల ఉత్పత్తి
3) నారింజ విప్లవం- ఉద్యానవన పంటల ఉత్పత్తి
4) గుండ్రటి విప్లవం - మాంసం ఉత్పత్తి
- View Answer
- సమాధానం: 4
6. ప్రపంచంలో జనుము ఉత్పత్తిలో ప్రథమస్థానంలో ఉన్న దేశం ఏది?
1) బంగ్లాదేశ్
2) భారత్
3) పాకిస్తాన్
4) చైనా
- View Answer
- సమాధానం: 2
7. ప్రపంచంలో పాలు, పాల ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది?
1) డెన్మార్క్
2) నార్వే
3) చైనా
4) భారత్
- View Answer
- సమాధానం: 4
8. కింది వాటిలో దేన్ని ‘పేదవారి ఆవు’గా పేర్కొంటారు?
1) గొర్రె
2) మేక
3) బర్రె
4) ఆవు
- View Answer
- సమాధానం: 2
9. ‘రూర్ ఆఫ్ ఇండియా’ అని కింది వాటిలో దేన్ని పిలుస్తారు?
1) కోడెర్మా
2) రాంచీ
3) హజీరాబాగ్
4) చోటా నాగ్‌పూర్
- View Answer
- సమాధానం: 4
10. దేశంలో ఖనిజ నిల్వల విషయంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1) ఛత్తీస్‌గఢ్
2) ఒడిశా
3) మధ్యప్రదేశ్
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 4
11. భారత భూభాగంలో లభ్యమయ్యే ఇనుప ధాతువు ఎక్కువగా ఏ రకానికి చెందింది?
1) హెమటైట్
2) మాగ్నటైట్
3) లియొనైట్
4) సెడరైట్
- View Answer
- సమాధానం: 1
12. ‘కుద్రేముఖ్’ ఇనుప గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) ఛత్తీస్‌గఢ్
2) జార్ఖండ్
3) కర్ణాటక
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 3
13. దేశంలో బాక్సైట్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) ఒడిశా
3) కర్ణాటక
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
14. దేశంలో గోండ్వానా బొగ్గు నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతం ఏది?
1) మహానది లోయ ప్రాంతం
2) దామోదర్ నదీ లోయ ప్రాంతం
3) సోన్ నదీ లోయ ప్రాంతం
4) గోదావరి నదీ లోయ ప్రాంతం
- View Answer
- సమాధానం: 2
15.దేశంలో ఏ రకమైన బొగ్గు అధికంగా లభ్యమవుతుంది?
1) ఆంథ్రసైట్
2) బిట్యూమినస్
3) లిగ్నైట్
4) పీట్
- View Answer
- సమాధానం: 2
16. ‘అంకళేశ్వర్’ ముడి చమురు బావి ఏ రాష్ట్ర భూభాగంలో ఉంది?
1) మహారాష్ట్ర
2) అసోం
3) గుజరాత్
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 3
17. ప్రపంచంలో ‘మైకా’ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది?
1) రష్యా
2) చైనా
3) భారత్
4) బ్రెజిల్
- View Answer
- సమాధానం: 3
18. ఒడిశాలోని ‘సుకిండా’ ఏ ఖనిజ నిల్వలకు ప్రసిద్ధి?
1) క్రోమైట్
2) బాక్సైట్
3) కాపర్
4) ఆస్బెస్టాస్
- View Answer
- సమాధానం: 1
19.జార్ఖండ్‌లోని ‘కోడెర్మా’ దేనికి ప్రసిద్ధి?
1) ఆస్బెస్టాస్
2) బెరైటీస్
3) మైకా
4) బాక్సైట్
- View Answer
- సమాధానం: 3
20. ముంబయి నగరం.. నూలు వస్త్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా ఉండటానికి కింది వాటిలో దోహదపడిన అంశం ఏది?
1) తేమతో కూడిన వాతావరణం
2) ముంబయి పరిసర ప్రాంతాల్లో పత్తి పండే నల్ల రేగడి భూములు అధికంగా ఉండటం
3) ఓడరేవు సౌకర్యాలు, తక్కువ వేతనాల్లో లభ్యమయ్యే కార్మికులు ఉండటం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
21. ‘దక్షిణ భారతదేశ మాంచెస్టర్’గా ఏ నగరాన్ని పేర్కొంటారు?
1) విశాఖపట్నం
2) తంజావూర్
3) కోయంబత్తూర్
4) తిరువనంతపురం
- View Answer
- సమాధానం: 3
22. 2011 జనాభా గణాంకాల ప్రకారం దేశంలో మిలియన్ జనాభా ఉన్న నగరాల సంఖ్య ఎంత?
1) 35
2) 53
3) 6
4) 8
- View Answer
- సమాధానం: 2
23.దేశంలో థార్ ఎడారి ద్వారా వెళ్లే జాతీయ రహదారి ఏది?
1) ఎన్‌హెచ్-17
2) ఎన్‌హెచ్-15
3) ఎన్‌హెచ్-8
4) ఎన్‌హెచ్-3
- View Answer
- సమాధానం: 2
24. దేశంలో రైల్వే ఎలక్ట్రిక్ ఇంజన్లను తయారు చేసే యూనిట్ ఎక్కడ ఉంది?
1) తిరుచినాపల్లి
2) హరిద్వార్
3) జగదీష్పూర్
4) భోపాల్
- View Answer
- సమాధానం: 4
25. కింది వాటిలో హిందూస్తాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ కర్మాగారం లేని ప్రదేశం ఏది?
1) నాసిక్
2) భోపాల్
3) కోరాపుట్
4) లక్నో
- View Answer
- సమాధానం: 2
26. కింది వాటిలో INDALCO (ఇండియన్ అల్యూమినియం కంపెనీ)ఆధ్వర్యంలో లేని అల్యూమినియం ప్రగలన యూనిట్ ఏది?
1) బెల్గాం
2) ఆల్వే
3) హీరాకుడ్
4) కోర్బా
- View Answer
- సమాధానం: 4
27. దేశంలో ‘యాంటీ బయాటిక్ డ్రగ్స్’ను తయారు చేసే IDPL (ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్) యూనిట్ ఎక్కడ ఉంది?
1) ముజఫర్ పూర్
2) గుర్గావ్
3) రిషికేష్
4) చెన్నై
- View Answer
- సమాధానం: బి