భారతదేశం - మృత్తికలు (Soils)
1. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ (ICAR) ఎక్కడ ఉంది?
1) నాగ్పూర్
2) కటక్
3) న్యూఢిల్లీ
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
2. మృత్తికల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు?
1) పెడోజెనెసిస్
2) పెడాలజీ
3) పాథాలజీ
4) లిమ్నాలజీ
- View Answer
- సమాధానం: 2
3.భారతదేశంలోని మృత్తికలను ICAR ఎన్ని భాగాలుగా విభజించింది?
1) 8
2) 9
3) 10
4) 11
- View Answer
- సమాధానం:1
4. కింది వాటిలో నదీ నిక్షేపాల కారణంగా ఏర్పడిన నేలలేవి?
1) ఎర్ర నేలలు
2) ఒండ్రుమట్టి నేలలు
3) క్షార నేలలు
4) జేగురు నేలలు
- View Answer
- సమాధానం: 2
5. ఒండ్రు మృత్తికలకు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) ఈ మృత్తికలు అధిక సారవంతమైనవి
2) వీటిలో నత్రజని, జీవ సంబంధ పదార్థాలు తక్కువ మోతాదులో ఉంటాయి
3) ఇవి ప్రపంచంలో పురాతన సాంస్కృతిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి
4) ఈ మృత్తికల్లో సున్నం, పొటాష్, భాస్వరం లోపించి ఉంటాయి
- View Answer
- సమాధానం: 4
6. ‘భారతదేశ ధాన్యాగారాలు’గా ఏ మృత్తికలను పేర్కొంటారు?
1) నల్లరేగడి
2) ఎర్ర మృత్తికలు
3) ఒండ్రు
4) జేగురు
- View Answer
- సమాధానం: 3
7. శివాలిక్ పాదాల వద్ద హిమాలయ నదులతో విసనకర్ర ఆకారంలో నిక్షేపితమైన గులకరాళ్ల క్షేత్రాన్ని ఏమని పిలుస్తారు?
1) టెరాయి
2) బాబర్
3) భంగర్
4) ఖాదర్
- View Answer
- సమాధానం:2
8.‘రేగర్’ నేలలు అని వేటిని పిలుస్తారు?
1) ఒండ్రు నేలలు
2) పీఠి నేలలు
3) ఎడారి నేలలు
4) నల్లరేగడి నేలలు
- View Answer
- సమాధానం: 4
9. నదీ లోయల సమీపంలో ఉండే నూతన సారవంతమైన నేలలను ఏమంటారు?
1) ఖాదర్
2) భంగర్
3) బాబర్
4) టెరాయి
- View Answer
- సమాధానం:1
10. నల్లరేగడి నేలల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది?
1) డెహ్రాడూన్
2) నాగ్పూర్
3) బళ్లారి
4) పసద్
- View Answer
- సమాధానం: 3
11. హిమాలయ నదులు తీసుకువచ్చిన బంకమట్టితో ఏర్పడిన నేలలను ఏమంటారు?
1) బాబర్
2) టెరాయి
3) భంగర్
4) ఖాదర్
- View Answer
- సమాధానం: 2
12.నదీ లోయలకు దూరంగా ఉండే ప్రాచీన ఒండలి నేలలను ఏమంటారు?
1) ఖాదర్
2) భంగర్
3) కంకర్
4) ఉషర్
- View Answer
- సమాధానం: 2
13. పంజాబ్లో సోడియం పొరతో కూడిన నిస్సారమైన ఒండ్రుమట్టి నేలలను ఏమని పిలుస్తారు?
1) కంకర్
2) రేగర్
3) భంగర్
4) ఉషర్
- View Answer
- సమాధానం: 4
14. కింది వాటిలో బసాల్ట్ శిలల శైథిల్యం వల్ల ఏర్పడే నేలలేవి?
1) ఒండ్రు నేలలు
2) ఎర్ర నేలలు
3) నల్లరేగడి నేలలు
4) పర్వతీయ నేలలు
- View Answer
- సమాధానం: 3
15. ఊబి నేలలు ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి?
1) పంజాబ్
2) ఉత్తరప్రదేశ్
3) తమిళనాడు
4) కేరళ
- View Answer
- సమాధానం: 4
16. కింది వాటిలో ఏ నేలలు ‘గాలి పారేటట్లు’గా ఉంటాయి?
1) నల్లరేగడి నేలలు
2) ఎర్ర నేలలు
3) ఒండ్రు నేలలు
4) జేగురు నేలలు
- View Answer
- సమాధానం: 2
17. అధిక ఉష్ణోగ్రత, అత్యధిక వర్షపాతం ఉన్న ఎత్తై ప్రాంతాల్లో విస్తరించి ఉన్న నేలలేవి?
1) లేటరైట్ నేలలు
2) పర్వతీయ నేలలు
3) ఒండ్రుమట్టి నేలలు
4) క్షార నేలలు
- View Answer
- సమాధానం: 1
18. భారతదేశంలోని ఏ నేలలను అమెరికాలోని అరిజోనా ప్రాంతంలో ఉన్న మృత్తికలతో పోలుస్తారు?
1) ఎర్ర మృత్తికలు
2) జేగురు మృత్తికలు
3) నల్లరేగడి మృత్తికలు
4) పీఠి మృత్తికలు
- View Answer
- సమాధానం: 3
19. కింది వాటిలో ఏ మృత్తికల్లో ‘హ్యూమస్’ అధికంగా ఉంటుంది?
1) ఒండ్రు మృత్తికలు
2) నల్లరేగడి మృత్తికలు
3) ఎర్ర మృత్తికలు
4) పర్వతీయ (అటవీ) మృత్తికలు
- View Answer
- సమాధానం: 4
20. ఎర్ర మృత్తికలకు ఆ రంగు రావడానికి కారణం ఏది?
1) కాల్షియం కార్బొనేట్లు
2) ఫై ఆక్సైడ్
3) మెగ్నీషియం ఆక్సైడ్
4) అల్యూమినియం ఆక్సైడ్
- View Answer
- సమాధానం: 2
21. భారతదేశంలోని ఏ నేలలను ‘ఉష్ణమండల చెర్నోజెమ్’ నేలలు అని పిలుస్తారు?
1) ఎర్ర నేలలు
2) నల్లరేగడి నేలలు
3) అటవీ నేలలు
4) క్షార నేలలు
- View Answer
- సమాధానం: 2
22. నల్లరేగడి ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
1) అసోం
2) బిహార్
3) పంజాబ్
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 4
23. కింది వాటిలో చెర్నోజెమ్ రేగడి భూములు ఉన్న ప్రాంతం ఏది?
1) ఈజిప్టు
2) గంగా తీరం
3) ఉక్రెయిన్
4) అమెజాన్ తీరం
- View Answer
- సమాధానం: 3
24. కేరళలోని ‘అలెప్పీ’, ‘కొట్టాయం’ జిల్లాల్లో విస్తరించి ఉన్న నేలలేవి?
1) ఒండ్రు నేలలు
2) పర్వతీయ నేలలు
3) క్షార నేలలు
4) పీఠి నేలలు
- View Answer
- సమాధానం:4
25.‘బ్లాక్ కాటన్ సాయిల్స్’ అని ఏ నేలలను పిలుస్తారు?
1) క్షార నేలలు
2) పర్వతీయ నేలలు
3) నల్లరేగడి నేలలు
4) ఒండ్రు నేలలు
- View Answer
- సమాధానం: 3
26. కింది వాటిలో ‘ఫాస్ఫేట్లు’ అధికంగా విస్తరించి ఉన్న నేలలేవి?
1) ఎడారి నేలలు
2) పీఠి నేలలు
3) క్షార నేలలు
4) నల్లరేగడి నేలలు
- View Answer
- సమాధానం: 1
27.పంజాబ్ నుంచి అసోం వరకు విస్తరించి ఉన్న ఇండో-గంగా మైదానంలో ఏ రకమైన నేలలున్నాయి?
1) బ్లాక్ నేలలు
2) రెడ్ నేలలు
3) లాటరైట్ నేలలు
4) అల్యూవియల్ నేలలు
- View Answer
- సమాధానం: 4
28. కింది వాటిలో తడిగా ఉన్నప్పుడు పొంగి, పొడిగా ఉన్నప్పుడు పగుళ్లు ఏర్పడే భూమి ఏది?
1) ఒండలి భూమి
2) లాటరైట్ భూమి
3) నల్లరేగడి భూమి
4) ఎర్ర భూమి
- View Answer
- సమాధానం: 3
29. కింది వాటిలో ‘పోడ్జాల్’ నేల రకానికి చెందిన మృత్తికలేవి?
1) నల్లరేగడి మృత్తికలు
2) పర్వతీయ మృత్తికలు
3) ఒండ్రు మృత్తికలు
4) లాటరైట్ మృత్తికలు
- View Answer
- సమాధానం: 2
30.నల్లరేగడి భూములు ఏ పంట సాగుకు అధికంగా ఉపయోగపడతాయి?
1) పత్తి
2) గోధుమ
3) వరి
4) జనపనార
- View Answer
- సమాధానం: 1
31. గ్రానైట్, నీస్ శిలల శైథిల్యం వల్ల ఏర్పడే మృత్తికలేవి?
1) నల్లరేగడి మృత్తికలు
2) ఎర్ర మృత్తికలు
3) క్షార మృత్తికలు
4) పర్వతీయ మృత్తికలు
- View Answer
- సమాధానం: 2
32.‘తమని తాము దున్నుకునే’ నేలలుగా వేటిని పేర్కొంటారు?
1) ఒండ్రు నేలలు
2) ఎడారి నేలలు
3) నల్లరేగడి నేలలు
4) క్షార నేలలు
- View Answer
- సమాధానం: 3
33. నల్లరేగడి నేలలకు సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) వీటిలో ఇనుము, మెగ్నీషియం ఆక్సైడ్ అధికంగా ఉంటాయి
2) వీటికి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం అధికంగా ఉంటుంది
3) ఇవి అనార్ద్ర వ్యవసాయానికి అనుకూలం
4) ఇవి నత్రజని, సేంద్రియ పదార్థాలను అధికంగా కలిగి ఉంటాయి
- View Answer
- సమాధానం: 4
34.పట క్రమక్షయం కొనసాగడం వల్ల చేతి వేళ్ల ఆకారంలో గాడులు ఏర్పడడాన్ని ఏమని పిలుస్తారు?
1) రిపారియన్ క్రమక్షయం
2) పట క్రమక్షయం
3) వంక క్రమక్షయం
4) అవనాళిక క్రమక్షయం
- View Answer
- సమాధానం: 3
35. నదుల గట్లు కొట్టుకుపోవడాన్ని ఏమంటారు?
1) తరంగ క్రమక్షయం
2) రిపారియన్ క్రమక్షయం
3) వంక క్రమక్షయం
4) పట క్రమక్షయం
- View Answer
- సమాధానం: 2
36. పశ్చిమబెంగాల్లో రిపారియన్ క్రమక్షయం ఏర్పడటానికి మూలమైన నది ఏది?
1) హూగ్లీ
2) యమున
3) బ్రహ్మపుత్ర
4) గంగానది
- View Answer
- సమాధానం: 4
37. గుజరాత్ రాష్ట్రంలోని ‘రాణా ఆఫ్ కచ్’లో ఏర్పడే క్రమక్షయం ఏ రకానికి చెందింది?
1) తరంగ క్రమక్షయం
2) రిపారియన్ క్రమక్షయం
3) పర్వతవాలు క్రమక్షయం
4) వంక క్రమక్షయం
- View Answer
- సమాధానం: 1
38. పప్పుధాన్యాలు, నూనె గింజలు అధికంగా ఏ మృత్తికల్లో పండుతాయి?
1) నల్లరేగడి
2) జేగురు
3) ఎర్ర మృత్తికలు
4) ఒండ్రు మృత్తికలు
- View Answer
- సమాధానం:3
39. కింది వాటిలో ‘అజోనల్’ రకానికి చెందిన మృత్తికలు ఏవి?
1) నల్లరేగడి మృత్తికలు
2) ఒండ్రు మృత్తికలు
3) లాటరైట్ మృత్తికలు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
40. ‘రావెన్స్’ అధికంగా ఎక్కడ విస్తరించి ఉన్నాయి?
1) హిమాలయ ప్రాంతాలు
2) చంబల్ నదీ ప్రాంతం
3) ఈశాన్య ప్రాంతాలు
4) పశ్చిమ కనుమలు
- View Answer
- సమాధానం: 2
41. భూ సంపాతాలు, హిమ సంపాతాల మూలంగా ఏర్పడే క్రమక్షయం ఏది?
1) వంక క్రమక్షయం
2) పట క్రమక్షయం
3) పర్వతవాలు క్రమక్షయం
4) తరంగ క్రమక్షయం
- View Answer
- సమాధానం:3
42. వంక క్రమక్షయం కొనసాగడం వల్ల లోతైన, పెద్దవైన లోయలు ఏర్పడటాన్ని ఏమంటారు?
1) అవనాళిక క్రమక్షయం
2) రిపారియన్ క్రమక్షయం
3) పట క్రమక్షయం
4) తరంగ క్రమక్షయం
- View Answer
- సమాధానం: 1
43. చంబల్, మహి నదులు ప్రవహించే ప్రాంతాల్లో ఎలాంటి క్రమక్షయం ఏర్పడుతుంది?
1) పట క్రమక్షయం
2) వంక క్రమక్షయం
3) రిపారియన్ క్రమక్షయం
4) అవనాళికా క్రమక్షయం
- View Answer
- సమాధానం: 4
44. ‘కరి నేలలు’గా వేటిని పేర్కొంటారు?
1) శుష్క నేలలు
2) పీఠి నేలలు
3) క్షార నేలలు
4) జేగురు నేలలు
- View Answer
- సమాధానం: 2
45. కింది వాటిలో ఎక్కువగా అభివృద్ధి చెందని మృత్తికలు ఏవి?
1) ఎడారి మృత్తికలు
2) పీఠి మృత్తికలు
3) క్షార మృత్తికలు
4) పర్వతీయ మృత్తికలు
- View Answer
- సమాధానం: 4
46.పండ్ల తోటలు, సుగంధ ద్రవ్యాలు మొదలైన పంటలకు అనుకూలమైన మృత్తికలు ఏవి?
1) ఒండ్రు మృత్తికలు
2) నల్లరేగడి మృత్తికలు
3) అటవీ మృత్తికలు
4) ఎర్ర మృత్తికలు
- View Answer
- సమాధానం: 3
47. ఖర్జూర, సజ్జ లాంటి పంటలు ఎక్కువగా ఏ మృత్తికల్లో పండుతాయి?
1) పర్వతీయ మృత్తికలు
2) క్షార మృత్తికలు
3) ఎర్ర మృత్తికలు
4) ఎడారి మృత్తికలు
- View Answer
- సమాధానం: 4
48. ‘సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1928
2) 1929
3) 1938
4) 1956
- View Answer
- సమాధానం: 4
49. మృత్తికలోని పొరలను ఏమంటారు?
1) హార్డ్ ప్యాన్స్
2) ప్రొఫైల్
3) ఫెడకల్స్
4) హూరైజన్స్
- View Answer
- సమాధానం: 4
50. కింది వాటిలో ఏ నేలలకు ఎరువులు అతి తక్కువగా అవసరం?
1) నల్లరేగడి మృత్తికలు
2) ఎర్ర మృత్తికలు
3) లాటరైట్ మృత్తికలు
4) అల్యూవియల్ నేలలు
- View Answer
- సమాధానం: 1
51. ఏ నేలలను పంజాబ్లో ‘రే’ లేదా ‘కల్లార్’గా పిలుస్తారు?
1) ఎడారి నేలలు
2) క్షార నేలలు
3) అటవీ నేలలు
4) పీఠి నేలలు
- View Answer
- సమాధానం: 2
52. నల్లరేగడి నేలల చుట్టూ విస్తరించి ఉన్న నేలలు ఏవి?
1) క్షార నేలలు
2) జేగురు నేలలు
3) ఎర్ర నేలలు
4) పీఠి నేలలు
- View Answer
- సమాధానం: 3
-
దేశంలోని మృత్తిక పరిశోధనా సంస్థలు - వాటి కేంద్రాలు
|